History of Universal Health Coverage Day in Telugu | విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం |
విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం - డిసెంబర్ 12
లక్ష్యం:
- ప్రజలు ఆర్థిక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అవసరమైన ఆరోగ్య సేవలను పొందేలా చూడటం విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం (Universal Health Coverage Day) ముఖ్య లక్ష్యం.
ఎప్పటి నుంచి?
- 2017 నుంచి ప్రతీ సంవత్సరం డిసెంబర్ 12 న విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
డిసెంబర్ 12 నే ఎందుకు?
- ప్రతి వ్యక్తికి, ప్రతిచోటా, సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలని దేశాలను కోరడం ద్వారా ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని 2012 డిసెంబర్ 12 న ఆమోదించింది.
- అందువల్ల ప్రతీ సంవత్సరం డిసెంబర్ 12 న WHO ఆద్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ను జరుపుకుంటారు.
థీమ్ (Theme):
- 2020: Health For All: Protect Everyone
- 2019: Keep The Promise
Logo:
విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం (Universal Health Coverage Day) Logo |
Universal Health Coverage అంటే?:
- ప్రజలందరికీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా, వారికి అవసరమైన ఆరోగ్య సేవలు, ఎప్పుడు, ఎక్కడ అవసరమో వారికి అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య ప్రమోషన్ నుండి నివారణ, చికిత్స, పునరావాసం మరియు ఉపశమన సంరక్షణ వరకు పూర్తి స్థాయి అవసరమైన ఆరోగ్య సేవలు ఇందులో ఉన్నాయి.
మరికొన్ని అంశాలు:
- ప్రస్తుతం, ప్రపంచంలో కనీసం సగం మందికి అవసరమైన ఆరోగ్య సేవలు అందడం లేదు. ఆరోగ్యం కోసం చేసే ఖర్చు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడతారు.
- 930 మిలియన్లకు పైగా ప్రజలు (ప్రపంచ జనాభాలో సుమారు 12%) ఆరోగ్య సంరక్షణ కోసం వారి ఇంటి బడ్జెట్లలో కనీసం 10% ఖర్చు చేస్తారు.
- సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 2030 నాటికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) సాధించడానికి అన్ని యుఎన్ సభ్య దేశాలు అంగీకరించాయి.
వీటిని కూడా చూడండీ: