World Civil Defense Day |
ప్రపంచ పౌర రక్షణ
దినోత్సవం - మార్చి 1
లక్ష్యం:
పౌర రక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకురావడం మరియు ప్రమాదాలు లేదా విపత్తులు సంభవించినప్పుడు నివారణ మరియు స్వీయ-రక్షణ చర్యల యొక్క సంసిద్ధతపై అవగాహన పెంచడం.
ఎప్పటి నుంచి?
- అంతర్జాతీయ పౌర రక్షణ సంస్థ (ICDO- International Civil Defense Organization) జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని 1990 లో ఏర్పాటు చేసింది.
- 1990 నుంచి ప్రతీ సంవత్సరం మార్చి 1 న ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం (World Civil Defense Day) ను జరుపుకుంటారు.
మార్చి 1 నే ఎందుకు?
1 మార్చి 1972 న ICDO రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది అంతర్-ప్రభుత్వ సంస్థ (Intergovernmental Organization) యొక్క హోదాను సాధించింది.
థీమ్ (Theme):
- 2019: పిల్లల భద్రత, మా బాధ్యత (Children's Safety, Our Responsibility)
ICDO:
- స్థాపన: 1931, పారిస్ (Paris)
- స్థాపించినవారు: ఫ్రెంచ్ సర్జన్ జనరల్ జార్జ్ సెయింట్-పాల్ (George Saint-Paul)
- ప్రధాన కార్యాలయం: స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరం
- దీనిని జూన్ 1935 లో ఫ్రెంచ్ పార్లమెంట్ గుర్తించింది.
LOGO:
ICDO Logo |
వీటిని కూడా చూడండి:
- భారత సైనిక దినోత్సవం (Indian Army Day)
- నేవీ దినోత్సవం (Navy Day)
- BSF ఆవిర్భావ దినోత్సవం (BSF Raising Day)
- భారత సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)