Saturday, April 15, 2023

History of Hockey in India in Telugu | భారతదేశంలో హాకీ చరిత్ర

History of Hockey in India in Telugu | భారతదేశంలో హాకీ చరిత్ర | Student Soula

భారతదేశంలో హాకీ చరిత్ర:
  • ఆధునిక ఫిల్డ్ హాకీ 18వ శతాబ్దం మధ్యలో ఇంగ్లాండులో అభివృద్ధి చేయబడింది. ఇది ఒక ప్రసిద్ధ పాఠశాల ఆటగా పరిచయం చేయబడింది.
  • ఇది 1850లలో బ్రిటీష్ పాలనలో భారతీయ సైన్యంలోకి ప్రవేశించింది.
  • 1855లో దేశంలోని మొదటి హాకీ క్లబ్ కలకత్తాలో ఏర్పడింది.
  • 1907 మరియు 1908 లో భారతదేశంలో హాకీ అసోసియేషన్ ఏర్పాటు గురించి చర్చలు జరిగాయి. కాని అది కార్యరూపం దాల్చలేదు. 
  • 1925లో భారత హాకీ సమాఖ్య (IHF-Indian Hockey Federation) ఏర్పడింది.
  • 1926లో భారత హాకీ సమాఖ్య తన మొదటి అంతర్జాతీయ పర్యటనను న్యూజిలాండ్ లో చేసింది. అక్కడ భారత హాకీ పురుషుల జట్టు 21 మ్యాచులు ఆడింది. ఇందులో 18 మ్యాచులు గెలిచింది. ఈ టోర్నమెంటులోనే సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ఆవిర్భవించాడు. 
  • 1927లో ఇండియన్ హాకీ ఫెడరేషన్ దరఖాస్తు చేసి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH)లో సభ్యత్వాన్ని పొందింది.

భారత హాకీ సమాఖ్య (IHF):
  • భారత హాకీ సమాఖ్య (IHF-Indian Hockey Federation) 1925 నుండి 2008 వరకు భారతదేశంలో ఫీల్డ్ హాకీ యొక్క పాలక మండలిగా ఉండేది.
  • ఇది జాతీయ టోర్నమెంట్ల నియంత్రణ, నిర్వహణ, జాతీయ జట్ల ఎంపిక మరియు భారతదేశంలో ఫీల్డ్ హాకీని నిర్వహించడానికి మరియు ప్రోత్సాహించడానికి బాధ్యత వహించేది.
  • కానీ 2008లో భారత హాకీ సమాఖ్య కార్యదర్శి కె.జోతికుమారన్ మలేషియాలో జరగబోయే టోర్నమెంటుకి ఫలానా ఆటగాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసేందుకు రహస్య విలేఖరుల నుంచి లంచం తీసుకుంటూ ఆజ్ తక్ టెలివిజన్ ఛానల్ జర్నలిస్టుల స్టింగ్ ఆపరేషన్ లో కెమెరాకు చిక్కాడు.
  • దీంతో 28 ఏప్రిల్ 2008న భారత ఒలింపిక్ సంఘం (IOA-Indian Olympic Association) ఇండియన్ హాకీ ఫెడరేషన్ ను సస్పెండ్ చేసింది.
  • దీని స్థానంలో హాకీ ఇండియా (Hockey India) 2009లో ఏర్పాటు చేయబడింది.
  • భారతదేశంలో ఫీల్డ్ హాకీని నియంత్రించే, ప్రోత్సాహించే బాధ్యత కలిగిన ఏకైక సంస్థగా హాకీ ఇండియాను 28 ఫిబ్రవరి 2014న భారత ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఇది రద్దు చేయబడింది.

హాకీ ఇండియా (HI):
  • స్థాపన 20 మే 2009
  • ప్రధాన కార్యాలయం  న్యూఢిల్లీ
  • ఇది జాతీయ టోర్నమెంట్ల నిర్వహణ, నియంత్రణ, జాతీయ జట్ల ఎంపిక మరియు భారతదేశంలో ఫీల్డ్ హాకీని నిర్వహించడానికి మరియు ప్రోత్సాహించడానికి బాధ్యత వహిస్తుంది.
  • 2008లో భారత ఒలింపిక్ సంఘం (IOA) చేత ఇండియన్ హాకీ ఫెడరేషన్ రద్దు చేయబడిన తర్వాత దాని స్థానంలో హాకీ ఇండియా (Hockey India) ఏర్పడింది.
  • ఫిబ్రవరి 28, 2014న భారతదేశంలో హాకీని ప్రోత్సాహించే, నియంత్రించే బాధ్యత కలిగిన ఏకైక సంస్థగా భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖచే ఇది గుర్తింపు పొందింది.
  • ఇది అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA), ఆసియన్ హాకీ ఫెడరేషన్ (AHF)లకు అనుబంధంగా ఉంది.
  • Website: www.hockeyindia.org
  • Hockey India Annual Report (Click)
  • ఇది నిర్వహించే టోర్నమెంట్ల జాబితా (Click)


Summary:

Indian Men's Hockey Team
# First Place Second Place Third Place Fourth Place
Olympic Games 8 (1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980) 1 (1960) 3 (1968, 1972, 2020) -
World Cup 1 (1975) 1 (1973) 1 (1971) -


Indian Women's Hockey Team
# First Place Second Place Third Place Fourth Place
Olympic Games - - - 2 (1980, 2020)
World Cup - - - 1 (1974)




No comments:

Post a Comment