Ear Structure And Diseases |
చెవి (Ear):
- చెవి (Ear) జంతుజాతులలో శబ్దాల్ని గ్రహించే జ్ఞానేంద్రియం. మనిషికి రెండు చెవులు తలకి ప్రక్కగా ఉంటాయి.
చెవి నిర్మాణం:
చెవిని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు.
(1) బయటి చెవి (Outer Ear):
పైకి కనిపించేది ఇదే. దీని గుండానే శబ్ద తరంగాలు లోపలికి అడుగిడతాయి.(2) మధ్య చెవి (Middle Ear):
ఇందులో శబ్ద తరంగాలకు కంపించే కర్ణభేరి, దానికి అనుసంధానంగా మూడు గొలుసు ఎముకలు (Incus, Malleus, Stepes) ఉంటాయి. ఆయా శబ్దాలకు కర్ణభేరితో పాటు గొలుసు ఎముకలూ కంపిస్తాయి.(3) లోపలి చెవి (Inner Ear):
వినికిడికి తోడ్పడే అత్యంత కీలకమైన, సున్నితమైన భాగం ఇది. గుండ్రంగా, నత్తలా కనిపించే కాక్లియా ఉండేది ఇందులోనే. మధ్య చెవిలోని గొలుసు ఎముకల్లో ఒకటి దీనికి అనుసంధానమై ఉంటుంది. కాక్లియాలో ద్రవం, ఆ ద్రవంలో తేలియాడే సున్నితమైన, సూక్ష్మమైన వెంట్రుకల్లాంటి రోమకణాలు వినికిడిలో కీలకపాత్ర పోషిస్తాయి. కర్ణభేరి, గొలుసు ఎముకల కదలికలతో కాక్లియాలోని ద్రవంలో సున్నితమైన అలలు లేస్తాయి. ఇవి రోమకణాలు అటూఇటూ కదిలేలా చేస్తాయి. వీటి నుంచి పుట్టుకొచ్చే విద్యుత్ ప్రచోదనాలు శ్రవణ నాడి ద్వారా ప్రయాణించి మెదడుకు చేరుకుంటాయి. అప్పుడు మెదడులో మాటలు, వినికిడికి సంబంధించిన భాగం శబ్దాలను విడమరచి వినపడేలా చేస్తుంది. అప్పుడే మనకు శబ్దాలను విన్న అనుభూతి కలుగుతుంది.
చెవుడు (Deafness):
కారణాలు:
- వృత్తి రీత్యా దీర్ఘకాలము పెద్ద శబ్దాలు వినేవారు.
- దీర్ఘకాలిక చెవి ఇన్ పెక్షనుతో బాధపడడం.
- కర్ణ భేరికి సంబంధించిన వ్యాధులు.
- కర్ణ భేరి చిట్లుట
- చెవి లోపల కండరము పెరుగుదల. ఎముకలు అసాధారణంగా పెరుగుట వలన గడ్డలు, కాన్సరు లాంటి వ్యాధులు.
- సాధారణంగా మాట్లాడలేక పోవడం.
- ఎదుటివాళ్ళతో మాట్లడుతున్నప్పుడు సరిగ్గా అర్దం చేసుకోలేకపోవడం.
- పెద్ద శబ్దముతో ఇతరులను మాట్లాడమనడం.
- రేడియో వింటున్నప్పుడు కాని, టి.వి చూస్తున్నప్పుడు కాని శబ్దము అధికముగా పెట్టడం.
- చిన్నపిల్లలలో ఎలాంటి శబ్దానికి సమాధానము లేకపోవడం.
- అధిక శబ్దాలకు అసాధారణ శబ్దాలకు దూరంగా ఉండాలి.
- శబ్ద కాలుష్యము ఉన్న వృత్తిలో మార్పు చేయడం.
- వ్యాధి నిర్దారణ చికిత్స. వీలైనంత త్వరగా డాక్టరు సలహా తీసుకోవడం.
- చిన్న పిల్లలకు వినికిడి సమస్య త్వరగా గుర్తించి తగు చర్యలు తీసుకోవడం.
- ప్రత్యేకమైన వినికిడి పరికరాలు ఉపయోగించడం.
చెవిలో చీము (Pus In The Ear):
చిన్న పిల్లలలో చెవిలోంచి చీము (Pus) కారడం చాలా సాధారణంగా చూసే వ్యాధి లక్షణం. చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు, అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వాపు (Encephalitis Lethargica) వ్యాధి లక్షణాలు కలుగుతాయి.వ్యాధి లక్షణాలు:
ఒక చెవి లేదా రెండు చెవులలోంచి చీము, నీరు, దుర్వాసనతో చీము వస్తుంటాయి. జలుబు చేసినపుడు ఎక్కవవుతుంటుంది. చెవినొప్పి, పోటు, జ్వరం కూడా రావచ్చును.జాగ్రత్తలు:
నీరు చెవిలో పోనివ్వకూడదు. దూదిపెట్టి స్నానం చేయించాలి. ఈదనివ్వకూడదు. చిన్నపుల్లకి దూదిచుట్టి కనిపించినంత మేరకు చీము తుడిచి శుభ్రం చేయాలి. నూనె, పసర్లు పోయనివ్వకూడదు. డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి.
మరికొన్ని అంశాలు:
- చెవి అధ్యయనం - ఓటాలజి (Otology)
- మానవ శరీరంలో అతి చిన్న ఎముక - కర్ణాంతరాస్థి (Stepes)
- చెవిలోని ఎముకల సంఖ్య - 3+3 = 6
- చెవి దగ్గర ఉండే గ్రంథులు - పెరోటిడ్ గ్రంథులు
- 85 డెసిబెల్స్ దాటితే మనిషి వినికిడి మీద దుష్పలి తాలు కలుగుతాయి. 120 డెసిబెల్స్ దాటితే చెవిలో నొప్పి మొదలవుతుంది. ధ్వని తీవ్రత ప్రమాణం - డెసిబెల్ (డెసిబెల్ అనేది బెల్ లో 1/10వ వంతు)
- ధ్వని తరంగాలు చెవిలో కర్ణభేరిని కనీసం 1/10 సెకన్ల కాలం పాటు తాకితే వినికిడి జ్ఞానం కలుగుతుంది.
- ఆరోగ్యవంతమైన మానవుడు ధ్వని తరంగాలను 20 HZ నుండి 20,000 HZ (20 KHZ) మాత్రమే వినగలడు. ఈ అవధిని శ్రవ్య అవధి అని, ఈ తరంగాలను శ్రావ్య తరంగాలు అని అంటారు.
వీటిని కూడా చూడండి:
- ప్రపంచ వినికిడి దినోత్సవం (World Hearing Day)
- వ్యాధులు (Diseases)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)