History of Indian Army Day in Telugu | భారత సైనిక దినోత్సవం జనవరి 15 |
Indian Army Day
భారత సైనిక దినోత్సవం - జనవరి 15
ఉద్దేశ్యం:
- మనదేశ ప్రజల పరిరక్షణ కోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమరసైనికులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.
జనవరి 15 నే ఎందుకు?
- భారతదేశానికి చెందిన ఫీల్డ్ మార్షల్ కె.యం.కరియప్ప భారత సైన్యానికి తొలి కమాండర్-ఇన్-చీఫ్ (ఇప్పటి Chief of the Army Staff) గా 1949 జనవరి 15 న బాధ్యతలు స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని జనవరి 15 న ప్రతి సంవత్సరం భారత సైనిక దినోత్సవం జరుపుకుంటున్నాం.
- భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ (Sir Francis Butcher) తరువాత భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా కె.యం.కరియప్ప బాధ్యతలు చేపట్టారు.
Field Marshal K.M.Cariappa |
Field Marshal:
Chief of the Army Staff (COAS):
- ఫీల్డ్ మార్షల్ భారత సైన్యంలో అత్యున్నత ర్యాంక్ (Five-Star) కలిగిన పదవి.
- అయితే ఇది చాలావరకు ఉత్సవ (Ceremonial) సంబంధమైనది. ప్రస్తుత ఆర్మి సంస్థాగత నిర్మాణంలో ఫీల్డ్ మార్షల్ లేరు. వీరు మరణం వరకు సేవలో ఉన్న అధికారిగా పరిగణించబడతాడు. వారు అన్ని వేడుకల సందర్భాలలో పూర్తి యూనిఫాం ధరిస్తారు.
- స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం కేవలం ఇద్దరు ఫీల్డ్ మార్షల్స్ ను మాత్రమే చూసింది.
- మొదటి ఫీల్డ్ మార్షల్ - Sam Manekshaw (1 జనవరి 1973)
- రెండవ/ చివరి ఫీల్డ్ మార్షల్ - కె.ఎం.కరియప్ప (15 జనవరి 1986)
- ప్రస్తుతం భారత సైన్యం అధిపతి (Chief of the Army Staff) గా వ్యవహరించేది - జనరల్ (Four-Star)
- 1748లో Commander-in-Chief పదవిని సృష్టించి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అన్ని దళాలకు కమాండర్ గా చేశారు
- దీనిని స్వాతంత్ర్యం తర్వాత 21 జూన్ 1948 న Chief of the Army Staff and Commander-in-Chief గా మార్చారు. తర్వాత మళ్ళీ 1955లో Chief of the Army Staff గా మార్చారు.
- భారత సైన్యం అధిపతి (Chief of the Army Staff) గా వ్యవహరించేది - జనరల్ (Four-Star)
- మొదటి భారతీయ Commander-in-Chief - కె.ఎం.కరియప్ప (15 Jan 1949 - 14 Jan 1953)
- 28వ Chief of the Army Staff - జనరల్ మలోజ్ ముకుంద్ నరవణె (31 Dec 2019 - 30 Apr 2022)
- 29వ Chief of the Army Staff - జనరల్ మనోజ్ పాండే (30 Apr 2022 to Till Date)
- భారత సైన్యం (Indian Military) లో యాక్టివ్ డ్యూటీలో ఉన్న అత్యున్నత స్థాయి యూనిఫాం అధికారి.
- త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా.. వీరి ముగ్గురిపైన అధికారిగా Chief of Defence Staff అనే పదవిని 1 జనవరి 2020న సృష్టించారు.
- CDS ఏర్పాటుతో త్రివిధ దళాలు, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.
- మొదటి CDS - జనరల్ బిపిన్ రావత్ (1 జనవరి 2020 - 8 డిసెంబర్ 2021)
- 2వ CDS - జనరల్ అనిల్ చౌహాన్ (30 సెప్టెంబర్ 2022 to Till Date)
ఇతర ముఖ్యాంశాలు:
- ఇండియన్ ఆర్మీ అధికారిక స్థాపన తేదీ: 1 ఏప్రిల్ 1895
- భారత సైన్యం యొక్క నినాదం (motto): “Service Before Self”
- భారత సైన్యం యొక్క 2022 సంవత్సరం థీమ్: “భవిష్యత్తులో ముందుకు సాగండి (In Stride with the Future)
వీటిని కూడా చూడండీ: