Banner 160x300

History of Vijay Diwas in Telugu | విజయ్ దివాస్


History of Vijay Diwas in Telugu | విజయ్ దివాస్ - డిసెంబర్ 16
Vijay Diwas in telugu, Vijay Diwas essay in telugu, History of Vijay Diwas, about Vijay Diwas, Themes of Vijay Diwas, Celebrations of Vijay Diwas, Vijay Diwas, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in December, days celebrations in December, popular days in December, December lo dinostavalu, special in December 16, Student Soula,

విజయ్ దివాస్ - డిసెంబర్ 16

ఉద్దేశ్యం:
  • 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం భారత్ – పాక్ మధ్య జరిగిన యుద్ధంలో (Bangladesh Liberation War) భారత్ విజయానికి చిహ్నంగా విజయ్ దివాస్ (Vijay Diwas) ను భారత్ జరుపుకుంటుంది.
  •  యుద్దంలో ప్రాణాలు అర్పించిన భారతీయ అమరవీరులకు (సైనికులకు) నివాళులు అర్పించడం కోసం విజయ్ దివాస్ వార్షికోత్సవం భారతదేశం అంతటా జరుపుకుంటారు

ఎప్పటి నుంచి?
  • 1972 నుంచి ప్రతీ సంవత్సరం డిసెంబర్ 16ను విజయ్ దివాస్ గా భారతదేశం అంతటా జరుపుకుంటారు.

డిసెంబర్ 16నే ఎందుకు?
  • 16 డిసెంబర్ 1971 న , తూర్పు పాకిస్తాన్‌లో (ఇప్పటి బంగ్లాదేశ్) ఉన్న పాకిస్తాన్ ఆర్మీ దళాల లెఫ్టినెంట్ జనరల్ A.A.K.నియాజి (Amir Abdullah Khan Niazi), Instrument of Surrender పై సంతకం చేశారు. 93000 మంది పాకిస్తాన్ దళాలు భారత దళాలకు మరియు బంగ్లాదేశ్ విముక్తి దళాలకు లొంగిపోయాయి.

యుద్ద కాలం:
  • 26 మార్చి 1971 నుండి 16 డిసెంబర్ 1971 వరకు (Bangladesh Liberation War).
  • పాకిస్తాన్ ఉత్తర భారతదేశంపై ముందస్తు వైమానిక దాడులను (ఆపరేషన్ చెంఘిజ్‌ ఖాన్) ప్రారంభించిన తరువాత, 03 డిసెంబర్ 1971 న భారతదేశం యుద్ధంలో చేరింది.
  • 13 రోజులు మాత్రమే నడిచిన ఈ యుద్ధాన్ని చరిత్రలోని అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాలలో ఒకటిగా గుర్తిస్తారు.

ఈ యుద్దం తీవ్రత:
  • ముక్తి బాహిని (Mukti Bahini) నుండి 175000 మంది, భారత ఆర్మీ నుండి 250000 మంది, పాకిస్తాన్ నుండి 365000 మంది సైనికులు ఈ యుద్దంలో పాల్గొన్నారు.
  • ముక్తి బాహిని (Mukti Bahini) నుండి 30000 మంది సైనికులు చనిపోయారు.
  • భారత ఆర్మీ నుండి 1426 - 1525 మంది సైనికులు చనిపోయారు. 3611 - 4061మందికి పైగా గాయాలైనాయి. 
  • పాకిస్తాన్ నుండి 6761 మంది సైనికులు చనిపోయారు. 12000 మందికి పైగా గాయాలైనాయి. 
  • అలాగే ఈ యుద్దంలో చనిపోయిన పౌరుల సంఖ్య 3 లక్షల నుండి 30 లక్షల మధ్య ఉంటుందని అంచన.

యుద్దానికి దారి తీసిన పరిణామాలు:
  • అఖండ భారతం బ్రిటీష్ పాలన అనంతరం భారతదేశం మరియు పాకిస్తాన్ అను రెండు దేశాలుగా విడిపోయింది.
  • పాకిస్తాన్ పశ్చిమ జోన్ ను పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి పాకిస్తాన్) అని మరియు తూర్పు జోన్ ను తూర్పు బెంగాల్, తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) అని పిలిచేవారు.
  • రెండు జోన్ల జనాభా సమానానికి దగ్గరగా ఉన్నప్పటికీ, రాజకీయ అధికారం పశ్చిమ పాకిస్తాన్‌లో కేంద్రీకృతమై ఉండేది.
  • తూర్పు పాకిస్తాన్ ఆర్థికంగా దోపిడీకి గురి అవుతోందని విస్తృతంగా గ్రహించబడింది, ఇది అనేక మనోవేదనలకు దారితీసింది.
  • పాకిస్తాన్ లో బెంగాలీ మాట్లాడే ప్రజలు దేశ జనాభాలో 30% పైగా ఉన్నప్పటికీ ఉర్దూను మాత్రమే పాకిస్తాన్ యొక్క సమాఖ్య భాషగా ప్రకటించడం.
  • రెండు నిరంతర భూభాగాల పరిపాలన కూడా ఒక సవాలుగా భావించబడింది.

యుద్దానికి తక్షణ కారణం:
  • 1970 పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలలో అవామి లీగ్ (Bangladesh Awami League) 313 సీట్లలో 167 స్థానాలను కైవసం చేసుకుంది.
  • దీంతో అవామి లీగ్ నాయకుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్ (Sheikh Mujibur Rahman)కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రాజ్యాంగ హక్కు వచ్చింది.
  • అయితే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ  నాయకుడు  జుల్ఫికర్ అలీ భుట్టో (Zulfikar Ali Bhutto) షేక్ ముజిబూర్ రెహ్మాన్ పాకిస్తాన్ ప్రధాని కావడానికి అనుమతించటానికి నిరాకరించారు.
  • అవామి లీగ్ నాయకుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్ తూర్పు పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ అనే పేరుతో స్వాతంత్ర్యాన్ని 26 మార్చి 1971 న ప్రకటించాడు.

Operation Searchlight (ఆపరేషన్ సెర్చ్ లైట్):
  • అవామి లీగ్ గెలిచిన ఎన్నికలను పాలకవర్గం (పశ్చిమ పాకిస్తానీ) విస్మరించిన తరువాత, తూర్పు పాకిస్తాన్‌లో పెరుగుతున్న రాజకీయ అసంతృప్తి మరియు బెంగాలీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అరికట్టడానికి పాకిస్తాన్ సైన్యం 1971 మార్చి 25 లో  చేపట్టిన ప్రణాళికాబద్ధమైన, క్రూరమైన సైనిక చర్యనే ఆపరేషన్ సెర్చ్ లైట్ అని పిలుస్తారు.
  • ఈ ఆపరేషన్ సెర్చ్ లైట్ 1971 మే 25 వరకు జరిగింది.

ముక్తి బాహిని (Mukti Bahini):
  • బెంగాలీ సైన్యం, పారామిలటరీ, పౌరులతో ఏర్పడిన జాతీయ విముక్తి సైన్యమే ఈ ముక్తి బాహిని.
  • ఈ సైన్యంలో దాదాపు 175000 మంది సైనికులు ఉండేవారు.
  • గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఉపయోగించి, ముక్తి బాహిని బెంగాలీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ భాగం నియంత్రణ సాధించింది. ముక్తి బాహిని  భారతదేశం  నుండి శిక్షణ మరియు ఆయుధాలను పొందింది.

అమర్ జవాన్ జ్యోతి:
  • ఇండియా గేట్ ఒక యుద్ధ స్మారకం. ఇది న్యూడిల్లీలోని రాజ్‌పథ్ యొక్క తూర్పు చివరలో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం మరియు మూడవ ఆంగ్లో - ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికులకు నివాళిగా ఈ స్మారకాన్ని 1921లో నిర్మించారు.
  • అయితే 1971 నుండి ఇండియా గేట్ కింద మంటలు వెలుగుతూ ఉన్నాయి. ఈ శాశ్వతమైన జ్వాల బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన ప్రతి తెలియని సైనికుడిని గౌరవిస్తుంది. 
  • దీనిని 1971 డిసెంబర్‌లో నిర్మించారు. 1972లో భారతదేశం యొక్క 23 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్మారక చిహ్నాన్ని అధికారికంగా ప్రారంభించి సైనికులకు నివాళులర్పించారు.
  • అమర్ జవాన్ జ్యోతి భారతదేశ  అజ్ఞాత సైనికుడి సమాధిగా పనిచేస్తుంది. ఇది ఒక పాలరాయి సమాధి. ఇందులో రైఫిల్ (L1A1 self-loading rifle) మరియు సైనికుడి హెల్మెట్ ఉంటుంది.
అమర్ జవాన్ జ్యోతి, Amar jawan jyothi
అమర్ జవాన్ జ్యోతివద్ద నివాళులర్పిస్తున్న
ప్రధాని నరేంద్ర మోడీ
అమర్ జవాన్ జ్యోతి, Amar jawan jyothi
అమర్ జవాన్ జ్యోతి

వీటిని కూడా చూడండీ: