History of International Nurses Day in Telugu | అంతర్జాతీయ నర్సుల దినోత్సవం |
అంతర్జాతీయ నర్సుల
దినోత్సవం - మే 12
ఉద్దేశ్యం:
తెలుపు రంగు దుస్తులు ధరించి, ఆప్యాయతగా మాట్లాడుతూ, రోగులను కంటికిరెప్పలా చూసుకుంటున్న నర్సుల సేవా నిరతి గొప్పది. ఓపికకు మారుపేరు నర్సులు. వైద్యులకు మించి రోగులను తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్న నర్సులను గౌరవించడం, వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తిని గౌరవించడం, ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సుల తోడ్పాటును గుర్తించడం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం (International Nurses Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1965 నుంచి ప్రతి సంవత్సరం మే 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ICN- International Council of Nurses) ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
మే 12 నే ఎందుకు?
వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన, లేడి విత్ ది లాంప్ (Lady With the Lamp) గా ప్రసిద్ధి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ (Florence Nightingale)12 మే 1820 న జన్మించింది.
ఫ్లోరెన్స్ నైటింగేల్ జ్ఞాపకార్థం ఈమే పుట్టినరోజైన మే 12వ తేదీను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ (Florence Nightingale) (12 May 1820 – 13 August 1910) |
థీమ్ (Theme):
- 2020: Nurses: A voice to lead - Nursing the World to Health
- 2019: Nurses: A voice to lead - Health for All
- 2018: Nurses: A voice to lead - Health is a Human Right
- 2017: Nurses: A voice to lead - Achieving the Sustainable Development Goals
ICN:
- స్థాపన: 1899
- ప్రధాన కార్యాలయం: స్విట్జర్లాండ్ లోని జెనీవా
- ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ కు ప్రాతినిధ్యం వహించడానికి, నర్సింగ్ వృత్తిని ముందుకు తీసుకెళ్లడానికి, నర్సుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ICN- International Council of Nurses) స్థాపించబడింది.
- ICN అనేది 130 కి పైగా జాతీయ నర్సుల సంఘాల సమాఖ్య.
- ICN ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కిట్ ను తయారుచేసి పంపిణీ చేస్తుంది. ఈ కిట్ లో ప్రతిచోటా నర్సులకు ఉపయోగపడే విద్యా మరియు ప్రజా సమాచారాలు ఉంటాయి.
- ICN Official Website- www.icn.ch
ICN Logo |
నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు:
- నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను (National Florence Nightingale Awards) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 1973 లో నెలకొల్పింది. కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఈ అవార్డు కింద ఒక పతకం, సర్టిఫికెట్, జ్ఞాపికతోపాటు 50వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.
- జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు-2019: 2019 డిసెంబర్ 5 న న్యూ డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 36 మంది నర్సింగ్ సిబ్బందికి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందజేశారు.
మరికొన్ని అంశాలు:
- ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్ధ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) 2020 ను International Year of the Nurse and Midwife గా ప్రకటించింది.
వీటిని కూడా చూడండీ:
- అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం (International Day of the Midwife)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)