Wednesday, July 12, 2023

Introduction to History in Telugu | చరిత్ర పరిచయం

Introduction to History in Telugu | చరిత్ర పరిచయం | Student Soula


  1. History అనే పదం Historia అనే గ్రీకు పదం నుంచి వచ్చింది.
  2. Historia అంటే వెదకడం, పరిశోధన, పరిశీలన అని అర్థం.
  3. చరిత్ర అనే పదం 'చర్' అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. చర్ అనగా నడత/ నడవడిక.
  4. గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. గతానికి చెందిన వివిధ అంశాలను, ఋజువులుగా అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర అందజేస్తుంది. చరిత్ర వివిధ కాలాలలోని ప్రజలు, వారి సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలియచేస్తుంది. వివిధ ప్రదేశాలలోని మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను చరిత్ర తెలియచేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రను అధ్యయనం చేస్తాం.
  5. చరిత్ర పితామహుడు  హెరిడోటస్
  6. ఒక కాలానికి చెందిన చరిత్ర అధ్యయనం కొరకు కొన్ని ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ చారిత్రక ఆధారాలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
    1. పురావస్తు ఆధారాలు (Archaeological Sources)
    2. వాజ్ఞ్మమ (లిఖిత) ఆధారాలు (Literary Sources) 

పురావస్తు ఆధారాలు:
  1. పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేసే శాస్త్రంపురావస్తు శాస్త్రం (Archaeology)
  2. భారతీయ ఆర్కియాలజీ పితామహుడుఅలెగ్జాండర్ కన్నింగ్ హామ్
  3. పురావస్తు పరిశోధకులు గతాన్ని నిర్మించడానికి శాసనాలు, నాణేములు, కట్టడాలను ఆధారాలుగా ఉపయోగిస్తారు.
శాసనాలు (Inscriptions):
  1. గట్టి ఉపరితలంపై (రాళ్లు, లోహాలు) లిఖించబడిన లిపిని శాసనం అంటారు.
  2. శాసనాల అధ్యయనంఎపిగ్రఫీ
  3. ప్రాచీన కాలం నాటి రాతల అధ్యయనంపాలియోగ్రఫీ
  4. శాసనాలు 4 రకాలు;
    1. ప్రశస్తి శాసనం: రాజు యొక్క విజయాలు, గొప్పతనం గురించి తెలిపే శాసనములు.
    2. దాన శాసనం: ఇచ్చిన దానాల గురించి ఇందులో వివరిస్తారు. రాజుతోపాటు ఇతర వ్యక్తులు కూడా ఈ శాసనాలను వేయిస్తారు.
    3. రాజాజ్ఞ శాసనం: రాజు తన ఆజ్ఞలను, ఆదేశాల గురించి తెలుపుతూ వేసిన శాసనాలు.
    4. స్మారక శాసనం: ఏదైనా సంఘటనలకు గుర్తుగా వేసే శాసనాలు.
  1. ఇతర అంశాలు:
    1. అశోకుడు వేయించిన శాసనాలన్ని రాజాజ్ఞ శాసనాలే.
    2. భారతదేశంలో అత్యధిక శాసనాలను వేయించిందిఅశోకుడు.
నాణేములు (Coins):
  1. నాణేముల అధ్యయనం  న్యూమిస్ మ్యాటిక్స్
  2. నాణేలపై గల బొమ్మల అధ్యయనం  సిగిలోగ్రఫీ
  3. భారతదేశంలో తొలిసారిగా నాణేములు చలామణిలోకి తెచ్చింది  ఇండో-బాక్ట్రియన్ గ్రీకులు
కట్టడాలు/నిర్మాణాలు (Monuments):
  1. కట్టడాలు నిర్మాణాల అధ్యయనం  ఐకనోగ్రఫీ
  2. ప్రాచీన సంస్కృతిని చెప్పగలిగే వాటిలో కట్టడాలు ప్రధానమైనవి.
లిఖిత ఆధారాలు:
  1. లిఖిత (వాజ్ఞ్మయ) ఆధారాలలో స్వదేశీ లిఖిత గ్రంథాలు, విదేశీ లిఖిత గ్రంథాలు చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడతాయి.
స్వదేశీ లిఖిత గ్రంథాలు:
  1. భారతీయుల ద్వారా భారత దేశంలో వ్రాయబడినవి. ఇందులో మత గ్రంథాలు, లౌకిక గ్రంథాలు ఉన్నాయి.
విదేశీ లిఖిత గ్రంథాలు:
  1. భారతదేశాన్ని అనేక మంది విదేశీయులు సందర్శించి ఇక్కడి విశేషాలను, తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు.
  2. భారతదేశాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే విదేశీయులను ఇండాలజిస్టులు అంటారు.
  3. భారతదేశ చరిత్ర, సంస్కృతుల అధ్యయనంఇండాలజీ
పూర్వ చారిత్రక యుగం (Pre-Historic Age):
  1. పూర్వ చారిత్రక యుగం అంటే చరిత్రకు ముందు యుగం అని అర్థం. లిపి లేని కాల చరిత్రను అధ్యయనము చేయలేని కాలం.
  2. ఇది మానవ పుట్టుకతో ప్రారంభమై, లిపివాడుకలోకి వచ్చేంత వరకు కొనసాగింది.
  3. రాతి వాడకం ఎక్కువగా ఉండడం వలన దీనిని రాతి యుగం/ శిలాయుగం అంటారు.
  4. దీనిని 4 భాగాలుగా విభజించడం జరిగింది.
    1. పాతరాతి యుగం (Paleo Lithic Age) (10 Lack BC - 10000 BC)
    2. మధ్యరాతి యుగం (Mesolithic Age) (10000 BC - 8000 BC)
    3. కొత్తరాతి యుగం (Neolithic Age) (8000 BC - 4000 BC)
    4. రాగి శిలాయుగం (Chalcolithic Age) (4000 BC - 3000 BC)
కార్బన్ డేటింగ్ పద్ధతి (C-14):
  1. రేడియో కార్బన్ డేటింగ్/ కార్బన్ డేటింగ్ అనేది ఆర్గానిక్ పదార్థాలు కలిగిన ఏదైనా వస్తువు యొక్క ఖచ్చితమైన వయస్సును (కాలాన్ని) నిర్ణయించేందుకు ఉపయోగించే పద్ధతి.
  2. దీనిని 1949లో అమెరికన్ భౌతిక రసాయన శాస్త్రవేత్త W.F.లిబ్బి కనుగొన్నాడు. దీనికి  గాను ఈయన 1960లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
భారత పురాతత్వ సర్వేక్షణ (ASI):
  1. భారత పురాతత్వ సర్వేక్షణ (ASI - Archaeological Survey of India) అనేది పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అవశేషాల పురావస్తు పరిశోధన, రక్షణ మరియు సంరక్షణకు బాధ్యత వహిస్తుంది. ఇది ముఖ్యమైన సాంస్కృతిక కళాఖండాలను కలిగి ఉన్న మ్యూజియంలు, లైబ్రరీలు మరియు ఆర్కైవ్‌ల నిర్వహణకు కూడా బాధ్యత వహిస్తుంది.
  2. స్థాపన1861
  3. స్థాపించిందిఅలెగ్జాండర్ కన్నింగ్ హామ్
  4. ఈ సంస్థ స్థాపన కాలం నాటి గవర్నర్ జనరల్లార్డ్ కానింగ్
  5. ఇది భారతదేశ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
  6. మొదటి డైరెక్టర్ జనరల్అలెగ్జాండర్ కన్నింగ్ హామ్
  7. భారత ఆర్కియాలజీ పితామహుడుఅలెగ్జాండర్ కన్నింగ్ హామ్
  8. 1901లో దీనిని పునరుద్ధరించిందిలార్డ్ కర్జన్
  9. Website: www.asi.nic.in
ఆసియాటిక్ సొసైటీ (Asiatic Society):
  1. స్థాపన  1784 (కోల్‌కతా)
  2. స్థాపించింది  సర్ విలియం జోన్స్
  3. దీని లక్ష్యం ఆసియా చరిత్ర, పురాతన వస్తువులు, కళలు, శాస్త్రాలు మరియు సాహిత్యం యొక్క అధ్యయనాన్ని ప్రోత్సహించడం.
  4. బ్రిటీష్ ఫిలాలజిస్ట్ మరియు ప్రాచీన భారతదేశం యొక్క పండితుడు అయిన విలియం జోన్స్, ఆసియా భాషలు మరియు సంస్కృతిపై ఆసక్తి ఉన్న పండితులు మరియు మేధావులను ఒకచోట చేర్చగల సమాజం అవసరం అని నమ్మాడు. అందువల్ల ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అటువంటి చర్చలు మరియు పరిశోధనలకు వేదికగా స్థాపించబడింది.
  5. సంస్కృతం, పర్షియన్, అరబిక్ మరియు ఇతర ఆసియా భాషల అధ్యయనాన్ని ప్రోత్సహించడంలో సంఘం కీలక పాత్ర పోషించింది. పురాతన మాన్యుస్క్రిప్ట్‌లు మరియు శాసనాలతో సహా అనేక ముఖ్యమైన చారిత్రక మరియు సాంస్కృతిక కళాఖండాల ఆవిష్కరణ మరియు సంరక్షణలో ఇది కీలక పాత్ర పోషించింది.
  6. Website: www.asiaticsocietykolkata.org
ప్రముఖుల వ్యాఖ్యలు:
  1. గార్టెన్ చైల్: "లిపి పుట్టుకయే నాగరికత ఆవిర్భావానికి చిహ్నం" (ఇతని పుస్తకం: What Happened in History)
  2. లైమెన్ లెవీ: "ప్రపంచ చరిత్రను ఒక గంట సినిమా తీస్తే, అందులో 59 నిమిషాలు ప్రాచీన కాలంనాటి మానవుడు సాధించిన ప్రగతి గురించే ఉంటుంది" (ఇతని పుస్తకం: Social Thinking)
ఇతర అంశాలు:
  1. చారిత్రక వరుస క్రమాల అధ్యయనంక్రోనాలజీ



Back Top

No comments:

Post a Comment