HIV - AIDS గురించి పూర్తి సమాచారం | Complete History of HIV AIDS in Telugu |
HIV - AIDS
HIV అంటే?
HIVఅనేది ఒక వైరస్.
H = Human - మానవునిI = Immuno deficiency - వ్యాది నిరోధకతకు
లోపమును కలిగించు
V = Virus - వైరస్.
- ఈ వైరస్ స్వతహాగా కొత్త వైరస్లను సృష్టించలేదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పూర్తిగా నశింప జేస్తుంది. తనంతట తాను ప్రత్యుత్పత్తి చేసుకోలేదు. కానీ మానవ శరీర కణాలలో ఆశ్రయమేర్పరుచుకొని, ఆ జీవకణ యంత్రాంగం సహాయంతో ప్రత్యుత్పత్తి చేస్తుంది.
- HIV వైరస్ 120 నానోమీటర్ ( 10^-9మీ ) పరిమాణంలో కనిపించే సూక్ష్మజీవి.
- HIV రెట్రో విరిడే కుటుంబంలో లెంటి వైరస్ తరగతికి చెందిన RAN (Ribo Nucleic Acid) వైరస్.
- ఇది ఐకోసా హెడ్రల్ ఆకారంలో ఉండును. ఇది 'లిపిడ్ల' పొరచే ఆవృత్తమై ఉండును. లోపల ప్రోటీన్ల సమూహం, వైరస్ పెరుగుదలకు ప్రత్యుత్పత్తికి అవసరమైన రెండు జతల RNA, వైరల్ ఎంజైము రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్, ఇంటిగ్రేస్, ప్రోటీయేస్ లను కలిగి ఉంటుంది.
- రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ అనే ఎంజైం కారణంగా ఇది ఆకారాను మారుస్తూ ఉంటుంది. ఇది స్థిరంగా లేని కారణంగా మందులకు లొంగడం లేదని శాస్త్రవేత్తల భావన.
HIV వైరస్ |
AIDS అంటే?
- HIV అనే వైరస్ లవల్ల సంక్రమించే వ్యాధిని AIDS అంటారు. HIV సోకిన 8-10 సంవత్సరాల తరువాత AIDS వ్యాధి వస్తుంది.
లేకున్నా ఇతరుల నుండి సోకుటచే
పొందబడిన ఇన్ఫెక్షన్)
I = Immune - మానవ శరీరంలోని సహజమైన
వ్యాధి నిరోధక శక్తి
D = Deficiency - లోపించడం వలన వచ్చే
S = Syndrome - అనేక రోగాలు మరియు
అవకాశవాద అంటువ్యాధుల సమూహం
ఒకేసారి కలగడం.
ప్రపంచ AIDS దినోత్సవం:
- ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న ప్రపంచ ఎయిడ్స్ దినంగా పాటించడం జరుగుతుంది.
AIDS యొక్క చరిత్ర:
- శాస్త్రవేత్తల అంచనా ప్రకారం HIV వైరస్ సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915 - 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు.
- అప్పట్లో ఆఫ్రికాలోని గ్రీన్ చింపాజీ లకు SIV (Simian Immuno deficiency Virus) అనే వైరస్ సోకుతూ ఉండేది. ఇది HIV గా రూపాంతరం చెంది మనుషులకు సోకడం ప్రారంభించింది అని చెబుతారు.
HIV వైరస్ ను కనుగొన్నది:
- ఎయిడ్స్ వ్యాధికి కారణమవుతున్నది HIV వైరస్ అనే విషయాన్ని తొలిసారిగా 1982లో ఫ్రెంచ్ వైరాలజిస్ట్ (వైరాలజి అనేది వైరస్ అధ్యయన శాస్త్రం) డాక్టర్ ల్యూక్ మాంటెగ్నియర్ (Luc montagnier) నేతృత్వంలోని వైద్యుల బృందం గుర్తించ్చారు.
- ఈ పరిశోధనకు గుర్తింపుగా ల్యూక్ మాంటెగ్నియర్ కు 2008లో నోబెల్ బహుమతి వచ్చింది.
మొదట ఎయిడ్స్ వ్యాదిని కనుగొన్నది:
- ప్రపంచలో మొదట ఎయిడ్స్ వ్యాదిని అమెరికాలో 1981 జూన్ 18 న నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించారు.
- భారతదేశంలో తొలిసారిగా 1986 మే నెలలో డాక్టర్ సునీతి సాల్మాన్ అనే వైద్యురాలు చెన్నైలో ఒక సెక్స్ వర్కర్కు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు.
AIDS పై భారత ప్రభుత్వపు చర్య:
- శరవేగంగా HIV వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO - National Aids Control Organization)ను ఏర్పాటు చేసింది.
- NACO ద్వార ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం సాగింది. HIV వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దశల్లో రకరకాల కార్యక్రమాలను చేపట్టింది.
- దీని కేంద్ర కార్యాలయం పూణేలో ఉంది.
- ఇది అక్టోబర్ 1992 న స్థాపించబడింది.
- కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ దీనిని పర్యవేక్షిస్తుంది.
- HIV-AIDS వ్యాదికి సంబంధించి పరిశోధనలు చేసే సంస్థ.
AIDS Day Themes:
- 2020: Global solidarity, resilient HIV services
- 2019: Communities make the difference
- 2018: Know your status (మీ స్థితిని తెలుసుకోండి)
- 2017: My Health, My Right (నా ఆరోగ్యం, నా హక్కు)
గణాంకాలు:
- 1984 నుండి 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్లకు పైగా ప్రజలు HIV/AIDSతో మరణించారు. ఇది చరిత్రలో అత్యంత వినాశకరమైన మహమ్మారిలో ఒకటిగా నిలిచింది.
- ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి 38 మిలియన్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారు.
- 2018 లో ప్రపంచంలో సుమారు 7.7 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణించారు.
- 2019 లో 690000 మంది HIV సంబంధిత కారణాలతో మరణించారు మరియు 1.7 మిలియన్ల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డారు.
- కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కల ప్రకారం 2019 నాటికి దేశంలో ఎయిడ్స్ రోగుల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచాయి.
- 2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారు.
AIDS కు చికిత్స:
- HIV వైరస్ ను కట్టడి చేయగల యాంటీ రిట్రోవైరల్ (ART - Anti Retroviral Therapy) ఔషదాలు మొట్టమొదటి సారిగా 1987లో అందుబాటులోకి వచ్చాయి.
- ఈ ఔషదాల వలన AIDS ను సమూలంగా నిర్మూలించలేము. కానీ జీవిత కాలాన్ని పొడగించుకోవచ్చు(దాదాపు 15 సంవత్సరాల వరకు).
HIV పరీక్షలు:
- సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (సుమారు 3 - 6 నెలలు) వరకు రక్త పరీక్షల ద్వార వైరస్ జాడా కనుగొనలేము. దీనినే Window Period అంటారు.
- HIV ఉనికిని కేవలం రక్త పరీక్షలవల్ల మాత్రమే తెలుసుకోవచ్చు.
- HIV పరీక్షలు మూడు అవి:
Sorbent Assay) టెస్ట్ లో ఇది మొదటిది.
ELISA ను ఎంగ్వల్ & ప్లర్ మన్ లు 1970 లో
కనుగొన్నారు.
- మనిషి శరీరంలో ప్రవేశించిన HIV క్రిములకు ప్రతిస్పందన కణాలు(Antibodies)
తయారవడానికి 3 - 6 నెలలు పడుతుంది.
- ప్రతిస్పందన కణాలు ఏర్పడిన తర్వాత ఈ పరీక్ష ద్వార ఎయిడ్స్ ను గుర్తించవచ్చు.
- HIV ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది. ఈ టెస్ట్ తేలిక తొందరగా అయిపోయింది. ఇది
పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు.
2) వెస్ట్రన్ బ్లాట్: HIV నిర్ధారణ కోసం
ఉపయోగించే పరీక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం
రోజులు పడుతుంది.
3) CD4 కణాల సంఖ్య:
- మనుషుల రోగ నిరోధకతకు రక్తంలో CD4 అనే
తెల్ల రక్తకణాలు ఎంతో దోహదం పడతాయి.
ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
- అయితే HIV ఈ CD4 కణాలను చంపేస్తుంది. - HIV పెరుగుతున్న కొద్ది ఈ CD4 కణాలు
నశించడం ప్రారంభిస్తాయి. ఒక మైక్రో లీటరుకు
200 కన్నా తక్కువ CD4 కణాలు ఉన్నట్లయితే
అప్పుడు AIDS ఉన్నట్లు ద్రువపరుస్తారు.
AIDS వ్యాధి లక్షణాలు:
HIV సోకిన తరువాత వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే దశలు:
1) HIV సోకిన దశ:
- HIV సోకిన తరువాత 2 - 6 వారాలలో వ్యక్తిలో
కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూజ్వరం వంటి
లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొద్ది వారాల్లోనే
ఈ లక్షణాలు వాటంతట అవే మాయమైపోతాయి.
- వ్యక్తి రక్తంలో వైరస్ ల సంఖ్య ఎక్కువగా
ఉంటుంది. కాని ప్రతిరక్షకాలు కనిపించవు
(ప్రతిరక్షకాలు అంటే- శరీరంలో పరిసరాల నుండి సంక్రమించిన సూక్ష్మ జీవులను ఎదురించే
వ్యవస్థ).
- ఈ దశలో వైరస్ లు వీరినుండి ఇతరులకు
సంక్రమిస్తాయి. కానీ రక్త పరీక్షలలో ప్రతిరక్షకాల
ఉనికి తెలియదు.
2) వ్యాధి చిహ్నాలు కనిపించని HIV దశ:
- ఈ దశలో రక్త పరీక్షలలో HIV ప్రతిరక్షకాల
ఉనికి తెలుస్తుంది.
- రక్త పరీక్షలలో ఈ HIV ప్రతిరక్షకాల ఉనికి
కనిపిస్తే ఆ వ్యక్తిని HIV + (HIV possitive)గా
గుర్తిస్తారు. కానీ వ్యాధి చిహ్నలు కనిపించవు.
- ఈ దశ సుమారు 3 - 5 సంవత్సరాలు
ఉంటుంది.
3) వ్యాధి చిహ్నలు కనిపించే HIV దశ:
- ఈ దశలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా
క్షీణించడంవల్ల వ్యక్తికి దీర్ఘకాలిక జ్వరము, నీళ్ళ
విరేచనాలు మరియు చర్మ వ్యాధులు
సోకుతాయి.
- ఈ దశ సుమారు 2 - 3 సంవత్సరాలు ఉంటుంది.
4) AIDS దశ:
- HIV సోకిన వ్యక్తి దాదాపు 8 - 10 సంవత్సరాల
తరువాత AIDS దశకు చేరుకుంటాడు.
- రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడంవల్ల శరీరం
రోగాలను ఎదిరించే శక్తిని చాలావరకూ
కోల్పోతాడు.
- TB (Tuberculosis - క్షయ), విడువని దగ్గు,
జ్వరం, నెలవరకు నీళ్ళ విరేచనాలు, చర్మంపై
పొక్కులు, నోటి పుండ్లు, లింఫ్ గ్రంథులు వాచుట మొదలగు అవకాశవాద అంటు రోగాలకు
తోడుగా శరీరం బరువు 10 % వరకు
కోల్పోవడం జరుగుతుంది.
HIV మానవ శరీరంలో ఎక్కడ నివసిస్తుంది?
- HIV మానవ శరీరంలోని శరీర ద్రవాలలో, స్రావాలలో ముఖ్యంగా (1) రక్తం (2) వీర్యం (3) యోని ద్రవాలు (4) తల్లి పాలలో మాత్రమే జీవించగలుగుతుంది. HIV వ్యాప్తి వీటి ద్వారా జరుగుతుంది.
- కానీ ఇతర ద్రవాలు, స్రావాలు అయిన (1) లాలాజలం (2) కన్నీరు (3) స్వేదము (4) మలమూత్రాలలో HIV సాంధ్రత చాలా తక్కువగా ఉండును. కావును HIV వ్యాప్తి వీటి ద్వారా జరగదు.
- మానవ శరీరం బయట ఇది కేవలం 15 - 30 సెకనుల కాలం మాత్రమే జీవించగలుగుతుంది.
HIV వ్యాప్తి ఎలా జరుగుతుంది?
- కండోమ్స్ వంటి రక్షణ సాధనాలేవి లేకుండా అపరిచితులతో లేదా సెక్స్ వర్కర్లతో సెక్స్ లో పాల్గొనడం.
- స్త్రీ పురుష లైంగిక సంబంధాలు లేదా పురుషుల స్వలింగ సంపర్కం ద్వారా.
- స్టెరిలైజ్ చేయని సూదుల వలన.
- ఎలాంటి పరీక్షలు జరపకుండా HIV సోకిన రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వలన.
- HIV సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు, అలానె తల్లిపాల ద్వారా కూడా పిల్లలకు HIV సోకే ప్రమాదం ఉంది.
- సిఫిలిస్, గనేరియా వంటి ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారికి HIV త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
HIV వ్యాప్తి ఎలా జరగదంటే...
- కలిసి భోజనం చేయడం వలన, ముట్టుకోవడం కౌగిలించుకోవడం వలన, బుగ్గలపై ముద్దు పెట్టుకోవడం వలన, మలమూత్రా శాలలను ఒకరి తరువాత మరొకరు వాడుకోవడం వలన, కరచాలం వలన, HIV గలవారి వస్తువులను దుస్తువులను వాడుకోవడం వలన, HIV వ్యాధి గ్రస్తులకు సేవ చేయడం వలన, HIV సోకిన వారికి కుట్టిన దోమలు వేరొకరికి కుట్టడం వలన HIV వ్యాపించదు.
వీటిని కూడా చూడండీ:
- ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం (World AIDS Vaccine Day)
- వ్యాక్సిన్ అంటే ఏమిటి? వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయి? (www.bbc.com)
- వ్యాధులు(Diseases)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)