History of National Girl Child Day in Telugu | జాతీయ బాలికా దినోత్సవం - జనవరి 24 |
National Girl Child Day
జాతీయ బాలికా దినోత్సవం - జనవరి 24
లక్ష్యం:
- తమకు దఖలుపడిన హక్కుల గురించి బాలికలకు అవగాహన కల్పించడం, అందరితో సమానంగా బాలికలకూ అవకాశాలు కల్పించడం, లైంగిక ప్రాతిపదికతో కూడిన వివక్షలను తొలగించడం జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day) లక్ష్యాలు.
- సమాజంలో బాలికలు ఎదుర్కొనే అసమానతలను గురించి అవగాహన కల్పించడం, బాలికల విద్య ప్రాధాన్యతను ప్రజలకు తెలియజెప్పడం. ప్రతి ఒక్కరిలాగే బాలికలకూ విలువ ఇచ్చి, గౌరవించడం, వారిపట్ల నెలకొన్న వివక్షను తగ్గించడం కూడా ఈ కార్యక్రమ ధ్యేయం. బాలికలపై సమాజ దృక్పథాన్ని, ఆలోచనా ధోరణులను మార్చడం, బాలికా శిశువుల భ్రూణహత్యలను నియంత్రించడం, జనాభాలో బాలికల నిష్పత్తి తగ్గిపోకుండా చూడటం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు.
ఎప్పటి నుంచి?
- 2008 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 24 వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
- ఈ దినోత్సవాన్ని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
జనవరి 24 నే ఎందుకు?
- ఇందిరా గాంధీ మొదటిసారి ప్రధానమంత్రిగా 1966 జనవరి 24 న ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 24 వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
థీమ్ (Theme):
- 2019: Empowering Girls for a Brighter Tomorrow
- 2020: My voice, Our Common Future
- 2021: Digital Generation, Our Generation
- (2022 & 2023: ప్రభుత్వం ఎలాంటి థీమ్‌ను ప్రకటించలేదు)
చిన్నారులపై లైంగిక దాడులు:
- దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 2018 సంవత్సరానికి గానూ జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB- National Crime Records Bureau) ఇటీవల విడుదల చేసిన గణాంకాలతో ఈ విషయం వెల్లడైంది. 2017 లో పిల్లలపై లైంగిక దాడి ఘటనలకు సంబంధించి పోక్సో చట్టం (Pocso- Protection of Children from Sexual Offences Act- 2012) కింద 32,608 కేసులు నమోదు కాగా, 2018 లో 39,827 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2018 లో 21,605 మంది పిల్లలపై లైంగిక దాడి జరిగింది. వీరిలో 21,401 మంది బాలికలు, 204 మంది బాలురు ఉన్నారు.
భారత శిక్షాస్మృతి (IPC- Indian Penal Code):
- సెక్షన్-315: బ్రూణ, శిశు హత్యలు నిషేధం
- సెక్షన్-363(ఎ): పిల్లలను కిడ్నాప్ చేయడం, పిల్లలతో భిక్షాటన చేయించడం నేరం
- సెక్షన్-366(ఎ): మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం నేరం
- సెక్షన్-372: మైనర్ బాలికలను వేశ్యావృత్తికోసం అమ్మడం, కిరాయికి ఇవ్వడం నేరం
- సెక్షన్-373: మైనర్ బాలికలను వేశ్యావృత్తి కోసం కొనడం, అద్దెకు తీసుకోవడం నేరం
- సెక్షన్-376: మైనర్ బాలికపై భర్త లైంగికంగా హింసకు పాల్పడటం నేరం
భారత రాజ్యాంగంలో:
- ఆర్టికల్-24: పద్నాలుగేళ్ల పిల్లలను కర్మాగారాల్లో కానీ, గనుల్లో కానీ, ఏ ఇతర అపాయకరమైన వృత్తుల్లో పని చేయించకూడదు (బాల కార్మికుల వ్యవస్థ నిషేధం)
- ఆర్టికల్-45: బాలలకు ఉచిత నిర్బంధ విద్య
పథకాలు (Schemes):
- సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం - 1975 (ICDS- Integrated Child Development Scheme- 1975)
- జననీ సురక్ష యోజన- 2005
- బాలికల సంరక్షణ పథకం (ధనలక్ష్మి పథకం)- 2008 మార్చి 8
- రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్య కార్యక్రమం - 2014
- ఉజ్వల పథకం- 2007
- సాథియా రిసోర్స్ కిట్ & సాథియా సలహా యాప్
- సుకన్య సమృద్ధి ఖాతా
- బేటీ బచావో బేటి పడావో
1) లింగ నిర్ధారణ నిషేధ చట్టం - 1994:
- గర్భస్థ దశలో ఆడ శిశువుల హత్యలను నివారించేందుకుగాను ఈ చట్టాన్ని రూపొందించారు.
- తల్లికి లేదా బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం ఉందని, లేదా జన్యు సంబంధిత వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని డాక్టర్లు అధికారికంగా గుర్తించిన సందర్భంలోనే గర్భ స్రావానికి అనుమతి ఉంటుంది. మిగతా ఏ కారణంతో అయిన గర్భస్రావం చేయడం చట్టరీత్యా నేరం. స్కానింగ్ సెంటర్లు లేదా డాక్టర్లు ఈ రకమైన చర్యలకు పాల్పడకుండా నిరోధించేందుకుగాను కలెక్టర్‌కు పూర్తి అధికారులు కల్పించింది.
2) బాలలన్యాయ (రక్షణ పరిరక్షణ) చట్టం - 2000:
- బాలబాలికలకు అన్ని రకాల రక్షణలు కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది.
- బాలల అవసరాలను బట్టి వారి పరిరక్షణకు వారితో స్నేహపూర్వక ధోరణితో మెలగాలి. అవసరమైన సేవలను అందించేందుకు ఈ చట్టం దోహదపడుతుంది. 2006 లో ఈ చట్టాన్ని సవరించారు.
- బాలల న్యాయ కార్యక్రమం అనే పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవసరం ఉన్న బాలలకు ఆశ్రయం కల్పించేందుకు పలు ఆశ్రమాలను ఈ చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు.
- ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు పూర్తిగా నిషేధం.
- ఈ చట్టం ప్రకారం వివాహ వయసు పురుషునికి 21, స్త్రీకి 18 సంవత్సరాలు.
- మైనర్ బాలికలను వివాహం చేసుకొంటే లక్ష రూపాయల జరిమానా లేదా రెండేండ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.
- బాల్య వివాహాన్ని ఎవరైనా ప్రోత్సాహించినా, కుదిర్చినా, చేయించిన తల్లిదండ్రులు, సంరక్షకులు చట్టరీత్యా శిక్షార్హులే.
- జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ చట్ట పరిధిలో కేసులను విచారించవచ్చు.
- బాల్య వివాహాన్ని ఎవరైనా జరిపిస్తున్నారని సమాచారం అందింతే వెంటనే ఆ వివాహాన్ని నిరోధిస్తూ నిషేధాజ్ఞ జారీచేసే అధికారం జిల్లా జడ్జికి ఉంది.
- రహస్యంగా జరిగిన బాల్య వివాహాన్ని ఈ చట్ట ప్రకారం రద్దు చేయవచ్చు.
- బాల్య వివాహ నిరోధక అధికారులను నియమించి వారి ద్వారా బాల్య వివాహాలను నిరోధిస్తుంది.
- మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుండి 21కి పెంచాలని బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు-2021 ను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ సవరణ బిల్లుకు ఇంకా పార్లమెంటు ఆమోదం పొందలేదు.
- మైనర్ బాలలపై జరిగే లైంగిక దాడులను అరికట్టేందుకు రూపొందించిన చట్టం ఇది.
- అసభ్య చిత్రీకరణ కోసం (పోర్నోగ్రఫీ) బాలలను ఉపయోగిస్తే ఈ చట్టం ప్రకారం ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి ఇదే నేరానికి పాల్పడితే ఏడేండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
- లైంగికంగా బాలలను వేధిస్తే ఐదేండ్లు తగ్గకుండా జైలు శిక్ష, నేర తీవ్రతను బట్టి ఈ శిక్షను ఏడేండ్ల వరకు కూడా పొడిగించవచ్చు.
- తీవ్ర లైంగిక దాడికి పాల్పడితే యావజ్జీవ శిక్ష వేస్తుంది.
- ఈ నేరాలను విచారించేందుకుగాను ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు.
- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ చట్టం అమలు తీరును పర్యపక్షిస్తుంది.
- బాధిత పిల్లలు లేదా వారి తరపున పెద్దలు ఎవరైనా National Commission for Protection of Child Rights వెబ్ సైట్ లో నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. నమోదు ఫిర్యాదులపై దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. బాలలు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతుంది.
- బాలికలపై ఎటువంటి అత్యాచారాలు జరిగినా, వేధింపులకు గురైనా 1098, 100 నెంబర్లకు సమాచారం అందిస్తే సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపడతారు.
వీటిని కూడా చూడండీ:
- అంతర్జాతీయ బాలికా దినోత్సవం (International Girl Child Day)
- బాలికల సంక్షేమ పథకాలు (Girl Child Schemes)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)