Digestive System in Telugu | జీర్ణ వ్యవస్థ | Student Soula

దయచేసి మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.... Contact: studentsoula@gmail.com

Digestive System in Telugu | జీర్ణ వ్యవస్థ | Student Soula


  1. జీవులు తినే ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి వివిధ భాగాలతో కూడిన ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దాన్నే జీర్ణ వ్యవస్థ (Digestive System) అంటారు. 
  2. జీర్ణవ్యవస్థ ఆహారంలోని పోషకాలను గ్రహించి, వ్యర్థాలను విసర్జిస్తుంది. తద్వారా శరీరానికి కావాల్సిన శక్తి సమకూరుతుంది.
  3. కీటకాలు, జలచరాలు, జంతువుల వంటి పక్షులు, అన్ని జీవుల్లోనూ ఈ వ్యవస్థ ఉంటుంది. శాకాహార, మాంసాహార జంతువుల్లో వేర్వేరుగా ఉంటుంది.
  4. సంక్లిష్ట ఆహార పదార్థాలు ఎంజైమ్స్ సమక్షంలో సరళ ఆహార పదార్థాలుగా మార్చబడడాన్ని జీర్ణక్రియ (Digestion) అంటారు. ఇది జీర్ణవ్యవస్థలో జరుగుతుంది.
  5. జీర్ణవ్యవస్థలో జీర్ణ/ ఆహారనాళం, దాని అనుబంధ జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణ రసాల్లోని ఎంజైమ్‌లు జీర్ణ క్రియను నిర్వహిస్తాయి.

మానవ జీర్ణ వ్యవస్థ
(Human Digestive System)


Human Digestive System in Telugu | మానవ జీర్ణ వ్యవస్థ | Student Soula

Human Digestive System in Telugu | మానవ జీర్ణ వ్యవస్థ | Student Soula


జీర్ణ/ ఆహారనాళం
(Alimentary Canal)

  1. ఇది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమయ్యే గొట్టంవంటి నిర్మాణం.
  2. దీని పోడవు: 9 మీటర్లు/ 30 అడుగులు
  3. దీనిలోని భాగాలు:
    1. (1) నోరు (Mouth)
    2. (2) ఆస్యకుహరం (Oral Cavity)
    3. (3) గ్రసని (Pharynx)
    4. (4) ఆహారవాహిక (Esophagus)
    5. (5) జీర్ణాశయం (Stomach)
    6. (6) చిన్నపేగు (Small Intestine)
    7. (7) పెద్దపేగు (Large Intestine)
    8. (8) పాయువు (Anus)

(1) నోరు (Mouth):

  1. దీని ద్వారా ఆహారం ఆహార నాళంలోకి చేరే విధానాన్ని అంతర్ గుహణం (Ingestion) అంటారు.

(2) ఆస్యకుహరం (Oral Cavity):

  1. నోటిలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఆస్యకుహరం అంటారు.
  2. ఆస్యకుహరం మరియు నాసికా కుహరాన్ని వేరు చేసే నిర్మాణం: తాలువు/ అంగిలి (Palate)
  3. దీనిలోని భాగాలు:
    1. (i) దంతాలు
    2. (ii) లాలాజల గ్రంథులు
    3. (iii) నాలుక 
(i) దంతాలు (Teeth):
  1. దంతాల అధ్యయనం: ఒడెంటాలజి
  2. ఇవి డెంటిన్ అనే పదార్థంచే ఏర్పడును.
    1. దీనిని ఒడెంటో బ్లాస్ట్ కణాలు స్రవిస్తాయి.
  3. దంతాలను కప్పుతూ ఉండే మెరిసే పొరను ఎనామిల్/ పింగాణి అంటారు.
    1. ఇది మానవ శరీరంలో అత్యంత గట్టి/ దృఢమైన పదార్థం.
    2. దీనిని ఎమియో బ్లాస్ట్ కణాలు స్రవిస్తాయి.
  4. మానవ జీవితంలో రెండుసార్లు మాత్రమే దంతాలు వచ్చును.
  5. చేపల వంటి నిమ్న సకశేరుకాలలో అనేకసార్లు దంతాలు ఏర్పడతాయి.
  6. ఎక్కువ దంతాలుగల జీవులు;
    1. అపోసం: 50
    2. గుర్రం మరియు పంది: 44
  7. దంతాలు లేని జీవులు: నెమలి, ఆస్ట్రిచ్, తాబేలు మెదలైనవి
  8. మానవులలో దంతాలు రెండు రకాలు:
  9. (a) పాల దంతాలు (Primary Teeth):
    1. ఇవి చిన్న పిల్లల్లో ఉండును.
    2. 8-9 సంవత్సరాల వయస్సులో ఊడిపోవును.
    3. వీటి సంఖ్య: 20.
    4. వీరిలో 8 అగ్ర చర్వణకాలు, 4 జ్ఞాన దంతాలు (మొత్తం 12) లోపించును  .
    5. పాల దంతాల సూత్రం: 2102/2102
  10. (b) శాశ్వత దంతాలు (Permanent Teeth):
    1. పాల దంతాలు ఊడిపోయి తర్వాత వాటి స్థానంలో కొత్త దంతాలు వస్తాయి. వీటినే శాశ్వత దంతాలు అంటారు.
    2. వీటి సంఖ్య: 32
    3. వీటిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రం: దంత సూత్రం
    4. దంత సూత్రం: 2123/2123
  11. దంతాలు 4 రకాలు:
  12. (a) కుంతకాలు (Incisors):
    1. వీటి సంఖ్య: 8 
    2. ఇవి ఆహారాన్ని కొరకడానికి ఉపయాగపడతాయి. కావున వీటిని కొరకు పళ్ళు అంటారు.
  13. (b) రదనికలు (Canines):
    1. వీటి సంఖ్య: 4
    2. ఇవి మాంసహారులలో మాత్రమే అభివృద్ధి చెంది, మొనదేలి ఉంటాయి. కావున వీటిని కోరపళ్ళు, చీల్చు దంతాలు అంటారు.
    3. పాములలో కోరలు వీటి రూపాంతరమే
    4. ఇవి శాఖాహార జంతువులలో పూర్తిగా లోపించి ఉంటాయి.
      1. శాఖాహారులలో ఇవి లోపించడంవల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అంటారు.
      2. ఉదా: కుందేలు
  14. (c) అగ్ర చర్వణకాలు (Premolars):
    1. వీటి సంఖ్య: 8
    2. ఆహారాన్ని నమలడం వల్ల నమలు దంతాలు అంటారు.
  15. (d) చర్వణకాలు (Molars):
    1. వీటి సంఖ్య: 12
    2. ఆహారాన్ని లోపలికి విసరడంవల్ల విసురు దంతాలు అంటారు.
    3. ఇవి 17 సంవత్సరాల వరకు 8 మాత్రమే ఉండి, 17-25 సంవత్సరాల మధ్య కాలంలో మిగతా 4 ఏర్పడుతాయి.
    4. కొత్తగా ఏర్పడిన 4 దంతాలనే జ్ఞాన దంతాలు (Wisdom Teeth) అంటారు. జ్ఞాన దంతాలను అవశేష అవయవాలుగా పరిగణిస్తారు.
  16. దంత వ్యాధులు (Dental Diseases):
    1. పయేరియా/ పైరియా: దంతాలు, చిగుళ్ళ మధ్య చీము ఉత్పత్తి.
    2. జింజివైటిస్రెండు దంతాల మధ్య ఉండే చిగురు వాయడం
    3. ఫ్లోరోసిస్: దంతాలు బంగారు, పసుపు రంగులోకి మారడం
    4. దంతక్షయం: బాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లం వల్ల దంతంపై ఎనామిల్ క్షీణించును.
Type of Teeth in Telugu__Student Soula

(ii) లాలాజల గ్రంథులు (Salivary Glands):
  1. ఇవి మానవునిలో 3 జతలు ఉండును. (మిగతా క్షీరదాలలో 4 జతలు ఉండును)
    1. పెరోటిడ్ గ్రంథులు (Parotid Glands): చెవి దగ్గర ఉండును.
    2. అథోజంబికా గ్రంథులు (Submandibular Glands): రెండు దవడలు కలిసే చోట ఉండును.
    3. అధోజిహ్వికా గ్రంథులు (Sublingual Glands): నాలుక క్రింద ఉండును.
  2. పాములలో పెరోటిడ్ గ్రంథులు మార్పు చెంది విష గ్రంథులుగా ఏర్పడును.
  3. లాలాజల గ్రంథులు రోజుకి ఒక లీటర్ లాలాజలం (Saliva) ని ఉత్పత్తి చేయును.
  4. లాలాజల PH: 6.8
  5. లాలాజలంలోని ఎంజైమ్: టయలిన్/ అమైలేజ్
    1. ఇది పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది.
  6. లాలాజలంలో మ్యూసిన్ (Mucin) అనే జిగట పదార్థం ఉంటుంది. ఇది ఆహారం చుట్టూ చుట్టి బోలస్ అనే ముద్దను ఏర్పచును.
  7. లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్ష: లిట్మస్ పేపర్ పరీక్ష 
Types of Salivary Glands in Telugu__Student Soula

(iii) నాలుక (Tongue):
  1. ఇది ఒక జ్ఞానేంద్రియము, కండరయుత నిర్మాణం.
  2. నాలుకపైన రుచులను గుర్తించే నిర్మాణాలను గ్రాహకాలు (Taste Receptors) అంటారు.
  3. అస్యకుహరం అడుగు భాగంలో ఫ్రెన్యులమ్ అనే కణజాలంతో నాలుక అతికి ఉంటుంది.
  4. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకుని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు (Papillae) అంటారు.
  5. వీటి ముఖ్య విధి రుచులను గుర్తించడం.
  6. రుచులను గుర్తించే చర్యను గస్టేషన్ అంటారు. 
  7. సూక్ష్మాంకురాలు (Papillae) 4 రకాలు:
    1. Fungiform Papillae: ఇవి నాలుక చివర భాగంలో ఉండును.
    2. Filiform Papillae: ఇవి నాలుక ఉపరితలంలో ఉంటాయి. ఇవి రుచి మొగ్గలను కలిగి ఉండవు.
    3. Circumvallate Papillae: ఇవి నాలుక ఆధార భాగంలో ఉండును.
    4. Foliate Papillae: ఇవి నాలుక పక్క భాగంలో ఉండును.
Types of Papillae of Tongue in Telugu__Student Soula

(3) గ్రసని (Pharynx):

  1. ఇది వాయు మార్గానికి, ఆహార మార్గానికి కూడలి.
  2. దీనిలో ఎటువంటి జీర్ణక్రియ జరగదు.

(4) ఆహార వాహిక (Esophagus):

  1. ఇది సన్నగా, పొడవుగా ఉండే గొట్టం వంటి నిర్మాణం.
  2. దీని నుండి ఆహారం జీర్ణాశయంలోకి చేరును.
  3. దీనిలో కనబడే అలలవంటి కండర చలనాలు: పెరిస్టాలిసిస్
  4. మింగడం నియంత్రిత చర్య. మింగిన తర్వాత ఆహారవాహికను చేరగానే అది అనియంత్రితమగును.

(5) జీర్ణాశయం (Stomach):

  1. ఇది ఎడమవైపు ఉండే సంచి వంటి నిర్మాణం.
  2. జీర్ణాశయం మరియు లోపలి భాగాల అధ్యయనం: గాస్ట్రోఎంటరాలజి
  3. మానవుని జీర్ణాశయంలో 3 గదులు, నెమరువేసే జంతువులలో 4 గదులు ఉంటాయి.
  4. జీర్ణాశయంలో జఠర గ్రంథులు ఉండి జఠర రసం (Gastric Juice) ను ఉత్పత్తి చేస్తాయి.
  5. జఠర రసంలో HCL , పెప్సిన్, రెనిన్, జఠర లైపేజ్ అనే ఎంజైమ్ లు, మ్యూసిన్, బైకార్బోనేట్స్ ఉండును.
    1. HCL అధిక గాఢత కలిగి, ఆహారం ద్వారా వచ్చిన సూక్ష్మ జీవులను చంపును.
    2. HCL PH: 0.9 - 1.8
  6. జీర్ణాశయంలోని కండరాలు సంకోచ సడలిక చెంది ఘనరూప ఆహారాన్ని పాక్షిక ద్రవస్థితిలోకి మార్చును. ఇలా పాక్షికంగా జీర్ణమయిన ఆహారాన్ని కైమ్ (Chyme) అంటారు.
  7. జీర్ణాశయంలో ఎక్కువ కాలం (4-5 గంటలు) ఆహారం నిల్వ ఉండును.
  8. జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించే రసాయాలను ఆంటాసీడ్స్ అంటారు.
  9. జీర్ణాశయం చిన్న పేగులోకి తెరుచుకుంటుంది.

(6) చిన్నపేగు (Small Intestine):

  1. దీని పొడవు 7.5 మీటర్లు, వ్యాసం 3 సెం.మీ.
  2. ఇందులో 3 భాగాలుంటాయి.
  3. (a) ఆంత్రమూలము (Duodenum):
    1. మొదటిది, చిన్నదైనా C ఆకారపు భాగం.
  4. (b) జెజెనం (Jejunum):
    1. మధ్యలోని భాగం
  5. (c) శేషాంత్రికము (Ileum):
    1. చివరి, పొడవైన మెలికలు తిరిగిన భాగం.
  6. కాలేయం, క్లోమ గ్రంథులు నుండి వెలువడే జీర్ణరసాలు చిన్న పేగులోని ఆంత్రమూలంలోకి విడుదలవుతాయి. ఈ గ్రంథుల స్రావాలు చిన్న ప్రేగులో క్షారస్థితిని కల్పించడానికి దోహదపడతాయి.
  7. చిన్న ప్రేగుల గోడలు ఆంత్రరసాన్ని (Succusentericus) స్రవిస్తాయి. ఈ స్రావాలు ప్రొటీన్లు మరియు క్రొవ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి.
  8. కార్బోహైడ్రేట్స్ నోటిలో కొంతవరకు మాత్రమే జీర్ణమౌతాయి. జీర్ణాశయంలో మార్పులు చెందకుండా చిన్న ప్రేగుల్లోకి చేరిన తరువాత అక్కడ క్షారస్థితి కలిగి ఉండటం వలన పూర్తిగా జీర్ణమవుతాయి.
  9. చిన్నపేగులో చేతివేళవంటి ఆంత్ర చూషకాలు (Villi) అనే నిర్మాణాలు ఉండి, చిన్న చిన్న ఆహారపు రేణువులను శోషణం చేసి రక్తంలోకి పంపించును.
  10. మానవులలో ఎక్కువ జీర్ణక్రియ చిన్నపేగులో జరుగును.
  11. ఇది పెద్దపేగులో కలుస్తుంది.

(7) పెద్దపేగు (Large Intestine):

  1. దీని పొడవు 1.5 మీ, వ్యాసం ఎక్కువ (6 సెం.మీ).
  2. ఇది వ్యర్థ పదార్థాలలోని నీటిని, లవణాలను పీల్చుకుంటుంది.
  3. ఇందులో ఎటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి కావు.
  4. దీనిలో 3 భాగాలు ఉంటాయి.
  5. (a) అంధనాళము (Cecum):
    1. మొదటి, చిన్న భాగం.
    2. ఇది చిన్న అంధకోశాన్ని కలిగి, సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇచ్చును.
  6. (b) కోలాన్ (Colon):
    1. రెండవ, పెద్దభాగం.
    2. ఇందులో ముఖ్యంగా 4 భాగాలు కలవు;
      1. ఆరోహక కోలాన్ (Ascending colon)
      2. సమాంతర కోలాన్ (Transverse colon)
      3. అవరోహక కోలాన్ (Descending colon)
      4. సిగ్మాయిడ్ కోలాన్ (Sigmoid colon)
  7. (c) పురీషనాళం (Rectum):
    1. చివరి భాగం.
    2. వ్యర్థ పదార్థాలు దీని నుండి పాయువులోకి చేరి, అక్కడి నుండి బయటకు విసర్జింపబడును.
  8. ఉండుకము (Appendix):
    1. చిన్నపేగు మరియు పెద్దపేగు కలిసే ప్రదేశంలో పెద్దపేగుకు అతుక్కొని ఉండే వేలువంటి నిర్మాణం.
    2. ఇది మానవుని వంటి మాంసహారులలో ఎటువంటి పనిచేయదు. దీన్ని అవశేష అవయవము (Vestigial Organ) అంటారు.
    3. శాఖాహార జంతువులలో ఇది సెల్యులోజ్ ను జీర్ణం చేయును.
    4. దీనికి ఇన్ఫెక్షన్ కలిగినపుడు ఇది వాచీ, తీవ్రనొప్పిని కలిగించును. దీనినే Appendicitis అంటారు. దీనిని సర్జరీ ద్వారా తొలగించడం Appendectomy అంటారు.

(8) పాయువు (Anus):

  1. ఇది చిట్ట చివరి భాగం.
  2. వ్యర్థ పదార్థాలు (మలం) పెద్దపేగులోని పురీషనాళం (Rectum) లోకి, అక్కడి నుండి పాయువు (Anus) లోకి చేరి, అక్కడి నుండి బయటకు విసర్జింపబడును.


జీర్ణ గ్రంథులు
(Digestive Glands)

  1. జీర్ణక్రియలో పాల్గొనే గ్రంథులను జీర్ణగ్రంథులు అంటారు.
  2. ఉదా: లాలాజల, జఠర, ఆంత్ర, క్లోమ, కాలేయ గ్రంథులు.

కాలేయం (Liver):

  1. దీని అధ్యయనం: హెపటాలజి
  2. ఇది మానవ శరీరంలో అతిపెద్ద, అధిక బరువైన గ్రంథి.
  3. దీని పరిమాణం: 1.2 - 1.5 KG
  4. దీనిని Chemical Industry of the Body, Biochemical Laboratory అంటారు.
  5. ఇది శరీరానికి కావల్సిన తాత్కాలిక శక్తినిచ్చే కేంద్రం.
  6. దీని అతి ముఖ్యమైన లక్షణం అధిక పునరుత్పత్తిని (Regeneration Power) కలిగి ఉండడం. అనగా కోల్పోయిన భాగంలో 2-3 వారాల్లో 85% ను తిరిగి ఏర్పరచుకొనును.
  7. పిండ దశలో రక్త కణోత్పాధక అంగంగా, ప్రౌడ దశలో RBC విచ్ఛిత్తి అంగంగా పని చేయును.
  8. పేగులోకి ప్రవేశించిన విషపదార్థాలను తటస్థీకరించి మొదటి తనిఖీ కేంద్రంగా పని చేయును.
    1. ఎవరైతే విషపూరిత ఆహారాన్ని తిని చనిపోతే పోస్ట్ మార్టెమ్ లో తప్పనిసరిగా అతని కాలేయాన్ని పరీక్షిస్తారు.
  9. A, D, E, K, B12 విటమిన్లను, ఇనుమును, గ్లైకోజన్ ను నిల్వచేస్తుంది.
  10. ఇది పసుపు ఆకుపచ్చ రంగులో ఉండే పైత్యరసం (Bile) ను ఉత్పత్తి చేయును.
  11. పైత్యరసం (Bile):
    1. ఇది పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటును.
    2. ఇది ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్న ఫలితంగా ఏర్పడును.
    3. ఇది రోజుకు 1 లీటర్ ఉత్పత్తి అగును.
    4. ఇందులో నీటి శాతం: 86%, PH: 7.5 - 8.5
    5. దీనిలో ఎంజైమ్స్ లేవు. అయినప్పటికి కొన్ని రకాల లవణాలను కలిగి కొవ్వులను చిలుకును. ఈ ప్రక్రియనే ఎమల్సీకరణం అంటారు.
    6. ఇది తాత్కాలికంగా పిత్తాశయంలో నిల్వ ఉండును. తర్వాత ఇది చిన్న పేగులోని ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.
  12. పిత్తాశయం (Gall Bladder):
    1. ఇది కాలేయ లంబికల మధ్య ఉండును.
    2. ఇది పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేయును.
    3. పిత్తాశయ రాళ్లు (Gall Stones) కొలెస్టరాల్ వల్ల ఏర్పడును.
  13. కాలేయ సంబంధ వ్యాధులు:
    1. పచ్చకామెర్లు (Hepatitis): కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యరసం ఆంత్రమూలం (Duodenum) లోకి ప్రవేశించే మార్గంలో (నాళంలో) కొలెస్టరాల్ పేరుకుపోతే ఈ రసం రక్తంలో కలిసి శరీర భాగాలకు రవాణా చెందడంతో కళ్ళు, చర్మం, మూత్రం పసుపు రంగులోకి మారును.
    2. సిర్రోసిస్ (Cirrhosis): అధిక ఆల్కహాల్ సేవించడం వల్ల కలిగే వ్యాధి.

క్లోమం (Pancreas):

  1. ఇది ఆంత్రమూలం (Duodenum) వంపులో ఉండే ఆకువంటి నిర్మాణం.
  2. దీని అధ్యయనం: పాంక్రియాలజి
  3. ఇది మానవ శరీరంలో 2వ పెద్ద గ్రంథి (60 గ్రాం).
  4. ఇది ఒక మిశ్రమ గ్రంథి. అనగా దీనిలో నాళం గల భాగం, వినాళ (నాళ రహిత) భాగం ఉంటాయి.
  5. (a) నాళ భాగం (Duct Part):
    1. ఈ భాగానికి నాళాలు ఉండును.
    2. దీనిలో క్లోమ గ్రంథులు ఉండి క్లోమ రసం (Pancreatic Juice) ను ఉత్పత్తి చేయును. ఇది చిన్నపేగులోని ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.
    3. క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రొటీన్లను జీర్ణం చేయడానికి అదే విధంగా లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. 
    4. క్లోమ రసం PH: 8.4
  6. (b) వినాళ గ్రంథులు/ అంతస్స్రావిక భాగం (Endocrine Part): 
    1. వీటిలో నాళాలు ఉండవు.
    2. దీనిలో లాంగర్ హాన్స్ పుటికలు అనే నిర్మాణాలు ఉండి, హార్మోన్ (ఇన్సులిన్, గ్లుకగాన్) అనే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి రక్తంలోకి విడుదల చేయును.
    3. ఇన్సులిన్ (Insulin):
      1. ఇన్సులా అనే లాటిన్ భాష పదానికి అర్దం: దీవి
      2. దీనిని β - కణాలు ఉత్పత్తి చేయును.
      3. దీనిని కనుగొన్నది: ఫ్రెడరిక్ బాంటింగ్, చార్లెస్ బెస్ట్, మెక్ లియోడ్ (ఇందుకు గాను వీరికి 1923లో నోబెల్ వచ్చింది).
      4. ఇది రక్తంలోని గ్లూకోజ్/చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది గ్లూకోజ్ ను గ్లైకోజన్ గా మార్చుతుంది.
      5. దీనిని కొలిచే పరికరం: గ్లూకోమీటర్
      6. ఇన్సులిన్ లోపిస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, డయాబెటిస్ మెల్లిటన్/ చక్కెర వ్యాధి/ మధుమేహం వ్యాధి వస్తుంది.
      7. భోజనం తీసుకున్న తర్వాత రక్తంలో సాధారణంగా ఇన్సులిన్ 180 మి.గ్రా/డెసి.లీ లోపు ఉండాలి.
      8. అధిక ఇన్సులిన్ ఉత్పత్తి వల్ల గ్లూకోజ్ స్థాయి పడిపోవడాన్ని అనగా హైపో గ్లైసీమియా స్థితిని ఇన్సులిన్ షాక్ అంటారు. దీనివల్ల మెదడు కణాలు దెబ్బతిని ప్రాణహాని కలుగును.
      9. ప్రపంచ మధుమేహ దినోత్సవం: నవంబర్ 14
      10. కృత్రిమ ఇన్సులిన్: హ్యుమ్యులిన్
    1. గ్లుకగాన్ (Glucagon):
      1. దీనిని α - కణాలు ఉత్పత్తి చేయును.
      2. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు గ్లైకోజన్ ను తిరిగి గ్లూకోజ్ గా మార్చును.
      3. ఇన్సులిన్ మరియు గ్లుకగాన్ లు పరస్పరం ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తంలోని గ్లూకోజ్ సమస్థితికి తోడ్పడును.

జీర్ణక్రియ
(Digestion)

  1. సంక్లిష్ట ఆహార పదార్థాలు ఎంజైమ్స్ సమక్షంలో సరళ ఆహార పదార్థాలుగా మార్చబడడాన్ని జీర్ణక్రియ (Digestion) అంటారు.
  2. ఎంజైమ్స్ జీవులలో మాత్రమే ఉండి చర్యలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా చర్యవేగాన్ని పెంచును.
  3. మానవునిలో జీర్ణక్రియ అస్యకుహరంలో ప్రారంభమై, చిన్నపేగులో అంతమగును.
  4. గ్రసని, ఆహారవాహిక, పెద్దపేగులో ఎంజైమ్స్ లేవు. కావున అక్కడ జీర్ణక్రియ జరగదు.
  5. మానవుడిలో కణ బాహ్య జీర్ణక్రియ జరుగుతుంది.
  6. నాడుల ద్వారా మరియు హార్మోన్ల ద్వారా జీర్ణ వ్యవస్థ నియంత్రించబడును.
జీర్ణ నాడీ వ్యవస్థ (Digestive Nervous System):
  1. దీనిని రెండో మెదడుగా పిలుస్తారు.
  2. దీనిలో సుమారు 100 మిలియన్ల నాడీ కణాలు ఉండును.
  3. ఇది న్యూరో ట్రాన్స్మిటర్స్ ను ఉత్పత్తి చేసి నాడీ వ్యవస్థలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉండును.
  4. స్వయం చోదిత నాడీ వ్యవస్థను నియంత్రించే మెదడులోని భాగం: మజ్జాముఖం
  5. జీర్ణ నాడీ వ్యవస్థ విధులు:
    1. ఆహారాన్ని చిన్నచిన్న రేణువులుగా విచ్చినం చేయడం.
    2. స్వీయ ప్రతిస్పందన, జ్ఞానేంద్రియ శక్తి.
    3. లయబద్ధమైన కండర సంకోచాలు.
    4. పోషకాలను గ్రహించడం మరియు వ్యర్థాలను విసర్జించడం.
హార్మోన్లు (Gastrointestinal Hormones):
  1. గ్రెలిన్:
    1. ఇది ఆకలి ప్రచోదనాలను కలిగిస్తుంది. అందుకే దీనిని ఆకలి హార్మోన్ అంటారు.
    2. ఆకలి సమయంలో ద్వారగోర్దం, 10వ కపాలనాడి జీర్ణాశయానికి సంకేతాలను ఇవ్వడం వల్ల గ్రెలిన్ ఉత్పత్తి అగును.
  2. లెఫ్టిన్:
    1. ఆహారం అవసరం లేనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్.
  3. గ్యాస్ట్రిన్:
    1. ఇది జీర్ణాశయంలోని జఠర రస ఉత్పత్తిని ప్రేరేపించును.
  4. ఎంటరో గ్యాస్ట్రిన్:
    1. దీనిని ఆంత్రమూలం ఉత్పత్తి చేయును.
    2. చిన్నపేగులో కొవ్వు ఆమ్లాలు ఉండి రవాణా జరగనప్పుడు ఇది ఉత్పత్తి అగును.