History of Election Commission of India in Telugu | భారత/ కేంద్ర ఎన్నికల సంఘం |
Election Commission of India
భారత/ కేంద్ర ఎన్నికల సంఘం
****
- ఇది శాశ్వత, స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ.
- ఇది 25 జనవరి 1950 న ఏర్పడింది.
- దీని ప్రధాన కార్యాలయం పేరు - నిర్వచన్ సదన్ (న్యూఢిల్లీ)
- భారత రాజ్యాంగంలో 15 భాగంలోని ఆర్టికల్ 324 నుండి 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి తెలుపుతున్నాయి.
- 324(1) - కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను నిర్వహిస్తుంది.
- 324(2) - ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర కమీషనర్లు ఉంటారు. ఈ అంశాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా నియంత్రించవచ్చు.
- 324(3) - ఎన్నికల సంఘంలో ఇతర కమీషనర్లు నియమించబడితే, ప్రధాన ఎన్నికల కమీషనర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు.
- 324(4) - కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ప్రాంతీయ ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి నియమించవచ్చు.
- 324(5) - పార్లమెంటు చేసిన చట్టాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమీషనర్, ప్రాంతీయ కమీషనర్లకు సంబంధించి పదవీకాలం, ఇతర సర్వీసు నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు: సుప్రీంకోర్టు న్యాయామూర్తులను తొలగించే విధంగానే ప్రధాన ఎన్నికల కమీషనర్ ను పార్లమెంటు తొలగిస్తుంది. కానీ ఇతర కమీషనర్లను మాత్రం ప్రధాన ఎన్నికల కమీషనర్ సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తాడు.
- 324(6) - కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో ఎన్నికల నిర్వహణ కొరకు కేంద్ర, రాష్ట్ర పభుత్వ సిబ్బందిని తీసుకుంటుంది.
- 325 - మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికలపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు.
- 326 - 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులకు వయోజన ఓటు హక్కు కల్పించడమైంది.
- 327 - ఎన్నికలకు సంబంధించి చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుంది.
- 328 - రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందించకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చు
- 329 - ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయాస్థానాలు సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోరాదు.
ముఖ్యమైన అంశాలు:
- ప్రధాన, ఇతర ఎన్నికల కమీషనర్ల పదవి కాలం - 6 సంవత్సరాలు లేదా పదవి విరమణ వయస్సు 65.
- ప్రధాన ఎన్నికల కమీషనర్ కు, ఇతర ఎన్నికల కమీషనర్లకు అధికారాలలో, హోదాలలో, జీత భత్యాలలో వ్యత్యాసం లేదు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు. సాధ్యం కాకపోతే మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు.
- వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. వీరి జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వేతనంతో సమానంగా ఉంటాయి. ప్రస్తుతం వీరి వేతనం నెలకు రూ.2,50,000/-
- భారత ప్రధాన, ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు.
- రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. అయితే 1988 లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 18 సంవత్సరాలకు రాజీవ్ గాంధి ప్రభుత్వం తగ్గించింది. ఈ సవరణ మార్చి 28, 1989 నుంచి అమలులోకి వచ్చింది.
- ఎన్నికలు జరిగే సమయంలో అనగా ఫలితాలు ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే పరిశీలించి తీర్పును వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయాస్థానాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు.
- అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి వివాదాన్నయిన హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.
- మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్ - సుకుమార్ సేన్
- ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన తొలి తెలుగువారు - ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రీ
- ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన మొదటి మహిళ - వి.ఎస్.రమాదేవి (తెలుగు మహిళ)
- ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనర్ (25వ) - రాజీవ్ కుమార్ (15 మే 2022 నుండి)
ప్రజా ప్రాతినిధ్య చట్టాలు (Representation of Peoples Acts):
- భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 81 మరియు 170 లో పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలలో ఉండాల్సిన గరిష్ఠ సభ్యుల సంఖ్యను, సీట్ల కేటాయింపునకు సంబంధిచిన కొన్ని నియమాలను మాత్రమే పేర్కొన్నారు.
- సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్లు, మొదలైన విషయాలను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
- ఇప్పటివరకు దీనికి సంబంధించి పార్లమెంటు రెండు చట్టాలను చేసింది.
(1) ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950:
- ఇందులో ఓటర్లు, అర్హతలు, ఓటర్ల పునర్ వ్యవస్థీకరణ, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన అంశాలు ఉంటాయి.
(2) ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951:
- ఇందులో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, పర్యవేక్షణ, ఎన్నికల వివాదాలు, ఉప ఎన్నికలు, రాజకీయ పార్టీల గుర్తింపు మొదలగు అంశాలు ఉంటాయి.
ఇతర అంశాలు:
- ఎన్నికలకు సంబంధించి చేసే చట్ట వ్యతిరేఖ అవినీతి కార్యకలాపాల ఉల్లంఘనలపై నిర్దేశించిన చట్టాల వివరాలు (Click Here)
వీటిని కూడా చూడండీ: