ANTI SMUGGLING DAYదొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం****
ఉద్దేశ్యం:
- దేశార్థికానికి తీవ్ర హాని చేస్తున్న దొంగ రవాణా (Smuggling) పై అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన దొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం (Anti Smuggling Day) జరుపుకుంటారు.
ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?
- 2022 నుండి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 11 న దొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం (Anti Smuggling Day) జరుపుకుంటున్నారు.
- భారత పరిశ్రమల సమాఖ్య (FICCI) ఆధ్వర్యంలోని దొంగ రవాణా నకిలీల వ్యతిరేక కమిటీ (CASCADE) ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుంది.
దొంగ రవాణా (Smuggling):
- చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ముఖ్యంగా చట్టపరమైన సుంకం (TAX) చెల్లించకుండా వస్తువులను రహస్యంగా దిగుమతి లేదా ఎగుమతి చేయడాన్ని దొంగ రవాణా (Smuggling) అంటారు.
- వ్యభిచారం, బలవంతపు శ్రమ లేదా ఇతర రకాల దోపిడి కోసం మానవులను తరలించడం, సేకరించడం, వాళ్ళతో వ్యాపారం చేయించడం, వాళ్ళని కొనడం మరియు అమ్మడాన్ని మానవ అక్రమ రవాణా (Human Trafficking) అంటారు.
దొంగ రవాణాకు కారణాలు:
- పలుదేశాల్లో కొన్ని రకాల వస్తువులపై అధిక పన్నురేట్లు, నిషేధం ఉండటం, చవగ్గా ప్రత్యామ్నాయాలు దొరకడం వంటివి దొంగ రవాణాకు దారితీస్తున్నాయి.
- సాధారణంగా బంగారం, పొగాగు, మద్య ఉత్పత్తులు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, మత్తు పదార్థాలు, పురాతన విగ్రహాలు, ఎర్ర చందనం, జంతువుల శరీర భాగాలు ఇలా లెక్కకు మిక్కిలిగా దొంగ రవాణాకు గురైతున్నాయి.
- కొన్ని జంతువుల శరీర భాగాల్లో ఔషధ గుణాలు ఉంటాయనే దురాశ, మూఢనమ్మకాలు, ఇతర దేశాల ప్రాణులను పెంచుకోవాలనే కోరిక, గృహాలంకరణ అభిలాష వంటివి దొంగ రవాణా వర్ధిల్లేలా చేస్తున్నాయి.
- నిఘా వ్యవస్థ వైఫల్యం, అధికారుల అవినీతి స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగడానికి సహకరిస్తున్నాయి.
దొంగ రవాణావల్ల నష్టాలు:
- దొంగ రవాణా ప్రభుత్వాల పన్ను ఆదాయానికి నష్టాన్ని కలిస్తుంది.
- దేశార్థికాన్ని కుంగదీస్తుంది.
- చట్టబద్ధంగా నడుస్తున్న సంస్థలను అస్థిరపరుస్తుంది.
- ఆవిష్కరణలు, పెట్టుబడులకు విఘాతంగా మారుతుంది.
- వినియోగదారుల భద్రత ప్రమాదంలో పడుతుంది.
- జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది.
- స్మగ్లింగ్ ప్రపంచవ్యాప్తంగా నేర కార్యాకలాపాలు, అవినీతి, ఉగ్రవాదాన్ని సైతం పెంచి పోషిస్తుంది.
- ఉద్యోగావకాశాలు చాలామంది కోల్పోతారు.
స్మగ్లింగ్ ను నివారించడం కష్టసాధ్యం:
- దొంగ రవాణా విషయంలో పైస్థాయి వ్యక్తులు అత్యంత గోప్యత పాటిస్తారు. తమతో నేరుగా సంబంధం లేని వ్యక్తులనే క్షేత్రస్థాయిలో స్మగ్లింగ్ కు వినియోగిస్తారు. వారే అధికంగా పోలీసులకు పట్టుబడుతున్నారు. దానివల్ల దొంగ రవాణా అసలు మూలాలు తెలియడం లేదు.
- ఒక వేళ బడా వ్యక్తులను అరెస్టు చేసిన రాజకీయ బలం, చట్టంలోని లొసగులను ఉపయోగించుకుని బయటకు వచ్చేస్తున్నారు.
- అధికార గణంలో పేరుకుపోయిన అవినీతి, భధ్యతారాహిత్యం సైతం అక్రమార్కులకు వరాలుగా మారుతున్నాయి.
- వీటన్నిటికి సరైన విరుగుడు చర్యలు చేపట్టకుండా భారత్ లో స్మగ్లింగ్ ను నివారించడం కష్టసాద్యం.
గణాంకాలు:
DRI Report 2021-22:
- అక్రమ మార్గాల్లో భారత్ లోకి తరలించిన 833 KG ల బంగారాన్ని Directorate of Revenue Intelligence (DRI) పట్టుకుంది. దాని విలువ సుమారు రూ.405.35 కోట్లు. పట్టబడ్డ మొత్తం బంగారంలో 37% మయన్మార్ నుంచే వచ్చింది.
- 2021 నవంబర్ ఒక్క నెలలోనే అత్యధికంగా 144 KG ల బంగారం పట్టుబడింది.
- రూ.93 కోట్ల విలువైన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను DRI స్వాధీనం చేసుకుంది.
- 28334 KG ల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.
- DRI Reports (Official Website)
FICCI CASCADE Report 2019-20:
- మొబైల్ ఫోన్లు, FMCG-గృహ & వ్యక్తిగత వస్తువులు, FMCG-ప్యాకేజ్డ్ ఆహారాలు, పొగాకు ఉత్పత్తులు, మద్య పానీయాలు, ఈ ఐదు విభాగాల్లో భారత్ రూ.58,521 కోట్ల పన్ను ఆదాయాన్ని నష్టపోయింది. ఈ ఐదు విభాగాల్లో అక్రమ విపణి విలువ రూ.2,60,094 కోట్లు. ఈ ఐదు విభాగాల్లో 15.96 లక్షల ఉద్యోగావకాశాలు దూరమయ్యాయి.
- FICCI CASCADE Reports (Official Website)
వీటిని కూడా చూడండీ :-
- తీవ్రవాద/ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (Anti Terrorism Day)
- అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (International Anti Corruption Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)