Sunday, July 23, 2023

Respiratory System in Telugu | శ్వాస వ్వవస్థ | Student Soula

Respiratory System in Telugu | శ్వాస వ్వవస్థ | Student Soula


  1. జీవులు సజీవంగా ఉండడానికి మూలకారణం అవి తీసుకునే ఆహారం ద్వారా అనేక జీవక్రీయలు నిర్వహించడం.
  2. జీవులు పొందిన పోషకాల నుండి శక్తిని ఉత్పన్నం చేయడంలో శ్వాసక్రియ (Respiration) ప్రధానపాత్ర పోషిస్తుంది.
  3. జీవి శరీరంలోని కణాలన్ని ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకొని జీవక్రియలన్నీ నిరంతరాయంగా జరిగేలా చూస్తాయి. దీని కోసం కణాలకు తగినంత గాలి, ఆహారం ఇతర రసాయనాలు అవసరమవుతాయి.

శ్వాసక్రియ (Respiration):

  1. శ్వాసక్రియ (Respiration) అనే పదం Respire అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. Respire అంటే పీల్చడం అని అర్థం.
  2. గాలిని లోపలికి పీల్చడాన్ని ఉఛ్చ్వాసం (Inhalation) అని, గాలిని బయటకు వదులుటను నిశ్వాసం (Exhalation) అని అంటారు.
  3. ఉఛ్చ్వాస, నిశ్వాసాలే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగింపబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి శ్వాసక్రియ (Respiration) అంటారు.
  4. శ్వాసక్రియ ఒక ఆక్సీకరణ క్రియ, విచ్ఛిన్న క్రియ, దహన క్రియ.
  5. శ్వాసక్రియ ఒక నిరంతర ప్రక్రియ.
  6. ఊపిరితిత్తులలోకి ప్రవేశించిన వాయువులను రక్తం గ్రహించి గుండె ద్వారా శరీరంలోని ప్రతి కణానికి సరఫరా చేయబడుతుంది.
    1. లోపలికి ప్రవేశించిన ఆక్సిజన్ ను రక్తంలోని హిమోగ్లోబిన్ గ్రహించి ఆక్సీహిమోగ్లోబిన్ గా మారును. 
    2. హిమోగ్లోబిన్ కి ఆక్సిజన్ కన్నా కార్బన్ మోనాక్సైడ్ (CO) ను గ్రహించే గుణం ఎక్కువ. దీనివల్ల కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడును. ఇది హానికరం. ఇది పొగతాగే వారి రక్తంలో ఎక్కువ ఉండును.
  7. ఆక్సిజన్ రక్తం నుండి కణజాలాలలోనికి మార్పిడి జరిగి, కణంలోని మైటోకాండ్రియా అనే నిర్మాణంలో ఆహార పదార్థాలను ఆక్సీకరణం చేసి విచ్ఛిత్తి చేయును. అనగా కణంలో, ఆహారం (గ్లూకోజ్) ఆక్సిజన్ ను ఉపయోగించుకుని కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమౌతుంది. అప్పుడు ATP రూపంలో శక్తి ఏర్పడును.
  8. కణంలో ఆహారం విచ్ఛిన్నమయి, శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ (Cellular Respiration) అంటారు. అన్ని జీవుల కణాలలోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది.
    1. శ్వాసక్రియ మొక్కలలో, జంతువులలో, బాక్టీరియాలో అనగా అన్ని రకాల సజీవులలో జరుగును. 
    2. కానీ వైరస్ లో జరగదు.
  9. ఈ విధంగా ఏర్పడిన శక్తి మైటోకాండ్రియాలో నిల్వ చేయబడడం వలన మైటోకాండ్రియాను కణ శక్తి భాండాగారాలు (Power House of the Cell), కణ కొలిమి (Cell Furnace) అంటారు.
    1. ATP (Adenosine Triphosphate) ని Cell Currency లేదా శక్తి అణువు అంటారు.
    2. ATP ని కనుగొన్నది: కార్ల్ లోహ్మన్, యల్లాప్రగడ సుబ్బారావు, ప్రిస్కీ.
  10. పురుషులలో శ్వాసక్రియకు తోడ్పడే నిర్మాణం: విభాజక పటలం
  11. స్త్రీలలో శ్వాసక్రియకు తోడ్పడే నిర్మాణం: ప్రక్కటెముకలు/ పర్శుకలు
  12. ఉఛ్చ్వాసించే, నిశ్వాసించే వాయువుల శాతం;
వాయువు ఉఛ్చ్వాసం నిశ్వాసం
ఆక్సిజన్ 21% 16.4%
కార్బన్ డయాక్సైడ్ 0.04% 4.4%
నైట్రోజన్ 78% 78%


జీవులలోని వివిధ శ్వాసక్రియ:


శ్వాసేంద్రియం శ్వాసక్రియ రకం జంతువులు
చర్మం చర్మ శ్వాసక్రియ వానపాము, జలగ, కప్ప
వాయునాళాలు వాయునాళ శ్వాసక్రియ కీటకాలు
మొప్పలు జల శ్వాసక్రియ చేపలు, రొయ్యలు, కప్ప
పుస్తకాకార మొప్పలు రాచపీత, నత్త, స్టార్ ఫిష్
పుస్తకాకార ఊపిరితిత్తులు పుపుస శ్వాసక్రియ తేలు, సాలీడు
ఊపిరితిత్తులు ఉభయచరాలు (కప్ప), సరీసృపాలు (పాములు), పక్షులు, క్షీరదాలు (మానవుడు, గబ్బిలం)
ప్లాస్మాత్వచం వ్యాపనం ప్రోటోజోవా వంటి నిమ్న జంతువులు


శ్వాసక్రియ రకాలు (Types of Respiration):

  1. శ్వాసక్రియలో 2 రకాలు కలవు;
    1. (1) వాయు శ్వాసక్రియ (Aerobic Respiration)
    2. (2) అవాయు శ్వాసక్రియ (Anaerobic Respiration)

(1) వాయు శ్వాసక్రియ:

  1. వాయు శ్వాసక్రియ (Aerobic Respiration) అన్ని జంతువులు, మొక్కలలో జరుగుతుంది.
  2. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగును.
  3. ఇది సమర్థవంతమైన ప్రక్రియ.
  4. దీనిలో అధిక శక్తి విడుదల అవుతుంది (686 Kcal).
  5. ఇది కణద్రవ్యం, మైటోకాండ్రియాలో జరుగును.
  6. ఇది నాలుగు దశలలో జరుగును;
    1. (a) గ్లైకాలిసిస్
    2. (b) పైరువేట్ యొక్క ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్
    3. (c) క్రెబ్స్ వలయం
    4. (d) ఎలక్ట్రాన్ల రవాణ
  7. దీనిలో అంత్య ఉత్పన్నాలుగా CO2, H2O ఏర్పడతాయి.
  8. ఇందులో ఏర్పడే మొత్తం ATP ల సంఖ్య: 38 (నికరంగా మిగిలేది 36)

(2) అవాయు శ్వాసక్రియ:

  1. అవాయు శ్వాసక్రియ (Anaerobic Respiration) సాధారణంగా బ్యాక్టీరియా, ఈస్ట్, పరాన్న జీవులు, అలసటకు గురైన కండరాల్లో జరుగుతుంది.
    1. శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యత లేనపుడు కండరాలు అవాయు పద్ధతిలో శ్వాసిస్తాయి. అందువలన కండరాలలో ఉన్న గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఇలా ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం కండరంలో పేరుకొనిపోయినపుడు కండరాలలో నొప్పి కలుగుతుంది. కొంత విశ్రాంతి తరువాత మనం సాధారణ స్థితికి వస్తాం.
  2. ఇది ఆక్సీజన్ లేనప్పుడు జరుగుతుంది.
  3. ఇది అంత సమర్థవంతమైన ప్రక్రియ కాదు.
  4. దీనిలో తక్కువ శక్తి విడుదల అవుతుంది (56 Kcal)
  5. ఇది కేవలం కణద్రవ్యంలో మాత్రమే జరుగును.
  6. ఇది రెండు దశలలో జరుగును;
    1. (a) గ్లైకాలిసిస్
    2. (b) కిణ్వనం 
  7. దీనిలో అంత్య ఉత్పన్నాలుగా కార్బన్ డయాక్సైడ్, ఇథైల్ ఆల్కహాల్/ అసిటిక్ ఆమ్లం/ లాక్టిక్ ఆమ్లం వంటి కర్బన పదార్థాలు ఏర్పడతాయి.
  8. ఇందులో ఏర్పడే మొత్తం ATP ల సంఖ్య: 4 (నికరంగా మిగిలేది 2)
  9. దీనిలో ప్రముఖపాత్ర పోషించే ఏకకణ శిలీంద్రం: ఈస్ట్
    1. ఈస్ట్ పారిశ్రామికంగా అతి ముఖ్యమైనది.
    2. ఈస్ట్ వల్ల లాభాలు: ఇడ్లీ, దోసె పిండి పులియడం. వైన్ వంటి ఆల్కహాల్ తయారీ. Cakes, Buns, Biscuits వంటి బేకరీ ఉత్పత్తుల తయారి.
    3. బ్రెడ్ మృదువుగా స్పాంజి మాదిరిగా ఉండి, పైన ఉండే రంధ్రాలకు కారణం అవాయు శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ బయటకు రావడం.
    4. బయోగ్యాస్ తయారిలో ఈస్ట్ తో పాటు కొన్ని రకాల బాక్టీరియాలు పాల్గొంటాయి.

మానవుని శ్వాస వ్వవస్థ:

(1) ముక్కు/ నాసికా (Nose):

  1. ఇది ఒక జత బాహ్య నాసికా రంద్రాల ద్వారా గాలిని లోపలికి పీల్చుకొనును.
  2. ఇది వాసనను గుర్తించే జ్ఞానేంద్రియం.
  3. ఇందలో వాసనను గుర్తించే ఘ్రాణ గ్రాహకాలు (Olfactory Receptors) ఉంటాయి.
    1. పాములలో ఘ్రాణేంద్రియం: జకబ్ సన్ నిర్మాణం
    2. ఈ ఘ్రాణ గ్రాహకాలు పాములలో, కుక్కలలో (40 రెట్లు), ఎలుకలలో ఎక్కువగా ఉంటాయి. కావున ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడంలో, కుక్కలు నేరస్తులను పట్టుకోవడంలో ఉపయోగపడతాయి.
  4. ముక్కు గురించి అధ్యయనం: రైనాలజి
  5. ముక్కుకు సంబంధించిన పరీక్షల కోసం వాడే పరికరం: రైనోస్కోప్/ నానోస్కోప్
  6. జలుబు కలిగించే వైరస్: రైనో వైరస్
  7. ముక్కుపైన ఉండే కెరాటిన్ సంచయనం చెంది కొమ్ముగా మారిన జీవి: రైనోసిరాస్ (ఖడ్గమృగం)
    1. ఖడ్గమృగాలు ఎక్కువగా సంరక్షించబడే నేషనల్ పార్కు: ఖజిరంగా (అస్సాం)

(2) గ్రసని (Pharynx):

  1. ఇది వాయు మార్గానికి, ఆహార మార్గానికి కూడలి.
  2. దీనిలో యూస్టేచియన్ నాళం తెరుచుకొనును.
  3. నాసికా మార్గాన్ని, ఆహార మార్గాన్ని వేరుచేసే అస్థిఫలకం: అంగిలి (Palate)

(3) వాయునాళం (Windpipe / Trachea):

  1. ఇది సన్నగా, పొడవుగా ఉండి ఉంగరాకారపు/ C ఆకారపు నిర్మాణాలను కలిగి ఉండును. వీటిని టినిడియా అంటారు. ఇవి వాయునాళాన్ని ముడుచుకుపోకుండా కాపాడుతాయి.

(4) స్వరపేటిక (Voice Box/ Larynx):

  1. ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేసే పెట్టెవంటి నిర్మాణం.
  2. శబ్ద ఉత్పత్తికి స్వర తంత్రులు (Vocal Cords) తోడ్పడును.
    1. స్వరపేటికలో ఉండే స్వరతంత్రులు ఊపిరితిత్తుల నుండి బయటికి వచ్చే గాలికి కంపిస్తాయి. తద్వారా మనం మాట్లాడడం, పాటలు పాడడం చేయగలుగుతున్నాం.
    2. ఇవి థైరాయిడ్, ఎరిటనాయిడ్, మృదులాస్థులను కలుపుతాయి.
    3. వీటి పొడవుపైన శబ్ద ఉత్పత్తి ఆధారపడును.
  3. స్వరపేటికపైన ఉండే కొండ నాలుక/ ఉప జిహ్విక (Epiglottis) ఆహారపు రేణువులను స్వరపేటికలోకి వెళ్ళకుండా నిరోదించును.
  4. పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం: శబ్దిని (Syrinx)

(5) శ్వాసనాళం (Bronchea):

  1. వాయునాళం (Windpipe / Trachea) ఛాతిలోకి ప్రయాణించి రెండు శ్వాసనాళాలుగా చీలి తలా ఒక ఊపిరితిత్తి లోపలికి వెళ్ళి, అక్కడ తిరిగి విభజింపబడి అనేక శ్వాసనాళికలను (Bronchiole) ఏర్పరుచును.

(6) ఊపిరితిత్తులు (Lungs):

  1. వీటి అధ్యయనం: పల్మోనాలజీ/ ప్లూరాలజీ
  2. ఇది ఛాతిలోని Thoracic Cavity లో అమరి ఉండును.
  3. ఒక్కొక్క ఊపిరితిత్తి బరువు: 950 గ్రాం
  4. మానవుల ఊపిరితిత్తుల సామార్థ్యం: 5.8 లీటర్స్
  5. కుడి ఊపిరితిత్తులలో 3, ఎడమ ఊపిరితిత్తులలో 2 లంబికలు కలవు (ఎడమ ఊపిరితిత్తి చిన్నది)
  6. వీటిని చుట్టుతూ ఉండే రెండు పొరలను ప్లూరా (Pleura) అంటారు. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను ఆఘాతాల నుండి కాపాడుతుంది.
  7. వీటి లోపల ఉండే అనేక గదులను వాయుగోణులు (Alveoli) అంటారు.
    1. ఊపిరితిత్తులలోని మొత్తం వాయుగోణుల సంఖ్య: 300-500 మిలియన్స్
    2. వీటిలోనే వాయు మార్పిడి (CO2, O2) జరుగును.
    3. వాయుకోశగోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు (ఒక టెన్నిస్ కోర్డు) వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.
  8. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో (Chest Cavity) ఉన్నాయి. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకలచే (Ribs) ఆవరించబడి ఉంటుంది. ఉదరవితానం (Diaphragm) అని పిలువబడే పెద్ద, కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. శ్వాసలో ఉదరవితానం మరియు పక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉంటాయి. ఉచ్ఛ్వాస సమయంలో, పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి, ఉదరవితానం క్రిందికి కదులుతుంది. ఈ కదలిక మన ఛాతి కుహరం యొక్క పరిమాణమును పెంచడం వలన గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి. నిశ్వాస సమయంలో, పక్కటెముకలు క్రిందికి మరియు లోపలికి కదులుతాయి, ఉదరవితానం పైకి కదిలి దాని పూర్వ స్థితికి చేరుతుంది. ఇది ఛాతి కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నెట్టివేయబడుతుంది.


శ్వాసక్రియలో వివిధ దశలు:

  1. ఉఛ్చ్వాస, నిశ్వాసాలు:
    1. ఊపిరితిత్తులలోనికి, బయటకు జరిగే వాయు సంచారం.
  2. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి:
    1. వాయుగోణులు, రక్తం మధ్య వాయుమార్పిడి జరుగుతుంది.
  3. రక్తం ద్వారా వాయు రవాణా:
    1. వాయుగోణుల గోడలలోని రక్త కేశనాళికలోని రక్తంలోకి ఆక్సిజన్, రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయుగోణిలోకి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది.
  4. కణజాలాల్లో వాయుమార్పిడి:
    1. ఆక్సిజన్ రక్తం నుండి కణజాలాలలోనికి, కార్బన్ డై ఆక్సైడ్ కణజాలాల నుండి రక్తంలోనికి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది.
  5. కణ శ్వాసక్రియ:
    1. కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ ను వినియోగించుకొని, గ్లూకోజ్ ను దహించి కార్బన్ డై ఆక్సైడ్, నీరు, శక్తిని (ATP) విడుదల చేస్తాయి. ఈ శక్తి జీవక్రియలకు వినియోగించుకోబడుతుంది.

శ్వాసక్రియ రేటు (Respiratory Rate):

  1. ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు (Respiratory Rate) అంటారు.
  2. దీనిని కొలిచే పరికరం: రెస్పిరోమీటర్
  3. ఒక నిమిషంలో తీసుకునే శ్వాస;
    1. చిన్న పిల్లలు (5-12 Years): 32 సార్లు
    2. ఆరోగ్యవంతులు: 15-18 సార్లు
    3. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు, నిమిషానికి శ్వాసక్రియా రేటు 25 సార్ల వరకు చేరుతుంది.

శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు:

  1. అస్తమా/ ఉబ్బసం:
    1. శ్వాసనాళికలు ముడుచుకోవడంవల్ల కలిగే శ్వాస ఇబ్బంది.
  2. బ్రాంఖైటిస్:
    1. శ్వాసనాళికలో వాపు ఏర్పడటం.
    2. ఇది ఎక్కువగా పత్తి, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి వచ్చును.
  3. న్యుమోనియా:
    1. ఉపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్.
  4. Hypoxia:
    1. రక్తం కణజాలాలకు తగినంత ఆక్సీజన్ ను తీసుకువెళ్ళలేకపోవడం.
  5. ఎంఫిసిమా:
    1. అధికంగా పొగత్రాగడంవల్ల వాయు కోశ గోడలు నశించి, వాయువుల వినిమయం జరిగే తలం తగ్గును.
  6. అప్నియా:
    1. నిద్రించు సమయంలో తాత్కాలికంగా శ్వాస ఆగిపోవడం.
  7. డిఫ్తీరియా: 
  8. ఫ్లూ:
  9. కోరింత దగ్గు:
  10. క్షయ (TB):
  11. SARS:
  12. కొవిడ్ (Covid):



1 comment: