NATIONAL DEWORMING DAY
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
****
ఉద్దేశ్యం:
- చిన్నపిల్లల్లో (Age 1-19) పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులైన నులిపురుగుల (Worm/ Helminth) నిర్మూలనపై అవగాహన పెంచడం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?
- 2015 నుంచి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని అమలుచేస్తుంది.
- ప్రభుత్వాలు సంవత్సరంలో రెండుసార్లు పాఠశాలలు, అంగన్ వాడీలలో ఒక రోజు కార్యక్రమంగా నిర్వహిస్తూ, నులిపురుగుల గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన అల్బెండజోల్ (Albendazole) మాత్రలను నులిపురుగుల నివారణకు పిల్లలకు మరియు కౌమార దశలోని వారికి సామూహిక మందుల పంపిణి కార్రక్రమం కింద అందజేయడం జరుగుతుంది.
నులిపురుగులు (Worm/ Helminth):
- నులిపురుగులు అనేవి పరాన్న జీవులు. ఇవి ఆహారం మరియు మనుగడ కోసం మానవ ప్రేగులలో నివసిస్తాయి. ఇవి మానవ శరీరానికి కావలసిన పోషకాలను తినేస్తాయి.
- క్రిమినాశక మందు/ మాత్రలు ఇవ్వడం ద్వారా పేగుపురుగులు/ పరాన్నజీవులను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియనే నులిపురుగుల నిర్మూలన (Deworming) అంటారు.
- కలుషితమైన మట్టిద్వారా మానవ శరీరంలోకి వ్యాపించే పురుగులను Soil-transmitted Helminths అంటారు.
- పిల్లల్లో సాధారణంగా నాలుగు రకాల నులిపురుగులు కవబడే అవకాసం ఉంది. (1) Roundworm (2) Tapeworm (3) Whipworm (4) Hookworm
నులిపురుగులు శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి?
- కలుషిత ప్రాంతాల్లో చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో నడవడంవల్ల కొన్ని రకాల పురుగుల గుడ్లు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
- కొన్ని సందర్భాల్లో వీటి గుడ్లు మనం తినే ఆహారం ద్వారా పొట్టలోకి చేరుతాయి.
- తాగే నీళ్ళు, ఆహారం వండటానికి ఉపయోగించే నీరు కలుషితం అవ్వడంవల్ల వాటి గడ్లు/ లార్వాలు శరీరంలోకి చేరతాయి.
- అపరిశుభ్రమైన పెంపుడు జంతువుల ద్వారా కూడా నులిపురుగుల గుడ్లు మానవ శరీరంలోకి చేరవచ్చు.
శరీరంపై నులిపురుగుల ప్రభావం?
- నులిపురుగులు గడ్లు/ లార్వాల రూపంలో శరీరంలోకి చేరి పేగుల నుంచి పోషకాలను గ్రహించి తమ సంతానాన్ని పెంచుకుంటాయి.
- ఇది పిల్లల ఎదుగుదలపైన, వారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతుంది.
- వీటిద్వారా పిల్లల శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం, తరుచుగా మూత్ర విసర్జల, అలసట, డీహైడ్రేషన్ తో పాటు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
నులిపురుగుల నివారణ:
ఆల్బెండజోల్ (Albendazole)
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఆల్బెండజోల్ (Albendazole) మాత్రలు వేసుకోవాలి.
- 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 400 Mg మాత్రలో సగం (200 Mg) మాత్రను వేసుకోవాలి. మిగతావారు 400 Mg మాత్రను వేసుకోవాలి.
- మాత్రను బాగా నమలాలి/ చప్పరించాలి.
- ఈ మాత్రను వేసుకున్న ఒకరోజు లేదా రెండో రోజుల్లోనే నులిపురుగులు ఉన్నట్లయితే మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి.
- గర్బిణీలు సైతం ఈ మాత్రలను వేసుకోవచ్చు.
- కొందరిలో ఈ మాత్ర వేసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, స్వల్పంగా జ్వరం వస్తే వారిలో ఎక్కువ పురుగులు ఉన్నట్లుగా అర్థం.