History of World AIDS Day in Telugu | ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం


History of World AIDS Day in Telugu | ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం - డిసెంబర్ 1
World AIDS Day in telugu, World AIDS day essay in telugu, History of World AIDS Day, about World AIDS Day, Themes of World AIDS Day, Celebrations of World AIDS Day, World AIDS Day, prapancha AIDS dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in December, days celebrations in December, popular days in December, December lo dinostavalu, special in December 1, Student Soula,


ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం - డిసెంబర్ 1

ఉద్దేశ్యం:

  • ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక HIV కి వ్యతిరేకంగా పోరాడడం, ఎయిడ్స్ వ్యాధితో బాధపడే ప్రజలకు మద్దతు ఇవ్వడం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (World AIDS Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటీ నుంచి?:

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించింది. 
  • అందువల్ల 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.


థీమ్స్ (Themes):

  • 2020: Global solidarity, resilient HIV services
  • 2019: Communities make the difference
  • 2018: Know your status (మీ స్థితిని తెలుసుకోండి)
  • 2017: My Health, My Right (నా ఆరోగ్యం, నా హక్కు)

గణాంకాలు:

  • 1984 నుండి 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్లకు పైగా ప్రజలు HIV/AIDSతో మరణించారు. ఇది చరిత్రలో అత్యంత వినాశకరమైన మహమ్మారిలో ఒకటిగా నిలిచింది.
  • ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి 38 మిలియన్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారు.
  • 2018 లో ప్రపంచంలో సుమారు 7.7 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణించారు.
  • 2019 లో 690000 మంది HIV సంబంధిత కారణాలతో మరణించారు మరియు 1.7 మిలియన్ల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 
  • కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కల ప్రకారం 2019 నాటికి దేశంలో ఎయిడ్స్ రోగుల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచాయి.
  • 2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారు.

AIDS యొక్క చరిత్ర:
  • శాస్త్రవేత్తల అంచనా ప్రకారం HIV వైరస్ సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915 - 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు.
  • అప్పట్లో ఆఫ్రికాలోని గ్రీన్ చింపాజీ లకు SIV (Simian Immuno deficiency Virus) అనే వైరస్ సోకుతూ ఉండేది. ఇది HIV గా రూపాంతరం చెంది మనుషులకు సోకడం ప్రారంభించింది అని చెబుతారు. 

HIV వైరస్ ను కనుగొన్నది:
  • ఎయిడ్స్ వ్యాధికి కారణమవుతున్నది HIV వైరస్ అనే విషయాన్ని తొలిసారిగా 1982లో ఫ్రెంచ్ వైరాలజిస్ట్ (వైరాలజి అనేది వైరస్ అధ్యయన శాస్త్రం) డాక్టర్  ల్యూక్ మాంటెగ్నియర్ (Luc montagnier) నేతృత్వంలోని వైద్యుల బృందం గుర్తించ్చారు.
  • ఈ పరిశోధనకు గుర్తింపుగా ల్యూక్ మాంటెగ్నియర్ కు 2008లో నోబెల్ బహుమతి వచ్చింది.

మొదట AIDS వ్యాధిని కనుగొన్నది:
  • ప్రపంచలో మొదట ఎయిడ్స్ వ్యాదిని అమెరికాలో 1981 జూన్ 18 న నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించారు.
  • భారతదేశంలో తొలిసారిగా 1986 మే నెలలో డాక్టర్ సునీతి సాల్మాన్ అనే వైద్యురాలు చెన్నైలో ఒక సెక్స్ వర్కర్కు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. 

AIDS పై భారత ప్రభుత్వపు చర్య:
  • శరవేగంగా HIV వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO - National Aids Control Organization)ను ఏర్పాటు చేసింది.
  • NACO ద్వార ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం సాగింది. HIV వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దశల్లో రకరకాల కార్యక్రమాలను చేపట్టింది.

    జాతీయ AIDS పరిశోధనా సంస్థ (NARI - National AIDS Research Institute):

    • దీని కేంద్ర కార్యాలయం పూణేలో ఉంది. 
    • ఇది అక్టోబర్ 1992 న స్థాపించబడింది. 
    • కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ దీనిని పర్యవేక్షిస్తుంది. 
    • HIV-AIDS వ్యాదికి సంబంధించి పరిశోధనలు చేసే సంస్థ.

    వీటిని కూడా చూడండీ: