History of International Museum Day in Telugu | అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం |
అంతర్జాతీయ మ్యూజియం
దినోత్సవం - మే 18
ఉద్దేశ్యం:
సంగ్రహాలయం లేదా మ్యూజియం (Museum) ల గురించి మరియు సమాజ అభివృద్ధిలో వాటి పాత్ర గురించి ప్రజల్లో అవగాహన పెంచడం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (International Museum Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1977 నుంచి ప్రతి సంవత్సరం మే 18 వ తేదీన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఈ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ICOM- International Council of Museums) నిర్వహిస్తుంది.
ICOM:
- స్థాపన: 1946
- ప్రధాన కార్యాలయం: పారిస్
- ICOM అనేది యునెస్కోతో అధికారిక సంబంధాలను కొనసాగించే ఒక ప్రభుత్వేతర సంస్థ. మరియు ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలితో సంప్రదింపుల హోదాను కలిగి ఉంది.
- సాంస్కృతిక వస్తువుల అక్రమ ట్రాఫిక్‌తో పోరాడటం మరియు ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తులు సంభవించినప్పుడు ప్రపంచ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు అత్యవసర సంసిద్ధతను ప్రోత్సహించడం వంటి అంతర్జాతీయ ప్రజా సేవా కార్యక్రమాలను ICOM నిర్వహిస్తుంది.
- ICOM Official Website- www.icom.museum
థీమ్ (Theme):
- 2020: Museum for Equality: Diversity and Inclusion
- 2019: Museums as Cultural Hubs: The Future of Tradition
- 2018: Hyperconnected museum: New approaches, new publics
- 2017: Museums and Contested Histories: Saying the unspeakable in museums
- 2016: Museums and Cultural Landscapes
- 2015: Museums for a Sustainable Society
- 2014: Museum collections make connections
మరికొన్ని అంశాలు:
- 2019 లో జరిగిన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ కార్యక్రమంలో 158 దేశాలకు చెందిన 37,000 కు పైగా మ్యూజియంలు పాల్గొన్నాయి.
- ప్రపంచంలోనే అతి పురాతన మ్యూజియం - కాపిటోలిన్ మ్యూజియమ్స్ (Capitoline Museums). దీనిని రోమ్‌లోని కాపిటోలిన్ కొండపై పియాజ్జా డెల్ కాంపిడోగ్లియోలో 1471లో స్థాపించారు.
- భారతదేశంలో అతిపెద్ద మరియు పురాతన మ్యూజియం - ఇండియన్ మ్యూజియం (Indian Museum). ఇది పురాతన వస్తువులు, కవచాలు మరియు ఆభరణాలు, శిలాజాలు, అస్థిపంజరాలు, మమ్మీలు మరియు మొఘల్ చిత్రాల అరుదైన సేకరణలను కలిగి ఉంది. దీనిని 1814 లో భారతదేశంలోని కోల్‌కతాలో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించింది.
- Department of Archaeology and Museums Andhra pradesh Official Website- www.aparchmuseums.nic.in
- 12 Famous Museums in Andhra Pradesh and Telangana (www.travelogyindia.com)
వీటిని కూడా చూడండీ: