What About Karthika Masa Vanabhojanalu |
కార్తీక మాస
వన భోజనాలు
వన భోజనాలు
- కార్తీక మాసము తెలుగు నెలలో ఎనిమిదవ నెల (October to November). ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
- చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు.
- కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
- ఈ నెలలో ప్రత్యేకమైన విషయాలు:
- దీపము
- సూర్య నమస్కారము
- గోవులను పూజించడం
- తులసి ఆరాధన
- ఉసిరికాయ దానం
- సత్యనారాయణ వ్రతం
- వనభోజనాలు
- వనం అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అమరకోశం చెబుతుంది.
- జపానులో కూడా హనామి (హన - పువ్వు , మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుకను జరుపుకుంటారు.
కార్తీక మాస వనభోజనాల చరిత్ర:
- పూర్వం సూత మహర్షి ఆధ్వర్యంలో నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీకపురాణం చెబుతోంది.
- మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువుకు పూజించి, వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే తినడంవల్ల కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది.
- ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణు మూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట.
ఈ వన భోజనాలవల్ల ఉపయోగాలు:
- అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్లకింద రకరకాల వంటలు వండుకుని తినడం ఒక అనుభవం.
- భోజనాలకే పరిమితం కాకుండా, అందరూ కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా, ఆనందంగా గడిపేందుకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుంది.
కార్తీక మాసంలోనే ఎందుకంటే?
- కార్తీక మాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అలాంటి ఆరుబయలు ప్రదేశంలో అందరూ కలిసి అక్కడే వంటలు వండుకుని తినడం మరీ మంచిది. కుదరని పక్షంలో అందరి ఇళ్లనుంచి తెచ్చిన వంటకాలను ఒకరితో ఒకరు పంచుకుని తినడం కూడా స్నేహ పరిమళాలు ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది.