History of Election Machinery in India and Election Process in Telugu | భారత ఎన్నికల యంత్రాంగం మరియు ఎన్నికల ప్రక్రియ

History of Election Machinery in India and Election Process in Telugu | భారత ఎన్నికల యంత్రాంగం మరియు ఎన్నికల ప్రక్రియ  History of Election Machinery in India and Election Process in Telugu, History of Election Machinery in India in Telugu, History of Election Process in Telugu, History of AP State Election Commission in Telugu, AP State Election Commission in telugu, about AP State Election Commission in telugu, AP State Election Commission, History of Election Commission of India in telugu, Election Commission of India in telugu, about Election Commission of India in telugu, Election Commission of India, National Voters Day in telugu, National Voters Day in telugu, History of National Voters Day in telugu, about National Voters Day, Themes of National Voters Day, Celebrations of National Voters Day, National Voters Day essay in telugu, National Voters Day, jathiya voters dinotsavam, why we celebrate National Voters Day in telugu, Student Soula,
History of Election Machinery in India
and Election Process in Telugu |
భారత ఎన్నికల యంత్రాంగం మరియు
ఎన్నికల ప్రక్రియ

Election Machinery in India
(భారత ఎన్నికల యంత్రాంగం)

****

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India):

  • ఇది రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ, నిర్వహణ, మొదలగు అధికారాలను కలిగి ఉంటుంది.

ప్రాంతీయ ఎన్నికల సంఘం (Regional Election Commission):

  • కొన్ని రాష్ట్రాలకు కలిపి ప్రాంతీయ ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చు.
  • కానీ ఇంతవరకు అలాంటి సంఘాన్ని ఏర్పాటు చేయలేదు.

ప్రధాన ఎన్నికల అధికారి (CEO- Chief Electoral Officer):

  • ప్రతీ రాష్ట్రంలో పార్లమెంటు/ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ఈ అధికారిని నియమిస్తుంది.
  • ప్రతీ రాష్ట్రానికి ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఉంటారు.
  • ఈ పదవికి రాజ్యాంగ బద్ధత లేదు.
  • ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి - ముఖేష్ కుమార్ మీనా

జిల్లా ఎన్నికల అధికారి (District Election Officer):

  • ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణలో ప్రతీ జిల్లాకు ఒక ఎన్నికల అధికారిని నియమిస్తారు.
  • సాధారణంగా జిల్లా కలెక్టరే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.

రిటర్నింగ్ అధికారి (Returning officer):

  • పార్లమెంటు/ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ప్రతీ నియోజక వర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది.

ఓటర్ల నమోదు అధికారి (Electoral Registration Officer):

  • ఓటర్ల జాబితాను తయారుచేసే అధికారి.
  • ఇతనికి సహాయంగా Assistant Electoral Registration Officer, BLO లు కూడా ఉంటారు.
  • BLO (Booth Level Officer) లు తమకు కేటాయించిన పోలింగ్ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణ, ఫీల్డ్ వెరిఫికేషన్, అర్హులైన ఓటర్లు, చనిపోయిన ఓటర్లను గుర్తించడం, అక్కడికి కొత్తగా నివసించడానికి వచ్చిన ఓటర్ల సమాచారాన్ని సేకరించే బాధ్యతను కలిగి ఉంటారు.

ప్రిసైడింగ్ ఆఫీసర్ (Presiding Officer):

  • పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ని జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తారు.

పరిశీలకులు (Observers):

  • ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ చెయ్యడానికి కొందరు అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది.
  • వీరు తమ నివేదికను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు.


Election Process
(ఎన్నికల ప్రక్రియ)

****

ఓటర్ల జాబితా తయారి:

  • ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలో ఓటర్ల జాబితాను తయారుచేసి మార్పులు, చేర్పులు చెయ్యడం జరుగుతుంది.
  • ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ

ఎన్నికల షెడ్యూలు & నోటిఫికేషన్:

  • పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు గవర్నర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారి చెయ్యబడుతుంది.
  • ఎన్నికలకు కొన్ని వారాల ముందుగా ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తుంది. 
  • ఎన్నికల షెడ్యూల్ వెలువరించిన వెంటనే ఎన్నికల నియమావళి (Model Code of Conduct) అములులోకి వస్తుంది.

నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ:

  • అభ్యుర్థులు తమ నామినేషన్లను సంబంధిత నియోజకవర్గం ఎన్నికల అధికారికి (Returning officer/Assistant Electoral Registration Officer) సమర్పించాలి.
  • సాధారణంగా నామినేషన్ల పరిశీలన పూర్తి అయిన రెండు రోజుల లోపల తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలి.

ఎన్నికల ప్రచారం:

  • రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు తమ సిద్ధాంతాలను, విధానాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు
  • అయితే పోలింగ్ తేదీకి 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయవలసి ఉంటుంది.

బ్యాలెట్ పత్రాలు, గుర్తులు:

  • నామినేషన్ పర్వం ముగియగానే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను తయారుచేసి, బ్యాలెట్ పత్రంపై అభ్యర్థి పేరు, కేటాయించిన గర్తులను ముద్రిస్తారు.

ఎన్నికల విధానం:

  • రహస్య ఓటింగ్ పద్ధతిని పాటిస్తారు.
  • ప్రతి పోలింగ్ స్టేషన్లో 1500 మంది ఓటర్లకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
  • ఎన్నికల రోజున ఎన్నికల పోలింగ్ స్టేషన్ ను కనీసం 8 గంటలకు తక్కువ కాకుండా తెరిచి ఉంచాలి.

ఓట్ల లెక్కింపు:

  • ఓటింగ్ పూర్తి కాగానే ఒటకి లేదా రెండు రోజుల తర్వాత రిటర్నింగ్ అధికారి మరియు పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
  • అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటించి, ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. దీనితో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఎన్నికలు - వివాదాలు - పరిష్కారం
****

  • పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి ఆర్టికల్ 323(B) ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయవచ్చు. ఇంతవరకూ అలాంటి ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు.
  • ఎన్నికలు జరిగే సమయంలో అనగా ఫలితాలు ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే పరిశీలించి తీర్పును వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయాస్థానాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు.
  • అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి వివాదాన్నయిన హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.

ఇతర అంశాలు:

  • ఎన్నికలకు సంబంధించి చేసే చట్ట వ్యతిరేఖ అవినీతి కార్యకలాపాల ఉల్లంఘనలపై నిర్దేశించిన చట్టాల వివరాలు (Click Here)