History of Telugu Theater Day in Telugu | తెలుగు నాటకరంగ దినోత్సవం

History of Telugu Theater Day in Telugu | తెలుగు నాటకరంగ దినోత్సవం
Telugu Theater Day in telugu, Telugu Theater day essay in telugu, History of Telugu Theater Day, about Telugu Theater Day, Themes of Telugu Theater Day, Celebrations of Telugu Theater Day, Telugu Theater Day, telugu nataka ranga dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in April, days celebrations in April, popular days in April, April lo dinostavalu, special in April 16, Student Soula,

తెలుగు నాటకరంగ
దినోత్సవం - ఏప్రిల్ 16

ఉద్దేశ్యం:
అనేక రూపాలలో తెలుగు నాటకాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం, విస్తృత స్థాయిలో నాటక సంస్థలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం తెలుగు నాటకరంగ దినోత్సవం (Telugu Theater Day) ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
2007 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16 వ తేదీన తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఏప్రిల్ 16 నే ఎందుకు?
గొప్ప సంఘ సంస్కర్త మరియు ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త అయిన 'కందుకూరి వీరేశలింగం పంతులు' 16 ఏప్రిల్ 1848 న జన్మించాడు.
ఈయన జ్ఞాపకార్థం ఈయన పుట్టినరోజైన ఏప్రిల్ 16 వతేదీను తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

చరిత్ర:
  • నాటక ప్రదర్శనతోపాటు నాటకానికి సంబంధించిన అనేక అంశాలపై సదస్సులు జరగాలని, నాటక కళాకారుల జయంతులను వర్ధంతులను నిర్వహించడం ద్వారా ప్రజల్లో నాటక కళ పట్ల ఉత్సాహం, విలువలు పెరుగుతాయని, వీటన్నింటిని సమతుల్యం చేసేలా ఉండేందుకు నాటకరంగ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలుగు నాటక కళాకారులు భావించారు. అయితే, ఏ రోజును నాటకరంగం దినోత్సవంగా చేయాలన్న అంశంపై అనేక చర్చలు జరిగాయి. అనేక మంది అనేక పేర్లూ, తేదీలు సూచించారు.
  • 2000వ సంవత్సరంలో కొంతమంది యువనాటక కళకారులతో కలిసి డా. పెద్దిరామారావు ఆధ్వర్యంలో  యవనిక త్రైమాసిక నాటకరంగ పత్రిక ప్రారంభమయింది. నాటకరంగాన్ని మరింత పటిష్టపరచడంకోసం ఇతర దేశాల, రాష్ట్రాల నాటకరంగానికి ఉన్నట్లుగా తెలుగు నాటకరంగానికి కూడా ఒక దినోత్సవం ఉంటే బాగుంటుందని భావించి, "ఏప్రిల్ 16 తెలుగు నాటక దినోత్సవం" శీర్షికతో 2000 ఏప్రిల్-జూన్ ప్రత్యేక యవనిక సంచికను ప్రచురించింది.
  • యవనిక ఆలోచనకు ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక సహకారం తోడైంది. తెలుగు నాటక కళాకారులంతా నాటకరంగ దినోత్సవ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
  • ఆధునిక తెలుగు నాటకరంగానికి విశిష్ట సేవలను అందించిన మరియు తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని నాటక సంస్థలు 2001 నుండి తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరపడం మొదలుపెట్టాయి. 
  • ఈ క్రమంలో డా. కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగా, కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటిస్తూ 2007 మార్చి నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ. విడుదలచేసింది.
  • 16 ఏప్రిల్ 2007 న తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపబడింది.
Telugu Theater Day in telugu, Telugu Theater day essay in telugu, History of Telugu Theater Day, about Telugu Theater Day, Themes of Telugu Theater Day, Celebrations of Telugu Theater Day, Telugu Theater Day, telugu nataka ranga dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in April, days celebrations in April, popular days in April, April lo dinostavalu, special in April 16, Student Soula,
కందుకూరి వీరేశలింగం పంతులు
(1848 ఏప్రిల్ 16 - 1919 మే 27 )

నాటకం (Drama):
నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. 
అతి ప్రాచీనమైన ప్రదర్శక కళల్లో ప్రధాన మైంది నాటకం. నట అన్న పదం నాట్యంలోంచి పుట్టింది. నట అంటే అభినయం. నర్తనం అన్న అర్థం నాట్య శాస్త్రంలో చెప్పబడింది. నాట్య రూపకం (Dance Ballet) అతిప్రాచీనమైన ప్రదర్శక కళల్లో ప్రధానమైంది. ఈ నాట్య రూపకాల్లోంచే కాలక్రమేణా నాటకం పుట్టింది. కాబట్టి నాట్య శాస్త్రంలోంచి పుట్టింది నాటకం అని పెద్దల ఉవాచ.

రికొన్ని అంశాలు:
  • రచనాపరంగా చూస్తే, సంస్కృత సాహిత్యంలో నాటక రచనకి శ్రీకారం చుట్టిన వాడు- భాసుడు
  • ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం- కోరాడ రామచంద్రశాస్త్రి రచించిన 'మంజరీ మధుకరీయము'
  • తొలి తెలుగు విషాద నాటకం- ధర్మవరం కృష్ణమాచార్యులు రచించిన 'విషాద సారంగధర'
  • తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించింది- కందుకూరి వీరేశలింగం పంతులు
  • మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి ప్రముఖ రచన- ఆంధ్ర నాటక రంగ చరిత్ర

వీటిని కూడా చూడండీ: