History of World Day for Safety and Health at Work in Telugu | పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం |
పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం - ఏప్రిల్ 28
ఉద్దేశ్యం:
ప్రపంచంలోని వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర రంగాలలో పనిచేసే కార్మికులందరికీ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని అభివృద్ధి చేయడమే పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం (World Day for Safety and Health at Work) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
2003 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 28 నే ఎందుకు?
వృత్తి భద్రత మరియు ఆరోగ్య చట్టం-1970 (OSHA-Occupational Safety and Health Act) అధికారికంగా 28 ఏప్రిల్ 1971 నుండి అమెరికాలో అమలులోకి వచ్చింది.
దీని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
చరిత్ర:
- అమెరికా కాంగ్రెస్ వృత్తి భద్రత మరియు ఆరోగ్య చట్టం-1970 (OSHA-Occupational Safety and Health Act) ను ఆమోదించిన తర్వాత ఈ చట్టంపై అమెరికా అధ్యక్షుడైన రిచర్డ్ నిక్సన్ (Richard Nixon) 29 డిసెంబర్ 1970 న సంతకం చేశారు.
- ఈ చట్టం అధికారికంగా 28 ఏప్రిల్ 1971 నుండి అమలులోకి వచ్చింది.
- పనిచేసే చోట మరణించిన మరియు గాయపడిన లక్షలాది మంది శ్రామిక ప్రజలను గౌరవించటానికి OSHA చట్టం అమలులోకి వచ్చిన తేది అయిన ఏప్రిల్ 28 న 'వర్కర్స్ మెమోరియల్ డే' (Worker’s Memorial Day) గా AFL-CIO (American Federation of Labour-Congress of Industrial Organization) 1989 లో ప్రకటించింది.
- ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ (ICFTU) 1996 లో ఏప్రిల్ 28 వ తేదీని వర్కర్స్ మెమోరియల్ డేగా గుర్తించింది.
- ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) వర్కర్స్ మెమోరియల్ డేను 2001 లో గుర్తించింది. మరియు దీనిని పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవంగా 2002 లో ప్రకటించింది.
- 2003 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం (World Day for Safety and Health at Work) ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
థీమ్ (Theme):
- 2020: Stop the pandemic: Safety and health at work can save lives
- 2019: Safety and Health and the Future of Work
- 2018: OSH (Occupational Safety and Health) Vulnerability of Young Workers
- 2017: Optimize the Collection and Use of OSH Data
- 2016: Workplace Stress: a Collective Challenge
వీటిని కూడా చూడండీ: