History of World Veterinary Day in Telugu | ప్రపంచ పశువైద్య దినోత్సవం |
ప్రపంచ పశువైద్య
దినోత్సవం - ఏప్రిల్ చివరి శనివారం
ఉద్దేశ్యం:
పశువైద్య వృత్తిని ప్రోత్సహించడం మరియు పశువుల సంక్షేమం, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం ప్రపంచ పశువైద్య దినోత్సవం (World Veterinary Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
2001 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరి శనివారం రోజున ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ప్రపంచ పశువైద్య సంఘం (WVA) రూపొందించింది.
చరిత్ర:
- 1863 లో UK లోని ఎడిన్బర్గ్ కళాశాల ప్రొఫెసర్ జాన్ గామ్గీ (John Gamgee) యూరప్ నలుమూలల నుండి వెటర్నరీ మెడిసిన్ ప్రొఫెసర్లను మరియు పశువైద్యులను జర్మనీలోని హాంబర్గ్ లో జరిగిన ఒక సాధారణ సమావేశానికి ఆహ్వానించడానికి చొరవ తీసుకున్నారు.
- ఈ సమావేశం మొదటి ప్రపంచ పశువైద్య కాంగ్రెస్ (World Veterinary Congress) గా ప్రసిద్ధి చెందింది. ఈ సమావేశంలో ఎపిజూటిక్ వ్యాధుల గురించి మరియు నివారణ చర్యల గురించి చర్చ జరిగింది.
- 1906 లో జరిగిన 8వ ప్రపంచ పశువైద్య సమావేశంలో సభ్యులు శాశ్వత కమిటీని ఏర్పాటు చేశారు.
- 1959 లో మాడ్రిడ్ లో జరిగిన 16వ సమావేశంలో ప్రపంచ పశువైద్య సంఘం (WVA- World Veterinary Association) స్థాపించబడింది. ప్రపంచ పశువైద్య సంఘం యొక్క లక్ష్యం జంతు ఆరోగ్యం మరియు సంక్షేమంతో పాటు పర్యావరణం, ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం.
- పశువైద్యానికి సంబంధించి వివిధ రంగాల్లో పనిచేస్తున్న జాతీయ పశువైద్య సంఘాలకు ఈ ప్రపంచ పశువైద్య సంఘం (WVA) కేంద్ర బిందువులా మారింది.
- ప్రపంచ పశువైద్య సంఘం (WVA) ఆద్వర్యంలో 2001 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరి శనివారం రోజున ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
- WVA Official Website- www.worldvet.org
వరల్డ్ వెటర్నరీ డే అవార్డు:
- 2008 నుంచి ప్రపంచ పశువైద్య సంఘం, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ తో కలిసి ప్రపంచ వెటర్నరీ డే అవార్డు (World Veterinary Day Award) ను ఇవ్వడం ప్రారంభించింది.
- పశువైద్య వృత్తికి ఉత్తమ సహకారాన్ని అందించిన వ్యక్తికి లేదా సంస్థకి ఈ అవార్డును ఇస్తారు.
- మొదటి అవార్డు అందుకున్నవారు- కెన్యా వెటర్నరీ అసోసియేషన్
థీమ్ (Theme):
- 2020: Environmental protection for improving animal and human health
- 2019: Value of vaccination
మరికొన్ని అంశాలు:
- ఇండియన్ వెటర్నరీ కౌన్సిల్ యాక్ట్- 1984 ద్వారా Veterinary Council of India (VCI) 1984 లో వ్యవసాయ మంత్రిత్వశాఖ కింద ఏర్పాటు చేయబడింది.
Veterinary Council of India (VCI) |
వీటిని కూడా చూడండీ:
- World Veterinary Day Official Website- worldveterinaryday.com
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)