దీనిని PDF Format లో Download చేసుకోవడానికి ఇక్కడ Click చేయండి.
ఉద్దేశ్యం:
ఎప్పటి నుంచి?
ఈ రోజు కార్యాక్రమాలు:
ఫ్లాగ్ డే ఫండ్ (Flag Day fund):
మాజీ సైనికుల సంక్షేమ శాఖ (DESW- Department of Ex-servicemen Welfare):
భారత సాయుధ దళాల చిహ్నం (Emblem of Indian Armed Forces):
భారత సాయుధ దళాల శాఖలు:
Armed Forces Flag Day |
భారత సాయుధ దళాల పతాక
దినోత్సవం - December 07
ఉద్దేశ్యం:
- సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి మరియు శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు మరియు వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.
- వీర సైనికుల సంక్షేమం చూడటం మనవంతు బాధ్యత. వారికి మరియు వారి కుటుంబాలకు సహాయం చేయడం మన కర్తవ్యం.
ఎప్పటి నుంచి?
- భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన వెంటనే, ప్రభుత్వం తన రక్షణ సిబ్బంది సంక్షేమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
- 1949 ఆగష్టు 28 న రక్షణ మంత్రి నేతృత్వంలోని కమిటీ పతాక దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 7 న జరుపుకోవాలని నిర్ణయించింది.
ఈ రోజు కార్యాక్రమాలు:
- ఈ రోజు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ప్రజల వద్దనుండి సేకరిస్తారు.
- ఇందుకోసంగాను చిన్న స్టిక్కర్ ఫ్లాగ్ మరియు కార్ ఫ్లాగ్ లను ప్రజలకు అందచేసి వారినుండి విరాళాలను సేకరిస్తుంది మరియు కొన్ని హుండీ డబ్బాలను వివిధ విద్యాలయాలకు, కార్యాలయాలకు పంపి వాటి ద్వారా కూడా విరాళాలు స్వీకరిస్తారు.
Sticker Flag |
- ఈరోజున భారత సాయుధ దళాల యొక్క మూడు శాఖలైనా భారత సైన్యం, భారత వైమానిక దళం మరియు భారత నావికాదళం సాధారణ ప్రజలకు వారి సిబ్బంది శ్రమలను ప్రదర్శించడానికి వివిధ రకాల ప్రదర్శనలు, కార్నివాల్, నాటకాలు మరియు ఇతర వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి.
- ఫ్లాగ్ డే ప్రధానముగా మూడు ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుంటుంది.
(1) యుద్ధములో గాయపడినవారికి పునరావాసము కల్పించడం
(2) సర్వీసులో గల సిబ్బంది, వారి కుటుంభీకుల సంక్షేమము
(3) మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబీకుల సంక్షేమము, పునర్నివాసము కల్పించడం.
ఫ్లాగ్ డే ఫండ్ (Flag Day fund):
- ఈ నిధి నుండి మాజీ సైనికులకు మరియు వితంతువులకు మరియు వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తారు.
- ఫ్లాగ్ డే ఫండ్‌ను రక్షణ మంత్రి నేతృత్వంలోని కమిటీ 1949 లో ఏర్పాటు చేసింది.
- ఈ సంక్షేమ నిధుల్ని 1993 లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ ధళాల పతాక దినోత్సవ నిధి (AFFDF- Armed Forces Flag Day fund) గా మార్చింది.
- ఆ నిధులలో ఈ క్రింది నిధులు కూడా కలిసి ఉంటాయి.
(1) Amalgamated Special Fund for War Bereaved, War Disabled and other ex-Servicemen/Serving Personnel
(2) St Dunstan's (India) and Kendriya Sainik Board Fund
(3) Indian Gorkha Ex-Servicemen's Welfare Fund.
మాజీ సైనికుల సంక్షేమ శాఖ (DESW- Department of Ex-servicemen Welfare):
- సైనిక సంక్షేమ శాఖ అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాల సంక్షేమము కొరకు ప్రత్యేకముగా 2004 లో స్థాపించబడింది.
- ఇది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ఒక విభాగం.
- కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వము తరుపున అందించే అన్ని రాయితీలను వారికి సక్రమముగా చేర్చుట కొరకు ఈ శాఖ ప్రత్యేకముగా కృషిచేస్తుంది.
భారత సాయుధ దళాల చిహ్నం (Emblem of Indian Armed Forces):
భారత సాయుధ దళాల శాఖలు:
- భారత సైన్యం (Indian Army)
- భారత వైమానిక దళం (Indian Air Force)
- భారత నావికాదళం (Indian Navy)