History of Indian Coast Guard Day in Telugu | భారతీయ తీర రక్షక దళ దినోత్సవం - ఫిబ్రవరి 1 |
INDIAN COAST GUARD DAY
భారతీయ తీర రక్షక దళ దినోత్సవం
****
తీర ప్రాంతాల్ని సురక్షితం చేసే బాధ్యతను నిర్వహిస్తున్న భారత తీర రక్షక దళం (ICG-Indian Coast Guard) యొక్క దినోత్సవాన్ని ఫిబ్రవరి 1 వ తేదీన జరుపుకుంటారు.
ఫిబ్రవరి 1 నే ఎందుకు?
- 1 ఫిబ్రవరి 1977 న తాత్కాలిక ప్రాతిపదికన భారతీయ తీర రక్షక దళం (ICG-Indian Coast Guard) ఏర్పాటు చేయబడింది. అందువల్ల ఫిబ్రవరి 1 వ తేదీన భారతీయ తీర రక్షక దళ దినోత్సవం (Indian Coast Guard Day) జరుపుకుంటారు.
- తర్వాత Coast Guard Act - 1978 ఆధారంగా 1978 ఆగష్టు 18 న భారతీయ తీర రక్షక దళం అధికారికంగా ఏర్పాటైంది.
భారతీయ తీర రక్షక దళం (ICG-Indian Coast Guard) చరిత్ర :
- స్థాపన: 1978 ఆగష్టు 18
- Motto: వయం రక్షం (We Protect - మేము కాపాడతాం)
- ఢిల్లీ ప్రధాన కేంద్రంగా 5 తీర రక్షణ ప్రాంతాలతో (Coast Guard Regions) రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
- North-West Region - గాంధీనగర్
- Western Region - ముంబాయి
- Eastern Region - చెన్నై
- North-East Region - కోల్ కతా
- Andaman & Nicobar Region - పోర్ట్ బ్లెయిర్
- కోస్ట్ గార్డ్ రీజియన్ కు ఇన్స్ పెక్టర్ జనరల్ ర్యాంక్ ఉన్న అధికారులు నాయకత్వం వహిస్తారు.
- 1960 లలో స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎక్కువ అవటం కారణంగా కస్టమ్స్ శాఖ వారికి తీర గస్తీకి నౌక దళం యొక్క అవసరం ఉండేది.
- ఈ సమస్యను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం నౌక మరియు వైమానిక దళ అధికారుల భాగస్వామ్యంతో నాగచౌధురి కమిటీ (1970) ని ఏర్పాటు చేసింది. 1971 ఆగష్టులో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీర రక్షణకు కావాల్సిన వనరులను నౌక దళానికి సమకూర్చింది.
- కొంత కాలం తరువాత అప్పటి నౌక దళాధిపతి అడ్మిరల్ కోహ్లీ (Admiral Sourendra Nath Kohli) (1973 - 1976) ఒక స్వతంత్ర బలగ ఏర్పాటునకు రక్షణ శాఖ కార్యదర్శికి ప్రతిపాదించారు.
- ఇందు కారణముగా సెప్టెంబర్ 1974 లో రుస్తంజి కమిటీ (Rustamji Committee) ఏర్పాటు అయింది. ఈ కమిటీ చేసిన సిఫారసు ఆధారంగా, 1 ఫిబ్రవరి 1977 న తాత్కాలిక ప్రాతిపదికన భారతీయ తీర రక్షక దళం ఏర్పాటు చేయబడింది.
- 1978 ఆగష్టు 18 న Coast Guard Act - 1978 ద్వారా భారతీయ తీర రక్షక దళం అధికారికంగా ఏర్పాటైంది.
- ప్రస్తుతం (2023 నాటికి) ఇందులో 15 వేలకు పైగా సిబ్బంది, 159 నౌకలు, 76 విమానాలు, 42 స్టేషన్లు ఉన్నాయి.
- ICG మొదటి డైరెక్టర్ జనరల్ - V.A.కామత్
- ICG ప్రస్తుచ డైరెక్టర్ జనరల్ - V.S.Pathania (1 డిసెంబర్ 2021 నుంచి)
ICG యొక్క విధులు:
- చట్టపరమైన నిబంధనల అమలు, సర్వేక్షణ, సాగర జలాల్లో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టడం.
- చట్ట విరుద్ధంగా చేపలు పట్టడం, స్మగ్లింగ్, వేట, మాదక ద్రవ్యాల అక్రమ రవాణ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోదించడం.
- తనిఖి నిమిత్తం ఏదైనా నౌక, పడవను ఆపడానికి, అందులోకి ప్రవేశించడానికి ICG కి అధికారం ఉంటుంది.
- నిఘా సమాచారం మేరకు నిరంతరం బోర్డింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. రక్షణ శాఖ నివేదిక (2019-20) ప్రకారం 2009 నుంచి మొత్తం 2,39,724 బోర్డింగ్ ఆపరేషన్లను ICG నౌకలు నిర్వహించాయి.
- అంతర్జాతీయ సముద్ర అన్వేషణ, సహాయక చర్యల ఒడంబడిక-1979 పై భారత్ కూడా సంతకం చేసింది. దీని ప్రకారం భారత అన్వేషణ, సహాయక చర్యల ప్రాంతంలో విదేశీయులకు సంబంధించి సమన్వయం చేసే బాధ్యత ICG పైనే ఉంది.
- వరదలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులప్పుడు మానవతా సహాయ కార్యకలాపాలను చేపడుతోంది.
- సముద్రంలో చమురు, రసాయనాల విడుదల విషయంలో చర్యలు చేపట్టే అంశాలపై ప్రభుత్వం ICG ని కేంద్ర సమన్వయ ప్రాధికార సంస్థగా నియమించింది. సముద్ర జలాల్లో చమురు విడుదల కావడానికి సంబంధించి 2022 అక్టోబర్ వరకు 97 ఘటనలు, విదేశీ జలాల్లో మూడు ఘటనలపై చర్యలు చేపట్టింది.
- సముద్ర పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య నివారణకూ కృషి చేస్తుంది.
- తీరంలోని టెర్మినళ్లు, ఇతరత్రా నిర్మాణాల రక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తుంది.
- సముద్రంలో మత్స్యకారులు మరియు నావికులకు రక్షణ మరియు సహాయం చేయడం.
Indian Coast Guard Organisation:
NOTE:
- Coast Guard Regional Headquarters - CGRHQ
- Coast Guard District Headquarters - CGDHQ
భారతీయ తీరరక్షక దళ చిహ్నం:
Indian Coast Guard Logo |
వీటిని కూడా చూడండీ:
- నేవీ డే (Navy Day)
- సరిహద్దు భద్రతా దళ ఆవిర్భావ దినోత్సవం (BSF Raising Day)
- భారత సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)