Banner 160x300

Indian Cricket History in Telugu | భారతదేశ క్రికెట్ చరిత్ర | Student Soula

Indian Cricket History in Telugu | భారతదేశ క్రికెట్ చరిత్ర | Student Soula
Indian Cricket History in Telugu |
భారతదేశ క్రికెట్ చరిత్ర

భారతదేశ క్రికెట్ చరిత్ర (History of Cricket in India):

  • భారతదేశంలో మొట్టమొదటిగా రికార్డ్ చేయబడిన మ్యాచ్ 1751లో బ్రిటీష్ సైన్యం మరియు బ్రిటీష్ సెటిలర్ల మధ్య జరిగింది.
  • ప్రపంచంలోని రెండవ పురాతన క్రికెట్ క్లబ్ అయిన కలకత్తా క్రికెట్ క్లబ్ 1792లో కలకత్తాలో స్థాపించబడింది.
  • భారతదేశంలో క్రికెట్ లోకి అడుగుపెట్టిన మొదటి పౌర సమాజం పార్సీలు. వీరు 1848లో ముంబయిలో ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ను స్థాపించారు.
  • 1850లో యంగ్ జొరాస్ట్రియన్స్ క్లబ్ ను స్థాపించారు.
  • వీరిని హిందువులు అనుసరించి 1866లో హిందూ జింఖానాను ఏర్పాటు చేశారు.
  • 1884లో శ్రీలంక జట్టు కోల్ కతాలో ఒక మ్యాచ్ ఆడింది. ఇది భారతదేశానికి సంబంధించి మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్.
  • 1888లో పార్సీలు, బ్రిటీష్ వారికి మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో పార్సీలు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఇది భారత గడ్డపై బ్రిటీష్ వారు ఎదుర్కొన్న మొదటి క్రికెట్ ఓటమి. 
  • 1911లో ఆల్-ఇండియా క్రికెట్ జట్టు తొలిసారిగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళింది. దీనికి పాటియాలా మహారాజా స్పాన్సర్ మరియు కెప్టెన్ గా వ్యవహరించాడు.
  • 1926లో కలకత్తా క్రికెట్ క్లబ్ కు చెందిన ఇద్దరు ప్రతినిధులు ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ (ఇప్పటి ICC) సమావేశాల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్ళారు. 
  • 1927లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత్ లో క్రికెట్ నియంత్రణ కోసం బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రతినిధులు అంగీకరించారు.
  • 1928 డిసెంబర్ లో Board of Control for Cricket in India (BCCI) ఏర్పడింది.
  • భారతదేశపు పురుషుల జాతీయ క్రికెట్ జట్టు 25 జూన్ 1932న లండన్ లో తన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆడింది.
  • భారతదేశ క్రికెట్ చరిత్ర (www.bcci.tv)


భారత మహిళల క్రికెట్ చరిత్ర (History of Indian Women's Cricket):

  • 1973లో Women's Cricket Association of India ఏర్పడింది. ఇది 2007లో BCCI లో విలీనమయ్యింది.
  • భారత మహిళల జట్టు 1976లో వెస్టిండీస్ తో తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది.
  • 1978లో ప్రపంచ కప్ పోటీల్లో వన్ డే ఇంటర్నేషనల్ (ODI), 2006లో T20 పోటీల్లో భారత మహిళల జట్టు అరంగేట్రం చేసింది.
  • మహిళల క్రికెట్ ప్రపంచ కప్ పోటీలకు భారత్ 1978, 1997, 2013లో ఆథిత్యం ఇచ్చింది.
  • మొదటిసారిగా భారత్ లో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2023 మార్చ్ 4 నుంచి 26వ తేదీ వరకు జరుగుతున్నాయి.

బాహ్య లింకులు (External links)