History of World AIDS Vaccine Day in Telugu | ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం |
ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్
దినోత్సవం - మే 18
ఉద్దేశ్యం:
AIDS వ్యాధికి వాడే ART ఔషదాల వలన AIDS ను సమూలంగా నిర్మూలించలేము. కానీ జీవిత కాలాన్ని పొడగించుకోవచ్చు. దీనిని వ్యాక్సిన్ మాత్రమే సమూలంగా నిర్మూలించగలదు. ఇటువంటి వ్యాక్సిన్ లను తయారుచేయడానికి సైంటిస్ట్ లను ప్రోత్సాహించడం మరియు వ్యాక్సిన్ల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం (World AIDS Vaccine Day/ HIV Vaccine Awareness Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1998 నుంచి ప్రతి సంవత్సరం మే 18 వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
మే 18 నే ఎందుకు?
1997 మే 18 న మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీ (Morgan State University) లో అప్పటి అమేరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రసంగిస్తూ, తన ప్రసంగంలో HIV నుండి రక్షించడానికి ఒక సరికొత్త సురక్షితమైన వ్యాక్సిన్ని కనుగొనటం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీపై దృష్టిసారించాలంటూ సైంటిస్ట్ లకు పిలుపునిచ్చారు.
క్లింటన్ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం మే 18 వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
టీకాలు (Vaccines):
- వ్యాక్సిన్ (Vaccine) ను తెలుగులో టీకా అంటారు.
- బలహీనపడ్డ లేదా మృత వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడతారు. చాలా సందర్భాల్లో ఇంజెక్షన్ ద్వారా ఈ పనిచేస్తారు. శరీరంలోని తెల్లరక్తకణాలు ప్రేరేపితమై, వ్యాధిపై పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. సదరు వ్యక్తికి తర్వాత వ్యాధి వస్తే, సంబంధిత కణాలను ఈ యాంటీబాడీలు నిర్వీర్యం చేస్తాయి.
- వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థం.
- ప్రపంచంలో తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్ - Smallpox Vaccine. మశూచి వ్యాధికి ఎడ్వర్డ్ జెన్నర్ దీన్ని 1796 లో కనుగొన్నాడు. ఇతన్ని వ్యాక్సిన్ పితామహుడు మరియు ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని పిలుస్తారు.
- చంపిన లేదా బలహీనపర్చిన వ్యాధి కారక సూక్ష్మజీవులను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు.
వీటిని కూడా చూడండీ:
- ఎయిడ్స్ డే (AIDS Day)
- వ్యాక్సిన్ అంటే ఏమిటి? వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయి? (www.bbc.com)
- వ్యాధులు(Diseases)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)