History of Cricket in Telugu | క్రికెట్ చరిత్ర |
క్రికెట్ (Cricket):
- అంతర్జాతీయ క్రీడ ఐన క్రికెట్ ను చెక్కతో తయారుచేసిన బ్యాటు మరియు బంతితో ఆడతారు.
- ఈ ఆట రెండు జట్ల మధ్య లేదా రెండు దేశాల మధ్య జరుగుతుంది.
- ప్రతీ జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు.
- క్రికెట్ మైదానం మధ్యలో 20.12 మీటర్లు పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో చేసిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు.
- ఆటలోని ప్రతీ దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ప్రతి మ్యాచులో రెండు ఇన్నింగ్స్ ఉంటాయి. అయితే టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఒక్కో టీం కు రెండు ఇన్నింగ్స్ చెప్పున ఓవరాల్ గా 4 ఇన్నింగ్స్ లు ఉంటాయి. ఒక దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు. మరో జట్టు బౌలింగ్ మరియు ఫీల్డింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టు ఎక్కువ పరుగులు చేయకుండ ప్రయత్నిస్తుంది.
- ఒక ఇన్నింగ్స్ తరువాత బ్యాటింగ్ చేసే రెండో జట్టు, మొదటి జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే అది విజేత అవుతుంది. లేని పక్షంలో మొదటి జట్టు విజేత అవుతుంది.
క్రికెట్ చరిత్ర (History of Cricket):
- చారిత్రకంగా మనకు తెలిసినంతవరకు 16వ శతాబ్దం నుంచి క్రికెట్ చరిత్ర ప్రారంభమవుతుంది. ఆగ్నేయ ఇంగ్లండ్ లో పుట్టిన ఈ ఆట, బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
- 1611లో క్రికెట్‌ను వయోజన క్రీడగా ఆడటం గురించి మొదటి ప్రస్తావన వచ్చింది మరియు అదే సంవత్సరంలో, ఒక నిఘంటువు క్రికెట్‌ను అబ్బాయిల ఆటగా నిర్వచించింది.
- విలేజ్ క్రికెట్ 17వ శతాబ్దం మధ్యలో అభివృద్ధి చెందింది.
- 1709లో క్రికెట్ జట్లు కౌంటీ పేర్లను ఉపయోగించి మొట్టమొదటి మ్యాచ్ లను ఆడారు.
- 1787లో లండన్ లో Marylebone Cricket Club (MCC) స్థాపించబడింది. ఇది అంతర్జాతీయంగా క్రికెట్ కు సంబంధించి నియమాలు మరియు చట్టాలను చేసే అధికారం కలిగిన సంస్థ.
- 1844 లో న్యూయార్క్ లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ లో అమెరికా, కెనడాల మధ్య మ్యాచ్ జరిగింది. ఇది ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్.
- 1877లో ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ టూరింగ్ టీమ్ ఆస్ట్రేలియన్ XI తో రెండు మ్యాచ్ లు ఆడింది. అవి ఇప్పుడు మొదటి టెస్ట్ మ్యాచ్ లుగా పరిగణించబడుతున్నాయి.
- 1890లో అధికారిక కౌంటీ ఛాంపియన్‌షిప్ ఇంగ్లాండ్‌లో ఏర్పాటు చేయబడింది.
- క్రికెట్ చరిత్ర (History of Cricket) (www.icc-cricket.com)
మహిళల క్రికెట్ చరిత్ర (History of Women's Cricket):
- మొదటి మహిళల క్రికెట్ మ్యాచ్ 1745 లో ఆగ్నేయ ఇంగ్లండ్ లోని సర్రే అనే ప్రాంతంలో బ్రామ్లీ మరియు హాంబుల్డన్ గ్రామల మధ్య జరిగింది.
- మొదటి మహిళల కౌంటీ మ్యాచ్ 1811లో జరిగింది.
- 1887లో మొట్టమొదటి మహిళల క్రికెట్ క్లబ్ అయిన The White Heather Cricket Club ఏర్పడింది.
- 1894లో ఆస్ట్రేలియాలో మహిళ క్రికెట్ లీగ్ ఏర్పడింది.
- 1905లో Victoria Women’s Cricket Association ఏర్పడింది.
- 1926లో ఇంగ్లండ్ లో Women’s Cricket Association ఏర్పడింది.
- 1931లో Australian Women’s Cricket Association ఏర్పడింది.
- 1934లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాట్ జరిగింది.
- 1935లో సిడ్నీ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మహిళల టెస్ట్ మ్యాచ్ లో మైర్టిల్ మక్లాగన్ (ఇంగ్లండ్) తొలి సెంచరీని నమోదు చేసింది.
- 1958లో అంతర్జాతీయ మహిళా క్రికెట్ కౌన్సిల్ స్థాపించబడింది. ఇది 2005లో ICC లో విలీనం అయింది.
- మహిళల క్రికెట్ చరిత్ర (History of Women's Cricket) (www.lords.org)
క్రికెట్‌ను మూడు ఫార్మాట్‌లలో ఆడతారు:
- TEST MATCHES: టెస్ట్ క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) యొక్క పూర్తి సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించే జట్ల మధ్య అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫస్ట్-క్లాస్ క్రికెట్ యొక్క ఒక రూపం. అంటే కేవలం టెస్ట్ హోదా కలిగిన జట్టులు మాత్రమే ఈ ఫార్మాట్ని ఆడగలవు. ఒక మ్యాచ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లు (ఒక జట్టుకు రెండు) ఉంటాయి. మరియు ఐదు రోజుల పాటు అడుతారు. గతంలో, కొన్ని టెస్ట్ మ్యాచ్‌లకు సమయ పరిమితి లేదు మరియు వాటిని టైమ్‌లెస్ టెస్ట్‌లు అని పిలిచేవారు. మొదటి అధికారికంగా గుర్తించబడిన టెస్ట్ మ్యాచ్ 1877 మార్చి 15 న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) లో జరిగింది.
- One-Day Internationals (ODI): ఇది పరిమిత ఓవర్ల క్రికెట్ పోటీల్లో ఒక రూపం. అంతర్జాతీయ హోదా కలిగిన రెండు జట్ల మధ్య ఈ పోటీ జరుగుతుంది. రెండు జట్లూ ఒక్కో ఇన్నింగ్స్ ఆడతాయి. ఇన్నింగ్సుకు గరిష్ఠంగా 50 ఓవర్లుంటాయి. ఆట ఒకే రోజులో పూర్తవుతుంది. దాదాపు 9 గంటల సేపు జరుగుతుంది. సాధారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రికెట్ ప్రపంచ కప్పు ఈ ఫార్మాట్‌లోనే ఆడతారు. మొదటి వన్ డే ఇంటర్నేషనల్ (ODI) 5 జనవరి 1971 న ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది
- Twenty20 (T2O): ఇది క్రికెట్ ఆటలో ఒక సంక్షిప్త ఆట పద్ధతి. ఒక ట్వంటీ20 గేమ్‌లో, రెండు జట్లూ ఒక్కో ఇన్నింగ్స్ ఆడతాయి. ఇన్నింగ్సుకు గరిష్ఠంగా 20 ఓవర్లుంటాయి. మొదటి T20 టోర్నమెంట్‌ను 2003లో ఇంగ్లీష్ కౌంటీ జట్లు ఆడాయి.
వీటిని కూడా చూడండీ: