History of Indian Navy in Telugu | భారత నౌకాదళం


History of Indian Navy in Telugu | భారత నౌకాదళం
History of Indian Navy in Telugu


INDIAN NAVY

చరిత్ర:
  • 5000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారతదేశంలో క్రి.పూ.2300లో ప్రస్తుత గుజరాత్ లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడినది.
  • క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు.
  • చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థ శాస్త్రంలో నవాధ్యక్ష (నౌకల నిర్వాహకుడు) పేరుతో నదీ జలాల వినియోగం గురించి నిర్దేశించాడు.
  • బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు 1830లో రాయల్ ఇండియన్ నేవిని ఏర్పరిచారు. ఇది 1946 నాటిక  78 ఓడలు, 2000 మంది నిబ్బంది కలిగి ఉండేది.
  • 26 జనవరి 1950 న భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవిగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్ (INS - Indian Navel Ship)గా పేరు పెట్టారు.
  • 1961లో జరిగిన ఆపరేషన్ విజయ్ లో నేవి మొట్టమొదటిసారి యుద్ధంలో పాల్గొన్నది. (గోవాను పాలిస్తున్న పోర్చుగీస్ సైన్యం సముద్రంలో ఒక ద్వీపం వద్ద వున్న భారత వ్యాపార నౌకలపైన దాడి చేయడంతో భారత ప్రభుత్వం నేవిని రంగంలోకి దింపగా, నౌకలు సైన్యాన్ని మరియు ఆయుధాలను త్వరితగతిన చేరవేసాయి. INS - ఢిల్లీ ఒక పోర్చుగీస్ నౌకను ముంచిన కొద్ది సేపటికే పోర్చుగీస్ సైన్యం ఓటమిని అంగీకరించి గోవాను వదిలి వెళ్ళారు)
  • 1965లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో నేవి ఎక్కువ పాల్గొనకపోయిన తీరప్రాంతాల పరిరక్షణలో కీలకపాత్ర వహించింది.
  • 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో నేవి విశిష్టమైన పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన PNS ఘాజి జలాంతర్గామిని ద్వసం చేసి సముద్రంలో ముంచి వేసిన ఘనత INS - రాజ్ పుత్ కు దక్కుతుంది.
  • INS నిర్ఘాట్, INS నిపత్ లు కరాచీ పోర్షను చుట్టిముట్టి మిగిలిన పాకిస్తాన్  పోర్టులతో రాకపోకలను, పాక్ సైన్యానికి సహాయాన్ని అడ్డుకొని భారత దేశానికి విజయాన్ని అందించడంలో ముఖ్యపాత్ర వహించాయి.

నేవి డే(Navy Day):
  • 1971 డిసెంబరు 4న భారత నేవీ, పాకిస్తాన్ అతిపెద్ద నౌకాశ్రయం అయిన కరాచి పోర్టుపై మెరుపు దాడి చేసి మూడు ఓడలను ముంచి వేసింది.
  • రాత్రి సమయంలో భారత్ చేసిన ఈ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ (Operation Trident) అని అంటారు. దాని జ్ఞాపకార్ధం, భారతదేశంలో నేవీ డేగా జరుపుకుంటారు.
  • ఈ సందర్భంగా విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం ప్రతి ఏటా పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది.

ప్రకృతి విపత్తుల సమయంలో:
  • కేవలం దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు  సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.
  • 2004లో దక్షిణ భారతదేశాన సునామి సంభవించినపుడు కొద్ది గంటల్లోనే  నేవి 27 నౌకలు, 19 హెలీకాప్టర్లు, 06 యుద్ధ విమానా నౌకలు, 5000 మంది సిబ్బందితో ముందుగా సహాయ చర్యలు చేపట్టింది. నేవి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టడం ఇదే  ప్రథమం.

జలాంతర్గాములు(Submarines):
  • ప్రస్తుతం ఇండియన్ నేవీలో 16 జలాంతర్గాములు (సబ్ మెరైన్లు) ఉన్నాయి. ఇందులో ఎక్కవ రష్యా, జర్మనీల నుండి కొనుగోలు చేసినవి. ఇందులో సిందు ఘోష్ తరగతికి చెందినవి 10 ఉన్నాయి.
  • వీటి బరువు 3000 టన్నులు. ప్రతి సబ్ మెరైన్లో 220 KM దూరంలోపు ఉన్న  నౌకలపైన ప్రయోగించగలిగే మిస్సైళ్ళు కలవు. ఇవి సముద్రంలో 300 మీటర్ల లోతువరకు వెళ్ళగలగి, 18 నాట్ల వేగంలో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించగలవు.
  • 1985 నుండి అణు జలాంతర్గాములను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలసి నేవి కృషి చేస్తోంది.
  • 1987లో భారత నౌకాదళంలో జలాంతర్గాముల విభాగాన్ని ఏర్పాటుచేశారు.
  • జలాంతర్గాముల నుండి టార్ఫీడో అను క్షిపణులను ప్రయోగిస్తారు.
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్ట మొదటి సబ్ మెరైన్ - INS షల్కి.
  • 08 డిసెంబర్ 1967లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడిన తొలి జలాంతర్గామి - INS కల్వరి. (దీనిని 31 మే 1996న దీనిని సేవల నుండి విరమింపజేశారు)
  • INS కల్వరిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడిన రోజైన 08 డిసెంబర్ న జలాంతర్గామి దినంగా (Submarine Day) భారత నావికాదళం జరుపుకుంటుంది.
History of Indian Navy in Telugu
INS కల్వరి

కమాండ్(Command):
  • భారత నావికా దళంలో 04 కమాండ్ లు ఉన్నాయి.
         తూర్పు  కమాండ్ - విశాఖపట్నం
         పశ్చిమ కమాండ్ - ముంబాయి
         దక్షిణ కమాండ్ - కోచి
         అండమాన్ నికోబార్ నావల్ - పోర్ట్ బ్లెయిర్

ర్యాంకులు(Ranks):
  • నావిక దళంలోని ర్యాంకులు
        - అడ్మిరల్
        - వైస్ అడ్మిరల్
        - రియల్ అడ్మిరల్
        - కమాడోర్
        - కెప్టెన్
        - కమాండర్
        - లెఫ్టినెంట్ కమాండర్
        - లెఫ్టినెంట్
        - సబ్ లెఫ్టినెంట్

ముఖ్యమైన నౌకల విశిష్టత:
  • INS విక్రాంత్:  భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ (విమాన వాహక నౌక). ఇక 2వది - INS విరాట్, 3వది - INS విక్రమాదిత్య. ఇది 36 సంవత్సరాలు నౌకాదళానికి సేవ చేసిన తర్వాత 1997 జనవరి 31న దీనిని సేవల నుండి విరమింప జేశారు. దీనిని 2000లో సముద్ర మ్యూజియంగా మార్చారు.
  • INS విరాట్: దేశంలో కెల్లా అత్యంత శక్తివంతమైన గైడెడ్ మిస్సైలను ప్రయోగించగల శక్తివంతమైన వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
  • INS విక్రమాదిత్య: రష్యా నుండి కొనుగోలు చేసిన అడ్మిరల్ గోర్ష కోవ్ అను యుద్ద వాహక నౌకను మరమ్మత్తులతో పాటు ఆధునీకరించి నావీలో చేర్చుకుని INS విక్రమాదిత్య అని పేరుపెట్టారు.
  • INS ప్రహార్: అత్యంత వేగవంతమైన మిస్సైల్ బోట్. దీనిని గోవా షిప్ యార్డ్ తయారు చేసింది.
  • INS తరంగిణి: నావిక దళాలలో కొత్తగా చేరిన నావికులకు ఈ నౌకలో శిక్షణను ఇస్తారు. మొట్టమొదటిసారిగా స్వాతంత్రం  నంతరం తరంగిణి ప్రపంచం చుట్టూ చుట్టి వచ్చింది.
  • INS అశ్విని: ఇది నావికా దళంలో ఉన్న నావికులకు వైద్య సేవలందిస్తుంది.
  • INS కోల్‌కతా: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారత దేశపు మొట్ట మొదటి క్షిపణి విద్వంసక నౌక. 2006 మార్చి 30న ముంబాయిలో జల ప్రవేశం చేసింది.
  • INS డిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతిపెద్ద అత్యంత ఆధునిక యుద్ధ నౌక. ఈ నౌక తాను ఉన్న ప్రదేశము నుండి 350 కిమీ చుట్టుపక్కల ఉన్న అన్ని నౌకలను, విమానాలను మరియు సబ్‌ మెరైన్‌ లను పసిగట్టిగలిగి 250 కిమీ లోపు ఉన్న వాటిని నిర్వీర్యం చేయగలదు.
  • INS కదంబ: ఆసియాలోనే అత్యాధునిక స్థావరమైన కదంబను UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ 2005 మే 31న జాతికి అంకితం చేశారు. కర్ణాటకలోని సహజసిద్ద ఓడరేవు కార్వార్ వద్ద ఈ కదంబను అభివృద్ధి చేశారు. భారత నౌకా దళానికి ఇది సొంత రేవుగా ప్రసిద్ధి చెందింది.
  • INS శిఖ్రా: భారత దేశ మొట్టమొదటి నౌకాదళ హెలీ కాప్టర్ స్థావరం అయిన శిఖ్రాను ముంబాయిలో 2009 జనవరి 22న ప్రారంభించారు.
  • INS జలాశ్వ: ఆస్టీన్ తరగతికి చెందిన దీనిని 2007 మార్చిలో భారత నౌకాదళంలో చేర్చారు. తీరప్రాంతం నుంచి దాడి చేయడానికి అనువుగా 900 మంది పూర్తి సాయుధ దళాలను, 06 హెలీ కాప్టర్స్, 04 ఎయిర్ క్రాప్ట్ లను తీసుకొని పోగల సామర్థ్యం ఈ నౌకకుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన USS ట్రెంటాన్ కి  కొన్ని మార్పులు చేసి INS జలాశ్వ పేరు మార్చారు.
  • INS శివాలిక్: భారత తొలి గూఢచార యుద్ద నౌక ఇది. 2003 ఏప్రిల్ 18న ముంబాయిలో జల ప్రవేశం చేసింది.
  • INS విభూతి: పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన మొట్ట మొదటి మిస్సైల్ వెహికల్ (క్షిపణి నౌక).
  • INS సావిత్రి: భారతదేశపు మొట్ట మొదటి యుద్ధ నౌక.

ముఖ్యమైన అంశాలు:
  • 55,000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం మనది.
  • దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు.
  • భారత నౌకాదళ తొలి భారతీయ అడ్మిరల్ (3వ)(Chiefs of the Naval Staff) - ఆర్.డి.కఠారి (22 April 1958 to 04 June 1962)
  • భారత నౌకాదళ ప్రస్తుత (24వ) అడ్మిరల్ - కరం బీర్ సింగ్ (31 మే 2019 నుంచి)
  • భారత రాష్ట్రపతి భారత నావికా దళానికి అధిపతి

యుద్ద నౌకల సమీక్ష(IFR-International Fleet Review):
  • మనం బ్రిటీష్ కాలం నాటి రాయల్ నేవీ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం.
  • ఆధునిక చరిత్రలో బ్రిటన్ కు చెందిన 5వ హెన్రీ 1415లో ఫ్రాన్స్ తో జరిగిన యుద్దాల సందర్భంగా నౌకాదళాన్ని తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.
  • భారత్ లో సర్వ సైన్యాధిపతిగా ఉన్న రాష్ట్రపతి తన పదవీ కాలంలో తప్పనిసరిగా ఒక్కసారి ఇటువంటి సమీక్షను జరుపుతారు.
  • స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన దేశంలో 10 నౌకాదళ సమీక్షలు నిర్వహించారు. మొదటి సమీక్ష 1953లో నిర్వహించారు.
  • మన దేశంలో అంతర్జాతీయ నౌకాదళాలు పాల్గొన్న అంతర్జాతీయ యుద్ద నౌకల సమీక్షలు - 02
(1) 2001 లో ముంబాయిలో నిర్వహించారు. 29  దేశాల యుద్ధనౌకలు మరియు నేవీ సిబ్బంది పాల్గొన్నారు. 
(2) 2016 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్టణంలో నిర్వహించారు. 50 దేశాల యుద్ధనౌకలు మరియు నేవీ సిబ్బంది పాల్గొన్నారు.
History of Indian Navy in Telugu
IFR-2016 LOGO


వీటిని కూడా చూడండీ: