హాకీ (Hockey):
- హాకీ అనేది ఒక క్రీడా. దీనిని పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఆడతారు.
- ఇందులో రెండు జట్లు పాల్గొంటాయి. ప్రతీ జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు.
- రెండు జట్లు హాకీ స్టిక్ ఉపయోగించి ప్రత్యర్థి గోల్ లోకి ఒక రకమైన తెలుపు రంగు బాల్ లేదా డిస్క్ (పుక్ వంటివి) ను వేయడానికి ప్రయత్నిస్తుంటారు. మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన జట్టు గెలుస్తుంది.
- రెండు జట్లకు కూడా ఒక్కొక్క గోల్ కీపర్ ఉంటాడు. గోల్ కీపర్ యొక్క లక్ష్యం బంతిని గోల్ పోస్ట్ లోకి రాకుండా నిరోధించడం.
హాకీ చరిత్ర (History of Hockey):
- క్రీ.పూ.4000 సంవత్సారాల క్రితం ఈజిప్టులో హాకీ క్రీడను ఆడినట్లు చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి.
- కానీ ఆధునిక ఫీల్డ్ హాకీ 18వ శతాబ్దం మధ్యలో ఇంగ్లాండులో అభివృద్ధి చేయబడింది.
- మొదటి హాకీ అసోసియేషన్ 1876లో ఇంగ్లాండులో ఏర్పడింది.
- ఈ హాకీ క్రీడలో అనేక రకాలు ఉన్నాయి. ఫీల్డ్ హాకీ, ఐస్ హాకీ, రోలర్ హాకీ, రింక్ హాకీ, ఫ్లోర్ హాకీ, బాండీ, స్లెడ్జ్ హాకీ (పారా ఐస్ హాకీ), వీధీ హాకీ, బాల్ హాకీ, గాలి హాకీ, బ్రూంబాల్, బుడగ హాకీ, పోలో మొదలైనవి.
- మైదాన హాకీ (Field Hockey) అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడ. దీని అధికారిక పేరు కేవలం హాకీ మాత్రమే. భారతదేశంలో సహా పలుచోట్ల దీనిని హాకీ గానే వ్యవహరిస్తారు. కొన్ని దేశాలలో దీనిని అక్కడ ప్రసిద్ధిగాంచిన ఇతర రకములైన హాకీల నుండి గుర్తించడానికి మైదాన హాకీగా వ్యవహరిస్తారు.
- హాకీ (మైదాన హాకీ)లో జరిగే చాలా గౌరవప్రధమైన అంతర్జాతీయ ఆటల పోటీలు: సమ్మర్ ఒలింపిక్స్, హాకీ ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనవి.
- అంతర్జాతీయంగా ఈ మైదాన/ ఫీల్డ్ హాకీ క్రీడను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) నిర్వహిస్తుంది మరియు నియంత్రిస్తుంది.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH):
- స్థాపన ⇒ 7 జనవరి 1924
- ప్రధాన కార్యాలయం ⇒ లౌసాన్, స్విట్జర్లాండ్
- Website: www.fih.hockey
- అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH-International Hockey Federation) అనేది అంతర్జాతీయంగా మైదాన/ ఫీల్డ్ హాకీ క్రీడకు సంబంధించిన పాలక మండలి.
- ఫీల్డ్ హాకీ క్రీడకు సంబంధించిన అంతర్జాతీయ పోటీలను పర్యవేక్షించడం, నియమాలు, నిబంధనలను ఏర్పాటు చేయడం, వాటిని అమలు చేయడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడను ప్రోత్సాహించడం వంటి బాధ్యతలను కలిగి ఉంది.
- 1924 సమ్మర్ ఒలింపిక్స్ నుండి ఫీల్డ్ హాకీని తొలగించినందుకు ప్రతిస్పందగా, దీనిని పాల్ లెయుటీ అనే వ్యక్తి ప్యారిస్ లో స్థాపించాడు. ఇతనే FIH కు మొదటి అధ్యక్షుడయ్యాడు.
- 1927లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్స్ హాకీ అసోసియేషన్స్ (IFWHA) ఏర్పడింది.
- 1982లో FIH మరియు IFWHA లు కలిసి ప్రస్తుత FIH ని ఏర్పాటు చేశాయి.
- నేడు FIH ఐదు కాంటినెంటల్ అసోసియేషన్లు, 137 నేషనల్ అసోసియేషన్లను కలిగి ఉంది మరియు ఇప్పటికీ అభివృద్ధి చెందుతొంది.
ఇది నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లు:
- పురుషుల హాకీ ప్రపంచ కప్
- మహిళల హాకీ ప్రపంచ కప్
- సమ్మర్ ఒలింపిక్స్ లో ఫీల్డ్ హాకీ (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సహకారంతో)
- హాకీ జూనియర్ ప్రపంచ కప్
- ఇండోర్ హాకీ ప్రపంచ కప్
- యూత్ ఒలింపిక్ గేమ్స్
వీటిని కూడా చూడండి:
- భారతదేశంలో హాకీ చరిత్ర
- హాకీ (Hockey)
- క్రీడలు (Sports)
- జనరల్ స్టడీస్ (General Studies)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)