Friday, February 9, 2024

Skeletal System in Telugu | అస్థిపంజర వ్యవస్థ | Student Soula

దయచేసి మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.... Contact: studentsoula@gmail.com

Skeletal System in Telugu | అస్థిపంజర వ్యవస్థ | Student Soula


  1. జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి, దృఢమైన ఆకారం మరియు రక్షణనిచ్చే నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు.
  2. ఇది జీవులలో రెండు రకాలు. అవి:
    1. (1) బాహ్య అస్థిపంజరం (Exoskeleton)
    2. (2) అంతర అస్థిపంజరం (Endoskeleton)
(1) బాహ్య అస్థిపంజరం:
  1. ఇది దృఢమైన, రక్షణనిచ్చే బయటి నిర్జీవ పొర.
  2. ఉదా: గోర్లు, కొమ్ములు, ఈకలు, చేపల పొలుసులు మొదలైనవి.
  3. మొలస్కా జీవుల బాహ్య అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది.
(2) అంతర అస్థిపంజరం:
  1. ఇది శరీరం లోపల ఉండి శరీరానికి నిర్ధిష్ట ఆకారాన్ని మరియు యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది.
  2. దీనిలో రెండు రకాల ఎముకలు కలవు. అవి:
    1. (i) మృదులాస్థి (Cartilage)
    2. (ii) అస్థి (Bone)
(i) మృదులాస్థి (Cartilage):
  1. ఇవి మెత్తగా, మృదువుగా ఉంటాయి.
  2. వీటి అధ్యయనం: కాండ్రాలజీ
  3. వీటిలో ఉండే ప్రోటీన్: కాండ్రిన్
    1. దీనిలో ఉండే కణాలు: కాండ్రోసైట్స్
    2. ఇవి కొల్లాజన్ అనే సాగే గుణం కలిగి ఉన్న ప్రోటీన్ ను కలిగి చలనానికి సహాయపడును.
    3. కొల్లాజన్ మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్.
  4. ఉదా: వెలుపలి చెవి, ముక్కు కొన, కొండ నాలుక, సొరచేపలోని అస్థిపంజరం మొదలైనవి.
(ii) అస్థి (Bone):
  1. గట్టిగా, దృఢంగా ఉండే ఎముక.
  2. ఇవి దృఢంగా ఉండడానికి కారణం: కాల్షియం, ఫాస్పరస్
    1. ఫాస్పరస్ కు మండే స్వభావంవల్ల శవాలను కాల్చినపుడు కాంతివంతంగా మండును.
  3. వీటి అధ్యయనం: ఆస్టియాలజీ (Osteology)
  4. వీటిలో ఉండే కణాలు: ఆస్టియోసైట్స్
  5. ఎముకలలో ఉండే ప్రోటీన్: ఆస్టీన్
  6. ఎముకల సంఖ్య:
    1. మొత్తం: 206
    2. పుట్టినపుడు చిన్నపిల్లల్లో: 300
    3. తల: 29 (కపాలం: 8, ముఖం: 14, చెవి: 6, నాలుక క్రింద: 1)
    4. చెతులు: 30+30 = 60
    5. కాళ్ళు: 30+30 = 60
    6. వెన్నెముక: 26 (చిన్నపిల్లల్లో: 33)
    7. ప్రక్కటెముకలు: 12+12 = 24
    8. రొమ్ము ఎముక: 1
    9. చరక సంహిత ప్రకారం మానవ శరీరంలోని ఎముకల సంఖ్య (దంతాలతో సహా): 360
  7. ఎముకల వ్యాధులు:
    1. అర్ధరెటీస్: ఇది సాధారణ కీళ్ళనొప్పి
    2. రికెట్స్: చిన్నపిల్లల్లో ఎముకలు వంగడం
    3. ఆస్టియో మలేషియా: పెద్దవారిలో ఎముకలు మెత్తగా మారడం
    4. ఆస్టియో సార్కోమా: ఎముకలకు వచ్చే క్యాన్సర్
    5. ఫ్లోరోసిస్: దంతాలు పసుపు రంగులోకి, ఎముకలు వికృత రూపాలలోకి మారడం
      1. ప్రతీ వ్యక్తికి కావలసిన ఫ్లోరిన్ పరిమాణం: 1 Mg/లీటర్
      2. నీటిలో ఉండవలసిన సాధారణ ఫ్లోరిన్ పరిమాణం: 0.7 Mg - 1.2 mg/లీటర్ 
  8. ప్రాముఖ్యతగల ఎముకలు:
    1. అతిపెద్ద, అతి పొడవైన, గట్టి ఎముక:  ఫీమర్/ తొడ ఎముక
    2. అతిచిన్న ఎముక: స్టెపిస్/ కర్ణాంతరాస్థి
    3. పుర్రెలో అతి గట్టిది: క్రింది దవడ (Mandible)
  9. ఇతర అంశాలు:
    1. పాక్షికంగా కదిలే ఎముకలు కంటి వలయంలో ఉంటాయి.
    2. కదిలే ఎముకల మధ్యలో ఉండి కందెనల పనిచేసే ద్రవం: సైనోవియల్ ద్రవం
    3. మానవుని నాలుక కింద ఉండే ఎముక: హయడ్
    4. చెవిలో ఉండే ఎముకలు: మాలస్, ఇంకస్, స్టేప్స్
    5. అస్థిమజ్జలోని ఎరిత్రోపాటియన్ అనే ప్రోటీన్ వల్ల RBC ఉత్పత్తి జరుగును
      1. ఈ ఎరిత్రోపాటియన్ ను స్రవించేది: మూత్రపిండం
    6. అస్థిపంజర వ్యవస్థలో భాగం అయిన ఎముకలు లేని శరీర భాగం: పళ్ళు
    7. మానవుని వయస్సు నిర్ధారణకు ఉపయోగపడే పరీక్ష: Bone Ossification Test
    8. ఎముకలోని ఎపిఫైసియల్ ఫలకం పొడవు పెరగడానికి తోడ్పడును.
    9. ఎముకను, ఎముకతో కలిపేది: సంధి బంధనాలు (లిగమెంట్స్)
    10. ఎముకను, కండరంతో కలిపేది: స్నాయు బంధనాలు (టెండాన్)
కీళ్ళు (Joints):
  1. రెండు లేదా ఎక్కువ ఎముకలు లిగమెంట్ అనే పట్టీల సహాయంతో అతికే ప్రదేశాన్ని కీలు (Joint) అంటారు.
  2. కీళ్ళు (Joints) అధ్యయనం: ఆర్థ్రాలజీ
  3. మానవ శరీరంలో మొత్తం 230 కీళ్లు ఉంటాయి.
  4. కీళ్ళలో యూరికామ్ల స్పటికాలు  జమకూడడం వల్ల కలిగే వ్యాధి: గౌట్
  5. కీళ్ళు-రకాలు:
    1. బంతిగిన్నె కీలు (Ball & Socket Joint): భుజము
    2. మడతబందు కీలు (Hinge Joint): మోచేయి, మోకాలు
    3. జారెడు కీలు (Gliding Joint): వెన్నెముక, మణికట్టు
    4. బొంగరపు కీలు (Pivot Joint): మెడ
    5. ఇరుసు కీలు: మెడ, తలతో బంధించే కీలు

కండరాలు (Muscles):
  1. ఎముకలకు అంటిపెట్టుకుని ఉండే కణజాల నిర్మాణాలను కండరాలు (Muscles) అంటారు.
  2. వీటి అధ్యయనం: మయాలజీ/ సార్కాలజీ
  3. వీటి విధి: సంకోచ, సడలికలు చెంది ఎముకలను కదల్చడం.
  4. కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు: కాల్షియం అయాన్స్
  5. కండరాలలో ఉండే వర్ణకం: మయోగ్లోబీన్
  6. కండరాల్లో ఉండే ప్రొటీన్: మయోసిన్
  7. కండరాల గురించి వివరించే సిద్ధాంతం: స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం.
    1. దీన్ని హక్సలే ప్రతిపాదించాడు.
  8. మానవునిలోని కండరాలు: 639
  9. కండరాలకు వచ్చే క్యాన్సర్: సార్కోమా/ మయోమా
  10. కండరాలు మూడు రకాలు:
    1. నియంత్రిత కండరాలు: ఈ కండరాలు మన శరీరం ఆధీనంలో ఉంటాయి, ఇవి కాళ్లు, చేతుల్లో ఉంటాయి.
    2. అనియంత్రిత కండరాలు: ఈ కండరాలు శరీరం నియంత్రణలో ఉండవు. ఇవి పేగులు, గర్భాశయం, మూత్రాశయం, కనురెప్పల్లో ఉంటాయి.
    3. హృదయ కండరాలు: ఇవి హృదయంలోనే ఉంటాయి. ఇవి రక్తాన్ని పంపు చేయడంలో సహాయపడతాయి. ఈ కండరాలు నిర్మాణంలో నియంత్రిత కండరాలు, విధుల్లో నియంత్రిత కండరాలను పోలి ఉంటాయి.
  11. కండరాల అపస్థితులు:
    1. టెటాని: టెటాని అంటే పారాథార్మోన్ లోపంవల్ల ఎల్లప్పుడూ సంకోచం చెందడం. దీని ఫలితంగా ఎముకలు కదలవు.
    2. కండర గ్లాని: కండరాలు ఎల్లప్పుడు పనిచేయడం వల్ల దానికి సరైన ఆక్సిజన్ అందక అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లం ఏర్పడటం వల్ల కండరాలు అలసటకు గురవుతాయి.
    3. రిగర్ మోర్టిస్: జీవి చనిపోయిన తర్వాత దానిలో ATP ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆక్టిన్, మయోసిన్ అనే కండరాల ప్రొటీన్స్ పనిచేయక శరీరం గట్టిగా మారుతుంది.
  12. మఖ్యమైన కండరాలు:
    1. అతిపెద్ద కండరం: గ్లుటియస్ మాక్జిమస్ (పిరుదు కండరం)
    2. అతి చిన్న కండరం: స్టెపీడియస్ (చెవి కండరం)
    3. అతి పొడవైన కండరం: సార్టోరియస్ (తొడ కండరం)
    4. అతి బలమైన కండరం: మాసెటర్ (దవడ కండరం)






No comments:

Post a Comment