Sunday, July 16, 2023

Making of Indian Constitution in Telugu | భారత రాజ్యాంగ రచన | Student Soula

Making of Indian Constitution in Telugu | భారత రాజ్యాంగ రచన | Student Soula


  1. సాధారణంగా రాజ్యాంగాన్ని రూపొందిచడానికి రెండు పద్ధతులు పాటిస్తారు.
    1. రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంట్ రూపొందించడం.
    2. రాజ్యాంగ రచనకు ప్రత్యేక పరిషత్ లేదా సంస్థను ఏర్పాటు చేసి తద్వారా రాజ్యాంగాన్ని రచించడం.
  2. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం: అమెరికా
    1. 1787లో అమెరికా ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకుంది.
  3. 1789లో ఫ్రాన్స్ దేశంలో కాన్‌స్టిటుయంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుని రాజ్యాంగ రచన చేశారు.
  4. రాజ్యాంగం అంటే?

భారత రాజ్యాంగ పరిషత్తు - చరిత్ర:

  1. రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ/ రాజ్యాంగ పరిషత్ అంటారు.
  2. నెహ్రూ రిపోర్ట్:
    1. రాజ్యాంగ రచనకు భారత జాతీయ కాంగ్రెస్ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఒక ఉప సంఘాన్ని 1928 మే 19న నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను నెహ్రూ రిపోర్ట్ అంటారు.
    2. దీనిని భారతీయులు స్వంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు.
    3. More...
  3. M.N.రాయ్ 1934లోనే రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించారు.
  4. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీపరంగా మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును డిమాండ్ చేసింది.
  5. 1942లో క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
  6. 1946లో క్యాబినెట్ మిషన్ (క్యాబినెట్ రాయబారం) సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అయింది.
  7. భారత స్వాతంత్ర చట్టం-1947 ద్వారా రాజ్యాంగ పరిషత్తుకు చట్టబద్ధత కల్పించడం జరిగింది.

రాజ్యాంగ పరిషత్తు - సభ్యులు:

  1. 1946 జులై, ఆగస్టులో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి.
  2. క్యాబినెట్ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం ఇతర ప్రక్రియలను నిర్ణయించడం జరిగింది.
  3. ప్రతి ప్రొవిన్స్ నుండి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు.
  4. బ్రిటీష్ పాలిత ప్రాంతాలలో మూడు ప్రధాన వర్గాలైన ముస్లింలు, సిక్కులు, జనరల్ కేటగిరివారికి జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు.
  5. రాజ్యాంగ పరిషత్తులోని కొందరు సభ్యులు ప్రొవిన్సియల్ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల చేత (పాక్షికంగా, పరోక్షంగా) ఎన్నుకోబడ్డారు. దీనినే పరిమిత ఒటు పద్ధతి అంటారు. కొంతమంది సభ్యులు నామినెట్ అయ్యారు.
  6. రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యులు: 389
    1. బ్రిటీష్ ఇండియా నుండి: 292
    2. స్వదేశి సంస్ధానాల నుండి (నామినెట్): 93
    3. ఛీఫ్ కమీషనర్ ప్రాంతాల నుండి: 4
  7. ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండుతో భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి నిష్క్రమించింది. అందువల్ల రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299 కి తగ్గింది.
    1. బ్రిటీష్ ఇండియా నుండి: 229
    2. స్వదేశి సంస్ధానాల నుండి (నామినెట్): 70
  8. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మహిళలు: 15 మంది
    1. దుర్గాబాయి దేశ్‌ముఖ్, రాజకుమారి అమృత్‌కౌర్, విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు, హన్సా మెహతా, సుచిత్రా కృపలానీ, అమ్ముస్వామినాథన్, అన్ మాస్కెర్నె నాథ్, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయణి వేలాయుధన్, కమలా చౌదరి, లీలా రే, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రేణుక రే.
  9. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన తెలుగువారు:
    1. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముశ్, కళా వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జీ రంగా, వీసీ కేశవరావు, ఎం.తిరుమలరావు, బొబ్బొలి రాజా రామకృష్ణ రంగారావు.
  10. రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యులు: 15 మంది
    1. ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఉన్నారు.
  11. రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కానివారు: B.N.రావ్, H.V.కామత్, వరదాచారియర్

రాజ్యాంగ పరిషత్తు - కమిటీలు:

  1. రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు.
    1. ఇందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, వీటికి అనుబంధంగా 7 ఉప కమిటీలు, 15 మైనర్ కమిటీలను కూడా నియమించారు.
  2. ఈ కమిటీలలో అతిపెద్ద కమిటీ: సలహా కమిటీ
  3. ఈ కమిటీలలో అత్యంత ముఖ్యమైన కమిటీ: డ్రాఫ్టింగ్ (ముసాయిదా) కమిటీ
  4. కొన్ని ముఖ్యమైన కమిటీలు:
కమిటీ పేరు చైర్మన్
ముసాయిదా కమిటీ డాII బి.ఆర్. అంబేద్కర్
కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ జవహర్ లాల్ నెహ్రూ
సారథ్య కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, రూల్స్ కమిటీ రాజేంద్ర ప్రసాద్
ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ, మైనారిటీలు, ట్రైబల్స్, ఎక్స్ క్లూడెడ్ ప్రాంతాలపై కమిటీ
(ఇందులో 5 సబ్ కమిటీలు ఉన్నాయి)
సర్దార్ వల్లభాయ్ పటేల్
సబ్ కమిటీలు
ప్రాథమిక హక్కుల సబ్-కమిటీ జె.బి. కృపలాని
మైనారిటీల సబ్-కమిటీ హెచ్.సి.ముఖర్జీ
ఈశాన్య రాష్ట్రాల హక్కుల సబ్-కమిటీ గోపినాథ్ బోర్డోలాయ్
ప్రత్యేక ప్రాంతాల సబ్-కమిటీ ఎ.వి.టక్కర్
నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ సబ్-కమిటీ -


ముసాయిదా కమిటీ (Drafting Committee):
  1. ఇది రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీ.
  2. ఏర్పాటు: 1947 ఆగస్ట్ 29
  3. సభ్యులు:
    1. (1) డాII బి.ఆర్.అంబేద్కర్ (చైర్మన్)
    2. (2) ఎన్.గోపాలస్వామి అయ్యంగర్
    3. (3) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
    4. (4) కె.ఎం.మున్షి
    5. (5) సయ్యద్ మహమ్మద్ సాదుల్లా
    6. (6) ఎన్.మాధవరావు (బి.ఎల్.మిత్తల్ రాజీనామాతో)
    7. (7) టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ మరణించడంతో)
  4. ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌ లను తయారు చేసింది.
  5. రాజ్యాంగ ముసాయిదా 1948 ఫిబ్రవరి 21న ప్రచురించబడింది.
    1. ఈ ముసాయిదా రాజ్యాంగం గురించి ప్రజల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత, అవసరమైన సవరణలు చేసిన భారత రాజ్యాంగ తొలి ముసాయిదా 26 అక్టోబర్ 1948లో తయారైంది.
  6. ఇందులో 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి.
  7. రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ ముసాయిదాను మూడుసార్లు పఠనం చేశారు.
  8. దీనిపై 7,635 సవరణలు ప్రతిపాదించగా, అందులో 2,473 చర్చకు వచ్చాయి.
    1. ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది: H.V.కామత్
  9. రాజ్యాంగ పరిషత్తు ఈ ముసాయిదాను 114 రోజులలో పరిశీలించింది.
  10. ఈ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబర్ 26న ఆమోదించింది.
    1. 2015లో భారత రాజ్యాంగ పితామహుడు అంబేడ్కర్ 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంబేడ్కర్ సేవలకు గుర్తుగా (పుట్టిన/మరణించిన రోజు కాదు) నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం (Constitution Day)గా భారత ప్రభుత్వం ప్రకటించింది.

రాజ్యాంగ పరిషత్తు - సమావేశాలు:

  1. మొత్తం 12 సమావేశాలు జరిగాయి.
మొదటి సమావేశం (1946 డిసెంబర్ 9-23):
  1. ఇది ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో జరిగింది. 
  2. ఈ సమావేశానికి 211 మంది (9 మంది మహిళ సభ్యులతో సహా) హాజరయ్యారు.
  3. తాత్కాలిక అధ్యక్షుడు: డా|| సచ్చిదానంద సిన్హా
  4. శాశ్వత అధ్యక్షుడు: డా|| రాజేంద్రప్రసాద్
    1. ఉపాధ్యక్షులు: H.C.ముఖర్జీ & V.T.కృష్ణమాచారి
  5. 1946 డిసెంబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ 8 అంశాలతో  కూడిన ఆశయాల తీర్మానాన్ని (Objectives Resolution) ప్రతిపాదించాడు.
    1. ఈ ఆశయాల తీర్మానమే రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలం. 
    2. ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారం.
    3. ఈ ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది.
చివరి సమావేశం (1950 జనవరి 24):
  1. ఇది 12వ సమావేశం.
  2. హాజరైన సభ్యులు: 284 మంది
  3. భారత రాష్ట్రపతిగా డా|| రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు.
  4. జాతీయ గేయంగా వందే మాతరం ను ఆమోదించారు.
  5. జాతీయ గీతంగా జనగణమన ను ఆమోదించారు.

భారత రాజ్యాంగానికి ఆధారం:

  1. భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాల సంఖ్య: 60
  2. ప్రపంచంలోని రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను భారతదేశంలో సరిపోయే విధంగా స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు.
    1. అందుకే రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు.
  3. భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం: భారత ప్రభుత్వ చట్టం-1935
    1. అందుకే భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వ చట్టం-1935 యొక్క నకలుగా వర్ణిస్తారు.
ఆధారం గ్రహించిన అంశాలు
భారత ప్రభుత్వ చట్టం-1935 కేంద్ర, రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ కోర్టు, రాష్ర్టపతి పాలన (ఆర్టికల్ 356), గవర్నర్ పదవి, విచక్షణాధికారాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇతర పరిపాలన అంశాలు.
బ్రిటిష్ రాజ్యాంగం పార్లమెంటు/కేబినెట్ తరహా పాలనా పద్ధతి, ద్విసభా పద్ధతి, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ మొదలైన పదవులు, రిట్లు జారీచేసే విధానం.
అమెరికా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ, ఉప రాష్ర్టపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ర్టపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం.
కెనడా బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ నియామక పద్ధతి. రాజ్యాంగం అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ఆర్టికల్ 143 ప్రకారం రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహా కోరడం.
ఐర్లాండ్ రాజ్యాంగం ఆదేశిక సుత్రాలు, రాష్ర్టపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఓటు బదిలీ పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం.
వైమార్ రిపబ్లిక్(జర్మనీ) జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారం మొదలైనవి. (వైమార్ అనేది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్తు సమావేశమైన నగరం).
ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం (బిల్లు ఆమోదం విషయంలో వివాదం తలెత్తితే), వాణిజ్య, వ్యాపార లావాదేవీలు, అంతర్రాష్ట వ్యాపారం.
దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి.
ఫ్రాన్స్ గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.
రష్యా ప్రాథమిక విధులు, దీర్ఘకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు.
జపాన్ నిబంధన 21లో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతి.
స్విట్జర్లాండ్ ప్రధాని, మంత్రిమండలి మధ్య సమష్టి బాధ్యత.


ముఖ్యమైన అంశాలు:

  1. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన విధులతో పాటు తాత్కాలిక పార్లమెంటు విధులను కూడా నిర్వర్తించింది.
    1. తాత్కాలిక పార్లమెంట్ 1952 ఏప్రిల్ 17 వరకు పనిచేసింది.
  2. రాజ్యాంగ పరిషత్ పనిచేసిన రోజులు: 165
  3. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు అయిన మొత్తం ఖర్చు: రూ.64 లక్షలు
  4. భారత రాజ్యాంగం అమలు తేది: 1950 జనవరి 26
    1. జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది.
    2. నెహ్రూ అధ్యక్షతన 1929 డిసెంబర్ 31లాహోర్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జనవరి 26 (1930) ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించారు.
    3. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించారు.
  5. రాజ్యాంగ రూపకల్పన కోసం పట్టిన సమయం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
  6. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారు: బెనగల్ నరసింగరావు (B.N.రావ్)
    1. ఇతడు బర్మా రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నాడు.
    2. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి అయిన మొదటి భారతీయుడు (1952-53).
  7. రాజ్యాంగ పరిషత్తు కార్యదర్శి: H.V.R.అయ్యంగార్
  8. రాజ్యాంగం తొలి ప్రతిని డెహ్రాడూన్ లో ప్రచురించారు.
  9. రాజ్యాంగ పరిషత్తు చిహ్నం: ఏనుగు
  10. రాజ్యాంగాన్ని మొదటగా ఆంగ్లంలో రాశారు.
    1. ఆంగ్లంలో రాసింది: ప్రేమ్ బెహారి రైజ్దా
    2. హిందీలో రాసింది: వసంత్ క్రిషన్ వైద్య
    3. వీళ్లు చేతితోనే రాశారు (Calligraphy).
  11. రాజ్యాంగానికి, ప్రవేశికకు ఆర్ట్ వర్క్ చేసింది: నందన్ లాల్ బోస్
  12. రాజ్యాంగ విధులను నిర్వర్తించే సమయంలో డా|| రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు.
  13. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నిర్వహించేటప్పుడు స్పీకరుగా G.V.మౌలంకర్ వ్వవహరించారు.

ప్రముఖుల వ్యాఖ్యలు:

  1. "డా|| బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత (ఆర్కిటెక్ట్)": అనంతశయనం అయ్యంగార్
  2. "డా|| బి.ఆర్.అంబేద్కర్ నైపుణ్యమున్న పైలెట్": డా|| రాజేంద్రప్రసాద్ 
  3. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది: H.V. కామత్
  4. "భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైనది, దివ్యమైనది": సర్ ఐవర్ జెన్నింగ్స్
  5. "రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలు పరిచేవారిని నిందించాలి": బి.ఆర్.అంబేద్కర్
  6. "భారత రాజ్యాంగం అతుకుల బొంత": గ్రాన్ విల్ ఆస్టిన్
  7. "రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది": లార్డ్ సైమన్

రాజ్యాంగంలోని ప్రకరణలు:

  1. ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి.
  2. రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి.
  3. అయితే, ప్రస్తుతం 470 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి.
  4. వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.
  5. ఏదైనా ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆంగ్ల అక్షరాల రూపంలో సూచిస్తారు. అంతేకాని వాటికి ప్రత్యేక సంఖ్యను ఇవ్వరు. అలాగే తొలగించబడిన ప్రకరణను ఖాళీగా ఉంచుతారు. ప్రకరణల సంఖ్యను సర్దుబాటు చేయరు.
  6. కనుక మౌలిక రాజ్యాంగంలోని నిబంధనలు సంఖ్యల వారిగా 395కు మించదు. 
    1. సంఖ్యాయుత ప్రకరణలు: 395
    2. మొత్తం ప్రకరణల సంఖ్య: 470
  7. ప్రకరణ: ప్రకరణలు/ నిబంధనలు/ అధికరణలు/ ఆర్టికల్స్ అనగా క్రోడీకరించబడిన సమగ్ర సూత్ర నియమాలు.
  8. భాగాలు: అవగాహన సౌలభ్యం కోసం, ప్రత్యేక అంశాలవారిగా రాజ్యాంగంలోని ప్రకరణలను భాగాలుగా, భాగాలను ఛాప్టర్లుగా వర్గీకరించారు.
  9. షెడ్యూల్స్: షెడ్యూల్స్ రాజ్యాంగానికి అనుబంధాల వంటివి. రాజ్యాంగములోని ప్రకరణకు సంబంధించిన అంశాన్ని, అదనపు సమాచారాన్ని షెడ్యూలు రూపంలో పొందుపరుస్తారు.
  10. వివిధ దేశాల్లోని రాజ్యాంగ ప్రకరణల సంఖ్య
రాజ్యాంగం నిబంధనల సంఖ్య
అమెరికా 7
ఫ్రాన్స్ 92
జపాన్ 103
ఆస్ట్రేలియా 128
చైనా 138
కెనడా 147
ఇండియా 395


తాత్కాలిక ప్రభుత్వం:

  1. భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత 2 సెప్టెంబర్ 1946న భారతదేశ తాత్కాలిక ప్రభుత్వం (Interim Government) ఏర్పాటైంది.
  2. 1947 ఆగస్టు 15న కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఇది కొనసాగింది.
పేరు నిర్వహించిన శాఖ
జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాల శాఖ, కామన్వెల్త్ సంబంధాలు
సర్ధార్ వల్లభాయ్ పటేల్ హోం, సమాచార ప్రసారాలు, రాష్ట్రాలు
డా. రాజేంద్రప్రసాద్ ఆహారం, వ్యవసాయం
జాన్ మథాయ్ పరిశ్రమలు, పౌర సరఫరాలు
సర్దార్ బలదేవ్ సింగ్ రక్షణ శాఖ
జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ
సి.రాజగోపాలాచారి విద్య, కళలు
సి.హెచ్.బాబా పబ్లిక్ వర్క్స్, మైన్స్, పవర్
లియాఖత్ ఆలీఖాన్ ఆర్థిక శాఖ
అసఫ్ అలీ రైల్వేలు, రవాణా
జోగిందర్ నాథ్ మండల్ న్యాయ శాఖ
గజ్నాఫర్ ఆలీఖాన్ ఆరోగ్య శాఖ
అబదుర్ రబ్ నిస్టార్ తంతి, తపాలా
ఐ.ఐ.చుంద్రిగర్ వాణిజ్యం




No comments:

Post a Comment