Tuesday, February 28, 2023

History of National Science Day in Telugu | జాతీయ విజ్ఞాన దినోత్సవం - ఫిబ్రవరి 28

History of National Science Day in Telugu | జాతీయ విజ్ఞాన దినోత్సవం

NATIONAL SCIENCE DAY
జాతీయ విజ్ఞాన దినోత్సవం
****

ఉద్దేశ్యం:
  • విజ్ఞానశాస్త్రం (Science) యొక్క ప్రాముఖ్యత మరియు మన రోజువారీ జీవితంలో దాని ఉపయోగం గురించి ప్రజలలో అవగాహన కల్పించడం జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు?
  • 1986 లో National Council for Science and Technology Communication (NCSTC) ఫిబ్రవరి 28 ను జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day) గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశం 1986 లో ఈ రోజును జాతీయ విజ్ఞాన దినంగా అంగీకరించింది మరియు ప్రకటించింది.
  • 1987 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఫిబ్రవరి 28 నే ఎందుకు?
  • భారత ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడైన చంద్రశేఖర్ వెంకటరామన్ (C.V.Raman) గారు రామన్‌ ఎఫెక్ట్‌ (Raman Effect) ను కనుగొన్న (పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన) రోజైన ఫిబ్రవరి 28 (1928) జ్ఞాపకార్థం ప్రతీ సంవత్సరం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటున్నారు.

థీమ్ (Theme):
  • 2023: Global Science for Global Wellbeing
  • 2022: Integrated Approach in S&T for Sustainable Future
  • 2021: Future of STI: Impact on Education Skills and Work
  • 2020: Women in Science
  • 2019: Science for the People, and the People for Science
  • 2018: Science and Technology for a sustainable future

రామన్ ప్రభావం (Raman Effect):
  • సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (Scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ప్రభావం (Raman Scattering or Raman effect) అంటారు.
  • కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
  • రామన్ ప్రభావం (Raman Effect) గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ Click చేయండి.
History of National Science Day in Telugu | జాతీయ విజ్ఞాన దినోత్సవం

ఇతర అంశాలు:
  • ఏప్రిల్ 2021లో IIT ఢిల్లీ యొక్క ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లోని పరిశోధనా బృందం గ్లాన్సింగ్ యాంగిల్ డిపోజిషన్ (GLAD) అనే ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగించి డెంగ్యూ వైరస్‌ను వేగంగా నిర్ధారించడానికి సర్ఫేస్ ఎన్‌హాన్స్‌డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ (SERS) ను అభివృద్ధి చేసింది. ఇది ఒక గంటలోపు డెంగ్యూ పరీక్ష ఫలితాలను అందిస్తుంది.

No comments:

Post a Comment