History of National Energy Conservation Day in Telugu | జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం - డిసెంబర్ 14 |
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం - డిసెంబర్ 14
ఉద్దేశ్యం:
- ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (National Energy Conservation Day) ను జరుపుకుంటారు.
- ఇంధన పొదుపు అంటే వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూ యథావిధిగా పని కొనసాగేలా చూడటమే! ఎక్కడా ఇంధనం వృథా కాకుండా జాగ్రత్తపడాలి.
ఎప్పటి నుంచి?
- 1991 నుంచి ప్రతీ సంవత్సరం డిసెంబరు 14 న భారత ప్రభుత్వ Bureau of Energy Efficiency (BEE) విభాగం భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
ఇంధనం (Fuel):
- ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా లేక జరగాలన్నా దానికి కావలసిన శక్తి (Energy) లభించాలి. శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును.
- ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్లేక పోతే బండి, బస్సూ ఏదీ కదలదు. విద్యుత్తు లేకపోతే టీవీ, మిక్సీ, రిఫ్రిజిరేటరు, మైక్రోవేవ్ ఏవీ పనిచేయవు. ఫ్యూయల్ నిల్లయితే (Nil) విమానం నేలమీద కూడా నడవదు. సిలిండర్‌లో గ్యాస్ లేకుంటే అన్నం, కూరలు కాదు గదా గుక్కెడు కాఫీ కూడా వెచ్చబడవు. పత్రహరితం కరువైతే మొక్కలు వాడిపోతాయి. వాటికదే ఇంధనం లాంటిది. మొత్తానికి ఇంధనం లేకపోతే జగమే మాయ, బ్రతుకే లోయ అని పాడుకోవాల్సివస్తుంది.
జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు:
- 1991వ సంవత్సరం నుండి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఇంధన పరిరక్షణకు కృషి చేసిన వివిధ పరిశ్రమలు, కంపెనీల (ఇండస్ట్రియల్ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్ మాల్ బిల్డింగులకు, జోనల్ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్ పవర్ స్టేషన్లు) కు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు (National Energy Conservation Award) అందజేస్తున్నారు.
ఇతర అంశాలు:
- 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని (Energy Conservation Act) తీసుకువచ్చింది.
- ప్రపంచ వ్యాప్తంగా రానున్న పరిస్థితులను దృష్టిలోనికి తీసుకుని 2019 మే 1వ తేదీన బ్రిటన్ (యు.కె) మొదటగా ప్రపంచ వాతావరణ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ప్రకటించింది.
వీటిని కూడా చూడండీ: