National Safety Day |
జాతీయ భద్రతా
దినోత్సవం - మార్చి 4
లక్ష్యం:
ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవనవిధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంతర్గత భాగంగా మలుచుకునేలా వారిలో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య లక్ష్యం.
ఎప్పటి నుంచి?
1972 నుంచి ప్రతీ సంవత్సరం మార్చి 4 న జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day) ను జరుపుకుంటారు.
మార్చి 4 నే ఎందుకు?
- భారత ప్రభుత్వపు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (Ministry of Labour and Employment) 1966 మార్చి 4 వ తేదీన జాతీయ భద్రతా మండలి (National Safety Council) ని స్థాపించింది.
- దీనికి గుర్తుగా ప్రతీ సంవత్సరం మార్చి 4 న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
థీమ్ (Theme):
- 2020: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యం మరియు భద్రతా పనితీరును మెరుగుపరచండి (Enhance Health & Safety Performance by Use of Advanced Technology)
జాతీయ భద్రతా మండలి (National Safety Council):
- దీని ప్రధాన కార్యాలయం - ముంబై
- జాతీయ భద్రతా మండలి అనేది భారతదేశంలో జాతీయ స్థాయిలో ఒక ప్రధాన, లాభాపేక్షలేని, స్వయం-ఫైనాన్సింగ్ మరియు త్రైపాక్షిక శిఖరాగ్ర సంస్థ.
- ప్రమాదాలపట్ల అప్రమత్తత పెంచాలంటే ప్రచారము అవసరమని, అందుకు దానిని నిర్వహించడానికి, కార్మికులలో భద్రతపట్ల అవగాహన పెంచేందుకు ప్రభుత్వపరంగా ఒక సంస్థ అవసరమని గుర్తించారు.
- 1965 డిసెంబర్ లో పారిశ్రామిక భద్రత మీద తొలి సమావేశము ఢిల్లీ లో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు సంస్థలు పాల్గొన్న ఆ సభలో జాతీయ, రాష్ట్ర స్ఠాయిలో భద్రతా మండలి ప్రారంభించాలని నిర్ణయించారు.
- తరువాత, భారత ప్రభుత్వపు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (Ministry of Labour and Employment) చే 1966 మార్చి 4 వ తేదీన జాతీయ భద్రతా మండలి స్థాపించబడింది.
- ఇది సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం - 1860 క్రింద సొసైటీగా నమోదు చేయబడింది. తరువాత బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టం - 1950 ప్రకారం పబ్లిక్ ట్రస్ట్ గా నమోదు చేయబడింది.
- భద్రత, ఆరోగ్యం, పర్యావరణాలపై (SHE- Safety, Health and Environment) అవగాహన పెంపొందించడం ఈ మండలి లక్ష్యం.
- సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లతో పాటు సేఫ్టీ ఆడిట్లు వంటి కార్యక్రమాలను ఈ మండలి నిర్వహిస్తుంది.
LOGO:
National Safety Council Logo |
జాతీయ భద్రతా వారోత్సవాలు (National Safety Week):
ప్రతి పనిలోను ఏదో ఒక ప్రమాదము పొంచివుంటుంది. కొన్ని రకాల ప్రమాదాలను ముందుగా పసిగట్టలేము. కాని ప్రమాదాలలో అధిక శాతము అజాగ్రత్తవల్ల సంభవించేవే. నానాటి ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున పారిశ్రామిక, రహదారి భద్రతల మీద దృష్టి పెంచారు. ప్రాణనష్టం అధికంగా ఉన్న ఈ రంగాలతో పాటు అగ్ని ప్రమాదాల నివారణ గురించి కూడా ప్రచారము నిర్వస్తారు. పారిశ్రామికవేత్తలు కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లు, కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించి, వాటిని అమలుజరిగేలా ప్రచారాన్ని జాతీయ భద్రతా వారోత్సవం (National Safety Week) సందర్భముగా నిర్వహిస్తారు.
స్వచ్చంద సేవా సంస్థలకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అవి జరిగినపుడు ఎలా స్పందించాలనే అంశాలను చిన్న చిన్న ఫిల్మ్ ద్వారా ప్రదర్శిస్తారు.
మరికొన్ని అంశాలు:
పనిచేసేందుకు వెళ్ళినవారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో రారో అన్న ఆందోళనతో కుటుంబసభ్యులు బతకాల్సి వస్తుంది. కుటుంబ పెద్దకు ప్రమాదము జరిగినా, ప్రమాదములో మరణించినా ఇక ఆ కుటుంబము మొత్తము కోలుకోని విధంగా దెబ్బతుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భద్రతను పాటించాలి. ప్రతీ కార్మీకుడు తాను తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే, సూచించిన పద్దతులను పాటిస్తే ప్రమాదాలు సంభవించవు.
వీటిని కూడా చూడండి:
- జాతీయ భద్రతా మండలి (National Safety Council) Official Website
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)