WORLD RADIO DAYప్రపంచ రేడియో దినోత్సవం****
ఉద్దేశ్యం:
- రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన పెంచడం మరియు ప్రసారకర్తల మద్య నెట్‌వర్కింగ్ మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం ప్రపంచ రేడియో దినోత్సవం (World Radio Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
- ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంది. రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటంలో, పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది. రోజూ నాలుగు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే, పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ లలిత సంగీతం వ్యవసాయ కార్యక్రమాలు, క్విజ్, కథానిక, సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది. ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్దా చిన్నా అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం.
ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?
- 2012 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 న ప్రపంచ రేడియో దినోత్సవం (World Radio Day) ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
ఫిబ్రవరి 13 నే ఎందుకు?
- ఐక్యరాజ్యసమితి రేడియో (UN Radio) 13 ఫిబ్రవరి 1946 లో స్థాపించబడింది. ఈరోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 న ప్రపంచ రేడియో దినోత్సవం (World Radio Day) ను జరుపుకుంటారు.
- రేడియో దినోత్సవాన్ని జరపాలని యునెస్కో (UNESCO) కు స్పెయిన్ 2010 లో ప్రతిపాదించింది.
- 2011 ఫిబ్రవరి 13 న జరిగిన యునెస్కో సర్వసభ్య సమావేశం యొక్క 36 వ సెషన్ లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించింది.
- 14 జనవరి 2013 న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో, యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించడాన్ని అధికారికంగా ఆమోదించింది.
థీమ్ (Theme):
- 2023: Radio and Peace
- 2022: Radio and Trust
- 2021: New World, New Radio - Evolution, Innovation, Connection
- 2020: Radio and diversity
- 2019: Dialogue, Tolerance, and Peace
- 2018: Radio and Sports
- 2017: Radio is You
- 2016: Radio in Times of Emergency and Disaster
- 2015: Youth and Radio
- 2014: Gender Equality and Women's Empowerment in Radio
- రేడియో చరిత్ర (History of Radio)
- పబ్లిక్ రేడియో ప్రసార దినోత్సవం (Public Radio Broadcasting Day)
- జాతీయ ప్రసార దినోత్సవం (National Broadcasting Day) - జులై 23
- పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే (Public Service Broadcasting Day) - నవంబర్ 12
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)