History of AP State Election Commission in Telugu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం |
AP State Election Commission
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం
*****
- ప్రతీ రాష్ట్రంలో గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల (పంచాయతీ రాజ్ మరియు మునిసిపల్ సంస్థల) ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది.
- ఇది రాజ్యాంగ బద్ధ సంస్ధ.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-K మరియు 243-ZA ప్రకారం సెప్టెంబర్ 1994 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడింది.
- 243K - రాష్ట్రంలో పంచాయతి ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా మొదలగు అంశాలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తారు.
- 243K (2) - రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ యొక్క పదవీ కాలం, ఇతర సర్వీసు నిబంధనలను గవర్నర్ నిర్ణయిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే తొలగిస్తారు.
- 243K (3) - స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు అవసరమైన ఉద్యోగులను రాష్ట్ర గవర్నర్ అనుమతితో సమకూర్చుకుంటారు.
- 243K (4) - రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి పంచాయతి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చట్టాలు చేయవచ్చు.
- 243ZA (1) - ఆర్టికల్ 243K లో ప్రస్తావించిన విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది.
- 243ZA (2) - పట్టణ స్ధానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చట్టాలు చేయవచ్చు.
ముఖ్యమైన అంశాలు:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకసభ్య కమీషన్.
- రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవికాలం - 5 సంవత్సరాలు
- హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన జీతభత్యాలు పొందుతాడు (రూ.2,25,000).
- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ - నీలం సాహ్ని (1 ఏప్రిల్ 2021 నుండి).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లు:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 5 జనవరి 2023న ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు.
- రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 3,99,84,868
- ఇందులో పురుష ఓటర్లు - 1,97,59,489
- మహిళా ఓటర్లు - 2,02,21,455
- థర్డ్ జెండర్ ఓటర్లు - 3,924
- దివ్యాంగులు - 5,17,403
- అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లా - కర్నూల్ (19,41,277)
- అత్యల్ప ఓటర్లు కలిగిన జిల్లా - అల్లూరి సీతారామరాజు (7,29,085)
- రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు - 45,951
- 2022లో మొత్తం ఓటర్ల సంఖ్య - 4,07,36,279
ఇతర అంశాలు:
- ఎన్నికలకు సంబంధించి చేసే చట్ట వ్యతిరేఖ అవినీతి కార్యకలాపాల ఉల్లంఘనలపై నిర్దేశించిన చట్టాల వివరాలు (Click Here)