History of World Wetlands Day in Telugu | ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2

History of World Wetlands Day in Telugu | ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2  World Wetlands Day in telugu, World Wetlands Day essay in telugu, History of World Wetlands Day, about World Wetlands,  World Wetlands Day, Day Celebrations, prapancha chittadi nelala dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 2
History of World Wetlands Day in Telugu |
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2

World Wetlands Day
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
****

ఉద్దేశ్యం:
  • చిత్తడి నేలల ప్రాముఖ్యత మరియు పరిరక్షణ గురించి ప్రజలలో అవగాహన కలిగించడం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (World Wetlands Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
  • 1997 నుంచి ప్రతీ సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని (World Wetlands Day) ఫిబ్రవరి 2 న జరుపుకుంటారు. 
ఫిబ్రవరి 2 నే ఎందుకు?
  • 1971 పిబ్రవరి 2 వ తేదీన చిత్తడి నేలల పరిరక్షణకు ఇరాన్ దేశంలోని రామ్‌సర్ పట్టణంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తీసుకున్న ఉమ్మడి ఒప్పందానికి (Ramsar Convention) గుర్తుగా ప్రతీ సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2 న జరుపుకుంటారు.

రామ్‌సర్ కన్వెన్షన్ (Ramsar Convention):
  • క్షిణిస్తున్న చిత్తడి నేలల సమస్యపై 1971 ఫిబ్రవరి 2 వ తేదీన ఇరాన్ దేశంలోని రామ్‌సర్ పట్టణంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సులో చేసుకున్న ఒప్పందాన్నే రామ్‌సర్ ఒప్పందం (Ramsar Convention) అంటారు. చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. ఇది 21 డిసెంబర్ 1975 న అమల్లోకి వచ్చింది.
  • కన్వెన్షన్ యొక్క లక్ష్యం “స్థానిక మరియు జాతీయ చర్యలు మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా అన్ని చిత్తడి నేలల పరిరక్షణ మరియు తెలివైన ఉపయోగం, ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో సహకారం” 
  • ఈ కన్వెన్షన్ పై భారతదేశం 1982 ఫిబ్రవరి 1 న  సంతకం చేసింది.
థీమ్స్ (Themes):
  • 2023: It's Time for Wetlands Restoration
  • 2022: Wetlands Action for People and Nature
  • 2021: Wetlands and Water
  • 2020: Wetlands and Biodiversity
  • 2019: Wetlands and Climate Change
  • 2018: Wetlands for a Sustainable Urban Future
ఇతర ముఖ్యాంశాలు:
  • రామ్‌సర్ సైట్లు ప్రపంచంలోని ప్రధాన రక్షిత ప్రాంతాలలో ఒకటి.
  • ప్రస్తుతం ప్రపంచంలో 2,471 రామ్‌సర్ సైట్లు ఉన్నాయి (25,61,92,356 హెక్టార్లు)  (2023 ఫిబ్రవరి 2 నాటికి) 
  • ప్రపంచంలోని మొట్టమొదటి రామ్‌సర్ సైట్ - ఆస్ట్రేలియాలోని కోబోర్గ్ ద్వీపకల్పం (Cobourg Peninsula) (1974)
  • ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రామ్‌సర్ సైట్లు ఉన్న దేశాలు యునైటెడ్ కింగ్‌డమ్‌ (175), మెక్సికో (142).
భారతదేశంలోని రామ్‌సర్ సైట్లు (Ramsar Sites): 
  • భారతదేశంలో ప్రస్తుతం Wetlands of International Importance (Ramsar Sites) గా 75 సైట్లు గుర్తించబడ్డాయి (2023 ఫిబ్రవరి 2 నాటికి). వీటి ఉపరితల వైశాల్యం 13,26,677 హెక్టార్లు.
  • భారతదేశంలోని పురాతన రామ్సర్ సైట్లు - ఒడిశా లోని చిలికా సరస్సు (1981) & రాజస్థాన్ లోని కియోలాడియో నేషనల్ పార్క్ (1981)
  • భారతదేశంలో ఎక్కువ రామ్‌సర్ సైట్స్ లను కలిగిన రాష్ట్రాలు - తమిళనాడు (14), ఉత్తరప్రదేశ్ (10).
  • భారతదేశంలోని అతిపెద్ద రామ్‌సర్ సైట్ - Sundarban Wetland (4,23,000 హెక్టార్లు)
  • భారతదేశంలోని అతిచిన్న రామ్‌సర్ సైట్ - Renuka Lake (20 హెక్టార్లు)
  • 19 ఆగస్ట్ 2002 న ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేరు సరస్సుని రామ్‌సర్ సైట్ల (సైట్ నంబర్ 1209) జాబితాలో చేర్చారు.
History of World Wetlands Day in Telugu | ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2  World Wetlands Day in telugu, World Wetlands Day essay in telugu, History of World Wetlands Day, about World Wetlands,  World Wetlands Day, Day Celebrations, prapancha chittadi nelala dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 2
భారతదేశంలోని రామ్‌సర్ సైట్ల జాబితా
(List of Ramsar sites in India)

చిత్తడి నేలలు (Wetlands):
  • సముద్రం, నది, ఇతర నీటి వనరుల తీర ప్రాంతాలలో లోతు తక్కువ వుండి ఎక్కువ కాలం నీటి నిల్వ వుండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచి నీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, మడ అడవులున్న తీర ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే. 
చిత్తడి నేలల ఉపయోగాలు:
  • ఈ చిత్తడి నేలలు ముఖ్యంగా నదీ పరీవాహక ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతాలకు సమీపంగా ఉంటాయి. ఇవి నదుల గుండా వచ్చే కాలుష్య కారక పదార్థాలను, తమలో ఇముడ్చు కుంటాయి.
  • సముద్రపు భారీ అలల నుండి, సునామీల నుండి తీర ప్రాంతాలను రక్షిస్తాయి.
  • అరుదైన మొక్కలకు, పక్షులకు, జంతువులకు, చేపలు గుడ్లు పెట్టడానికి ఈ చిత్తడి నేలలు చాల అనుకూలం.

చిత్తడి నేలల విధ్వంసం:
  • మానవుల తప్పిదాలతో పర్వావరణానికి చాల హాని జరిగుతున్నది. ఆ పరంపరలో ఈ చిత్తడి నేలలకు కూడా ఎద్ద హాని జరుగుతున్నది.
  • ప్రజలు వ్యవసాయ అవసరాలకు ఈ భూములను ఆక్రమించుకోవడడం వల్ల
  • ప్రజలు నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంవల్ల
  • ప్రభుత్వం పరిశ్రమల కొరకు ఈ చిత్తడి నేలలను కేటాయిచడంవల్ల ఇవి విధ్వంసానికి గురవుతున్నాయి.
  • 1900 - 2000 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 60 శాతం చిత్తడి నేలలు కనుమరుగయ్యాయని, భారత్ లో 1970 నుంచి 2015 వరకు 35 శాతం చిత్తడి నేలలు అదృశ్యమైనట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

వీటిని కూడా చూడండీ: