Wednesday, January 25, 2023

History of National Voters Day in Telugu | జాతీయ ఓటర్ల దినోత్సవం - జనవరి 25

History of National Voters Day in Telugu | జాతీయ ఓటర్ల దినోత్సవం - జనవరి 25  National Voters Day in telugu, National Voters Day in telugu, History of National Voters Day in telugu, about National Voters Day, Themes of National Voters Day, Celebrations of National Voters Day, National Voters Day essay in telugu, National Voters Day, jathiya voters dinotsavam, why we celebrate National Voters Day in telugu, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in January, special in January, days celebrations in January, popular days in January, January lo dinostavalu, special in January 25, Student Soula,
History of National Voters Day in Telugu |
జాతీయ ఓటర్ల దినోత్సవం - జనవరి 25

National Voter's Day
జాతీయ ఓటర్ల దినోత్సవం

*****

ఉద్దేశ్యం:

  • ఓటు హక్కు యొక్క వినియోగం మరియు ఆవశ్యకతపట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voter's Day) ముఖ్య ఉద్దేశ్యం

ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?

  • 2011 నుంచి ప్రతీ సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు.

జనవరి 25నే ఎందుకు జరుపుకుంటారు?

  • స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజ్యాంగ బద్ధంగా భారత/కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) 25 జనవరి 1950 వ తేదీన ఏర్పాటైంది. అందువల్ల జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

థీమ్స్ (Themes):

  • 2023: Nothing Like Voting, I Vote for Sure
  • 2022: Making Elections Inclusive, Accessible and Participative
  • 2021: Making Our Voters Empowered, Vigilant, Safe and Informed
  • 2020: Electoral Literacy for Stronger Democracy
  • 2019: No Voter to be left behind

ఓటర్ల ప్రతిజ్ఞ (Voter's Pledge):

  • "భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము"

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లు:

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 5 జనవరి 2023న ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు.
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 3,99,84,868
  • ఇందులో పురుష ఓటర్లు - 1,97,59,489
  • మహిళా ఓటర్లు - 2,02,21,455
  • థర్డ్ జెండర్ ఓటర్లు - 3,924
  • దివ్యాంగులు - 5,17,403
  • అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లా - కర్నూల్ (19,41,277)
  • అత్యల్ప ఓటర్లు కలిగిన జిల్లా - అల్లూరి సీతారామరాజు (7,29,085)
  • రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు - 45,951
  • 2022లో మొత్తం ఓటర్ల సంఖ్య - 4,07,36,279
History of National Voters Day in Telugu | జాతీయ ఓటర్ల దినోత్సవం - జనవరి 25  National Voters Day in telugu, National Voters Day in telugu, History of National Voters Day in telugu, about National Voters Day, Themes of National Voters Day, Celebrations of National Voters Day, National Voters Day essay in telugu, National Voters Day, jathiya voters dinotsavam, why we celebrate National Voters Day in telugu, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in January, special in January, days celebrations in January, popular days in January, January lo dinostavalu, special in January 25, Student Soula,

ఇతర అంశాలు:

  • భారతదేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య - 83,40,82,814
  • ఓటర్ గుర్తింపు కార్డును మొదటిసారిగా 1993లో అప్పటి ప్రధాన ఎన్నికల కమీషనర్ టి.ఎన్.శేషన్ హయంలో ప్రవేశపెట్టబడింది.
  • రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. అయితే 1988 లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 18 సంవత్సరాలకు రాజీవ్ గాంధి ప్రభుత్వం తగ్గించింది. ఈ సవరణ మార్చి 28, 1989 నుంచి అమలులోకి వచ్చింది.
  • ఎన్నికల ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబర్ - 1950
  • కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారం-6, అభ్యంతరాలను తెలపాలంటే ఫారం-7, సవరణలు ఉంటే ఫారం-8 ద్వారా దరాఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైంది - అబ్రహం లింకన్
  • ఓటు వేయకపోతే నువ్వు లెక్కలోకి రావు - నాన్సి పెలోసి
  • భారతదేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికలు 1951-52 లో జరిగాయి. 
  • 17వ లోక్‌సభ ఎన్నికలు 2019 లో జరిగాయి.
  • 17వ లోకసభ ఎన్నికల్లో 67.4% ఓటింగ్ నమోదైంది. దాదాపు 30 కోట్లమంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
  • ఆంధ్ర రాష్ట్ర శాసనసభ మొదటి ఎన్నికలు 1955 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి.
  • 15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 11 ఏప్రిల్ 2019న జరిగాయి.
  • గౌరీ సావంత్: మొదటి లింగమార్పిడి ఎన్నికల అంబాసిడర్ (First Transgender Election Ambassador). 2019లో, భారత ఎన్నికల సంఘం గౌరీ సావంత్‌ను మహారాష్ట్ర నుండి 12 మంది ఎన్నికల అంబాసిడర్‌లలో ఒకరిగా నియమించింది. 
  • ఎన్నికలకు సంబంధించి చేసే చట్ట వ్యతిరేఖ అవినీతి కార్యకలాపాల ఉల్లంఘనలపై నిర్దేశించిన చట్టాల వివరాలు (Click Here)

Electronic Voting Mechine (EVM):

  • 1982లో కేరళలోని పరవూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల్లో EVM లను ఉపయోగించారు. అయితే వీటి ఉపయోగానికి చట్టబద్ధత లేనందువల్ల సుప్రీంకోర్టు ఈ ఎన్నికలను కొట్టివేసింది.
  • 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 61-ఎ కు సవరణ చేసి EVM ల వినియోగానికి చట్టబద్ధత కల్పించారు.
  • మొట్టమొదటిసారిగా వీటిని ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలోని 25 శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో ఉపయోగించారు (1998 లో)
  • 2001లో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో EVM లను ఉపయోగించారు.
  • AIADMK Vs. ECI కేసు-2002 లో సుప్రీం కోర్టు EVM ల వినియోగాన్ని సమర్థించింది. 
  • EVM లను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటి - దినేష్ గోస్వామి కమిటి

Remote Electronic Voting Mechine (RVM):

  • ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళే వలసదారులు ఓటు వెయ్యడానికి సముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం RVM లను రూపొందించింది.
  • ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలి. ఎన్నికల రోజు తమ ప్రాంతంలో ఉన్న రిమోట్ పోలింగ్ బూత్ కు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
  • ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న EVM కు ఇది సవరించిన వెర్షన్
  • కానీ ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

Voter Verifiable Paper Audit Trial (V.V.PAT):

  • ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసారో, వేసిన ఓటు తాము అనుకున్నవారికే నమోదు అయ్యిందా లేదా తెలుసుకునేందుకు, ప్రింటౌట్లు తీసుకునేందుకు ఈ V.V.PAT అనే మెషిన్ ఉపయోగపడుతుంది.
  • దీనిని ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 2013 లో నాగాలాండ్ లోని నోక్సన్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు.
  • ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా నంద్యాల విధానసభ (2017) ఉప ఎన్నికల్లో దీనిని ఉపయోగించారు.

C.Vigil App:

  • దీనిని సిటిజన్ విజిల్ యాప్ అంటారు.
  • ఈ మొబైల్ యాప్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. 
  • పౌరులు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అక్రమాలు జరిగినప్పుడు దీని ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయవచ్చు.
  • ఫోటో రెండు నిమిషాల వ్యవధితో వీడియోలు అప్ లోడ్ చేయవచ్చు. 
  • మొదటిసారిగా 2018లో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు.
  • 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వినియోగించారు.

Proxy Vote (Postal Ballot):

  • సాయుధ దళాలు, పోలీసులు, ఇతర అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్నవారు, ఎన్నికల విధులలో నిమగ్నమైన సిబ్బంది, 65 ఏళ్లు పైబడినవారు, వికలాంగులు, కొవిడ్-19 పాజిటివ్ రోగులు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన పద్ధతిలో పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ద్వారా ఓటు హక్కును వినియోగించవచ్చు.
  • ముఖ్యంగా సాయుధ దళాలు Electronically Transmitted Postal Ballot System (ETPBS) ద్వారా ఓటు హక్కును వినియోగించవచ్చు. దీనిని 2016లో ప్రారంభించారు. 2019 లోకసభ ఎన్నికల్లో 18 లక్షల రక్షణ సిబ్బంది ఈ పద్ధతి ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • మొదటిసారిగా సాయుధ బలగాలకు 2003లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు.

None Of The Above (NOTA):

  • ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చకపోతే ఓటర్లు NOTA కు ఓటు వేయవచ్చు.
  • People Union for Civil Liberties (PUCL) Vs. భారత ప్రభుత్వ కేసు-2013 లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా దీనిని ప్రవేశపెట్టారు.
  • 2013 డిసెబర్ లో ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో NOTA అనే ఆప్షన్ ను ప్రవేశపెట్టారు. 
  • NOTA అనేది కేవలం ఓటరుకున్న ఆప్షన్ మాత్రమే. అభ్యర్థి ఓటమి, గెలుపును ప్రభావితం చేయదు.
  • అత్యధికులు నోటాను వినియోగించుకున్నప్పటికీ పోలైన ఓట్లలో మెజారిటీ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు.


No comments:

Post a Comment