Tuesday, March 31, 2020

History of Public Radio Broadcasting Day in Telugu | పబ్లిక్ రేడియో ప్రసార దినోత్సవం - జనవరి 13

History of Public Radio Broadcasting Day in Telugu | పబ్లిక్ రేడియో ప్రసార దినోత్సవం
History of Public Radio Broadcasting Day in Telugu |
పబ్లిక్ రేడియో ప్రసార దినోత్సవం - జనవరి 13

పబ్లిక్ రేడియో ప్రసార దినోత్సవం
జనవరి 13

ఉద్దేశ్యం:
  • ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ రేడియో ప్రసారాన్ని న్యూయార్క్ నగరంలో ప్రసారం చేసిన రోజును గుర్తుచేసుకోవడం మరియు ఒకప్పటి రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయండం.

చరిత్ర: 
  • న్యూయార్క్ నగరంలో ఉన్న మెట్రోపాలిటన్ ఒపెరా హౌస్‌ (Metropolitan Opera House) లో జరిగిన ప్రదర్శనను 1910 జనవరి 13లీ డి ఫారెస్ట్ (Lee de Forest) రేడియో టెలిఫోన్ కంపెనీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ రేడియో ప్రసారం (Public Radio Broadcasting).
  • ఈ ప్రసారంలో ఎన్రికో కరుసో (Enrico Caruso) మరియు ఇతర మెట్రోపాలిటన్ ఒపెరా తారల స్వరాలు ఉన్నాయి. సంగీతాన్ని ఈ విధంగా ప్రసారం చేయవచ్చు మరియు కచేరీ హాళ్ళ వెలుపల వినవచ్చు అనే ఆలోచన ఆ సమయంలో ప్రజలకు పూర్తిగా కొత్తది. దురదృష్టవశాత్తు మైక్రోఫోన్లు బలంగా లేనందున మొదటి ప్రసారం పూర్తిగా విజయవంతం కాలేదు మరియు వేదిక నుండి వచ్చే గానం చాలా వరకు శ్రోతలకు సరిగ్గా వినిపించలేదు. కాని ఈ ప్రయోగం భవిష్యత్ పబ్లిక్ రేడియో ప్రసారాలకు మార్గం సుగమం చేసింది అని చెప్పవచ్చు. 
  • లీ డి ఫారెస్ట్ (1873 August 26 –1961 June 30) ఒక అమెరికన్ ఆవిష్కర్త. ఇతను 180 పైగా పేటెంట్ల హక్కులను కలిగి ఉన్నాడు. 

వీటిని కూడా చూడండీ:

No comments:

Post a Comment