History of International Day of Women and Girls in Science in Telugu | సైన్స్‌లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 11

History of International Day of Women and Girls in Science in Telugu | సైన్స్‌లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 11 History of International Day of Women and Girls in Science, about International Day of Women and Girls in Science, International Day of Women and Girls in Science essay in telugu, International Day of Women and Girls in Science in telugu, Theme of International Day of Women and Girls in Science, Day Celebrations, science lo mahilala balikala dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 11,

International Day of
Women and Girls in Science
సైన్స్‌లో మహిళలు మరియు బాలికల
అంతర్జాతీయ దినోత్సవం
****

ఉద్దేశ్యం:
  • మహిళలు మరియు బాలికలకు విజ్ఞాన శాస్త్రంలో పాల్గొనడానికి పూర్తి మరియు సమాన ప్రాప్యతను ప్రోత్సహించడం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలు మరియు బాలికలు పోషించే కీలక పాత్రను గుర్తించడం సైన్స్‌లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం (International Day of Women and Girls in Science) యొక్క ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
  • సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలు మరియు బాలికలు పోషించే కీలక పాత్రను గుర్తించడానికి వార్షిక అంతర్జాతీయ దినోత్సవాన్ని  ఫిబ్రవరి 11 వ తేదీన ఏర్పాటు చేయాలని 2015 డిసెంబర్ 22 న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది.
  • 2016 నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 11 న సైన్స్‌లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 
  • UN Women సహకారంతో UNESCO, ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీలు మరియు సంస్థలతో పాటు పౌర సమాజ భాగస్వాములతో కలిసి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహింస్తుంది.

థీమ్ (Theme):
  • 2023: Innovate. Demonstrate. Elevate. Advance. (I.D.E.A.) to bring communities forward for sustainable and equitable development

గణాంకాలు:
ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం,
  • STEM (Science, Technology, Engineering, Mathematics) సంబంధిత అధ్యయన రంగాలలో మొత్తం విద్యార్థులలో మహిళలు కేవలం 35%.
  • ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో 33.3% మంది మహిళలు ఉన్నారు.
  • కృతిమ మేధ వంటి అత్యాధునిక రంగాలలో ఐదుగురు నిపుణులలో ఒకరు మాత్రమే మహిళ (22%)
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 28%, కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేటిక్స్ గ్రాడ్యుయేట్లలో 40% మహిళలు ఉన్నారు.

ఇతర ముఖ్యమైన అంశాలు:
  • ఆనందీబాయి జోషి: పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు (1887 లో). 
  • కమలా సొహోని: శాస్త్రీయ విభాగంలో (Scientific Discipline) Ph.D పొందిన మొదటి భారతీయ మహిళ (1939 లో). ఈమె భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. 
  • మేరీ క్యూరీ: ఈమె ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ. ఈమె 1903లో భౌతిక శాస్త్రంలో మరియు 1911లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతిత అందుకున్నారు.
  • టెస్సీ థామస్: ఘన ఇంధనాల రంగంలో నిపుణురాలు. మిస్సైల్ మహిళ (Missile Woman of India) గా ఖ్యాతి గడించింది. ఈమె DRDO లో అగ్ని-IV క్షిపణికి మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్. భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త.