History of May Day in Telugu | మే డే

History of May Day in Telugu | మే డే

May Day in telugu, International Workers' day in telugu, Workers' Day in telugu, Labour Dayin telugu, May day essay in telugu, History of May Day, about May Day, Themes of May Day, Celebrations of May Day, World Heritage Day, May dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 1, Student Soula,

కార్మికుల (మే డే)
దినోత్సవం - మే 01

ఉద్దేశం:
  • నిరంకుశ శ్రమదోపిడీని నిరసిస్తూ... యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ... పారిశ్రామిక వేత్తలను నిలదీస్తూ... వేసిన ముందడుగే కార్మిక దినోత్సవం.
  • ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో  మేము మనుషులమే. మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరి మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు చేేేసిన పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (May Day/ International Workers' Day/ Workers' Day/ Labour Day) ముఖ్య ఉద్దేశ్యం.

    మే డే చరిత్ర:
    • 1837 లోనే ఇంగ్లాండ్ లోని ఫిలడల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ నాయకత్వాన 10 గంటల పని దినం కోసం తొలి సమ్మె జరిగింది.
    • 1834 లో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన ఉద్యమం పలు పట్టణాలకు వ్యాపించి పెద్ద ఎత్తున జరిగిన ప్రదర్శనలలో, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    • 1866 లో అమెరికాలోని బార్డిమోర్ లో  60 కార్మిక సంఘాల ప్రతినిధులు "నేషనల్ లేబర్ యూనియన్" పేరుతో ఒక కార్మిక సంఘాన్ని స్థాపించి విలియం హెచ్.సెల్విన్ నాయకత్వాన  లండన్ లోని ఫస్ట్ ఇంటర్ నేషనల్ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకుని 8 గంటల పని విధానం కోసం ఉద్యమించారు.
    • 1886 లో అమెరికా నగరాలైనా చికాగో, న్యూయార్క్, బాల్డిమోర్, వాషింగ్టన్, విల్ వాకి, సిన్సినాటి, సెయింట్ లూయీస్, ఫిట్స్ బర్గ్, డెట్రాయిట్ వంటి నగరాలలో 11,562 సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలలో 5 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు.
    • చికాగో(Chicago) నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో  కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
    • అమేరికా దేశవ్యాప్తంగా 13,000 సంస్థలలో 3 లక్షల మంది కార్మికులు సమ్మెలలో  పాల్గొంటే, ఒక్క చికాగో నగరంలోనే 40 వేల మంది కార్మికులు సమ్మె చేశారు.
    • 1886 మే 3 వ తేది చికాగో నగరంలో లక్ష మంది కార్మికులు చేసిన సమ్మెలో  పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
    • దీనికి నిరసనగా మే 4 వ తేది చికాగోలోని హే మార్కేట్ (Hey Market) సెంటర్ లో జరిగిన ప్రదర్శనల్లో లక్షలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
    • ఈ ప్రదర్శనల్లో అనేక మంది కార్మికులు చనిపోవడం, గాయాలపాలవడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
    • ఉద్రిక్తులైన కార్మికులను సముదాయించేందుకు అధికారుల బృందం ప్రయత్నిస్తూంటే, యాజమాన్యం ప్రోద్భలంతో గుర్తు తెలియని వ్యక్తి ప్రయోగించిన బాంబు పేలుడులో 7 గురు పోలీసులు, 8 మంది పౌరులు మరణించారు.
    • దీనితో హే మార్కేట్ (Hey Market) ప్రాంతం రక్తసిక్తమై వందలాది మంది కార్మికుల రక్తంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.
    • చికాగో ఘటనలపై విచారించిన ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగ, 8 మంది కార్మిక నాయకులను బాధ్యులుగా గుర్తించీ, విచారణ నిర్వహించి 7 గురికి మరణ శిక్ష విధింసింది. ఒకరికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.          (ఇందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.నలుగురిన ఉరితీశారు. మిగిలిన ముగ్గురు 6  సంవత్సరాల తర్వాత క్షమించబడ్డారు)
    • పని గంటల తగ్గింపు కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఎర్ర జెండాగా ప్రపంచమంతా కార్మిక వర్గ ఉద్యమం పెల్లుబికింది.
    • శ్రామిక వర్గం ఎర్ర జెండాను తమ పోరాట సంకేతంగా స్వీకరించింది.

    ఏం సాదించారు:
    • 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు మానసిక విశ్రాంతి (Recreation) అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు.

    హే మార్కేట్(Hey Market):
    • కార్మికులు రక్త తర్పణం చేసిన ఈ హే మార్కేట్ ప్రాంతాన్ని 1992 లో చారిత్రక ప్రదేశంగా ప్రకటించి 2004 లో మాన్యుమెంట్ నిర్మించారు. 
    • చికాగోవెళ్ళిన ప్రతీ విదేశీ యాత్రికుడికి హే మార్కేట్ ఒక దర్శనీయ స్థలంగా మారింది.
    • ఉరితీయబడ్డ అమరుల స్మారకార్థం 'ఫారెస్టు పార్క్' స్మశానంలో స్మృతి చిహ్నాన్ని కూడా 1997 లో నిర్మించారు.

    మే డే ని కార్మిక దినోత్సవంగా ప్రకటించింది:
    • అమెరిక కార్మిక సంస్థ(American Federation Of Labour)1888లో సెయింట్ లూయిస్ కన్వెన్షన్ విజ్ఞప్తి మేరకు 1890 మే 1 వ తేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా మే దినోత్సవాన్ని  కార్మిక వర్గ పోరాటాలకు ప్రతీకగా అంతర్జాతీయ కార్మిక సంఘిభావ దినంగా, 8 గంటల పనికోసం పోరాట స్పూర్తితో నిర్వహించాలని అంతర్జాతీయ కార్మిక మహాసభ నిర్ణహించింది.
    • 1889 లో పారిస్ మొదటి సోషలిస్ట్ ఇంటర్ నేషనల్ మే డే ని కార్మిక దినోత్సవంగా ప్రకటించింది.

    భారతదేశంలో మే డే:
    • భారత దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణిత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్ లో 1862 లో సమ్మె చేశారు.(అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే  పనిచేస్తామని డిమాండ్ చేశారు)
    • కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
    • 1920 లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం  పెరగడం మొదలైంది.
    • 1923 మే 1 న మద్రాసులో  సింగారవేలు చెట్టియార్ (Leader of the Labour Kisan Party of Hindustan) నాయకత్వంలో తొలిసారీ 'మే డే' నిర్వహించబడింది.
    • 1923 మే 1 న మద్రాసులో  రెండు సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఒకటి ట్రిప్లికేన్ బీచ్(Triplicane Beach), రెండోది మద్రాస్ హైకోర్టు దగ్గర.ఈ సమావేశాలు మే 1 న లేబర్ డే గా మరియు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బ్రిటీష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి.

    నేటి పరిస్థితి:
    • ప్రపంచీకరణ వలన వంద సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు.
    • ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుంది అనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్‌ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాయి.
    • ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితం అవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి.
    • ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మే డే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం.