రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? History of Constitution day in telugu |
రాజ్యాంగ దినోత్సవం - నవంబర్ 26
ఉద్దేశ్యం:
- ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును జ్ఞాపకం చేసుకోవడం మరియు రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేయడం రాజ్యాంగ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి:
- 2015లో భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇకనుండి అంబేడ్కర్ సేవలకు గుర్తుగా (పుట్టిన/మరణించిన రోజు కాదు) నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపు కోవాలని ప్రధాని నరేంద్ర మోడీ 19 నవంబర్ 2015న పిలుపునిచ్చారు.
నవంబర్ 26 నే ఎందుకు?
- రాజ్యాంగ పరిషత్ 26 నవంబర్ 1949 న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందువల్ల నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
- రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతి ప్రధానమైన కమిటీ -- రాజ్యాంగ ముసాయిదా కమిటి (Drafting Committee).
- ఈ కమిటీ 29-08-1947న B.R.అంబేడ్కర్ అధ్యక్షతన 6 గురు సభ్యులతో (6+1= 7) ఏర్పాటు అయినది.
ముసాయిదా కమిటి సభ్యులు |
- మొదటి రాజ్యాంగ రచన 30-08-1947 నుంచి 13-02-1948 వరకు జరిగింది. రూపొందించిన ఈ రాజ్యాంగ రచనను ముసాయిదా సంఘం 21-02-1948న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి సమర్పించింది.
- రాజ్యాంగ రచన మొదటి పఠనం -- ౦4-11-1948 నుంచి 09-11-1948 వరకు జరిగింది.
- రాజ్యాంగ రచన రెండవ పఠనం -- 15-11-1948 నుంచి 17-10-1949 వరకు సుదీర్ఘ చర్చలతో సుమారు 7635 సవరణలు ప్రతిపాదించగా వీటిలో 2473 ప్రతిపాదనలను రాజ్యాంగ సభ పరిశీలించి, చర్చించి పరిష్కరించింది. -->ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది - H.V. కామత్.
- రాజ్యాంగ రచన మూడో పఠనం -- 14-26 నవంబర్ 1949 వరకు జరిగింది.
రాజ్యాంగ పరిషత్ సమావేశాలు:
- రాజ్యాంగపరిషత్12 సార్లు సమావేశమయింది(రాజ్యాంగ రచనకు నిర్వహించిన సమావేశాలు -- 11, రోజులు165)
చివరి సమావేశం(12వ) -- 24-01-1950
- ఈ 12 సమావేశాలను కలిసి లెక్కించినట్లయితే మొత్తం రోజులు -- 166.
- ఈ 166 రోజులలో 114 రోజులు రాజ్యాంగ రాతప్రతి (ముసాయిదా) పైనే చర్చ జరిగింది.
- ఈ 12 సమావేశాలను కలిపి రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన కాలం -- 02 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
- రాజ్యాంగ పరిషత్ 11వ సమావేశం 14-26 నవంబర్ 1949న జరిగింది.
- రాజ్యాంగ పరిషత్ 26 నవంబర్ 1949 న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది.
- రాజ్యాంగ పరిషత్ 12వ సమావేశం 24 జనవరి 1950న జరిగింది. ఇదే చిట్ట చివరి సమావేశం.ఈ సమావేశంలో మొత్తం 299 మంది సభ్యులలో 284 మంది సభ్యులు రాజ్యాంగ ప్రతిపై సంతకాలు పెట్టారు.
- 26 జనవరి 1950 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
Jawaharlal Nehru addressing the constituent assembly in 1946. |
Sardhar Patel in House of Parliament, New Delhi. |
మరికొన్ని అంశాలు:
- 1979 నుంచి నవంబర్ 26 ను జాతీయ న్యాయ దినోత్సవం (National Law Day) గా జరుపుకుంటారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26 తేదిని జాతీయ న్యాయ దినోత్సవముగా ఎంచుకున్నారు.
వీటిని కూడా చూడండీ: