History of World Cancer Day in Telugu | ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం - ఫిబ్రవరి 4 |
WORLD CANCER DAY
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
****
ఉద్దేశ్యం:
- క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించి, ఈ మహమ్మారి బారి నుంచి మానవాళిని రక్షించడం మరియు దాని నివారణ, గుర్తింపును మరియు చికిత్సను ప్రోత్సహించడం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం
ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?
- 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
- ప్రపంచ క్యాన్సర్ డిక్లరేషన్-2008 యొక్క లక్ష్యాలకు మద్దతుగా Union for International Cancer Control (UICC) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుంది.
ఫిబ్రవరి 4 నే ఎందుకు?
- 2000 ఫిబ్రవరి 4 న పారిస్‌లో జరిగిన World Summit Against Cancer for the New Millennium లో ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.
- ఈ సదస్సులో Charter of Paris Against Cancer పై అప్పటి UNESCO డైరెక్టర్ జనరల్ కైచిరో మాట్సురా మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ 4 ఫిబ్రవరి 2000 న సంతకం చేశారు.
థీమ్స్ (Themes):
- 2022 - 2024: Close the Care Gap
- 2019 - 2021: I Am and I Will
- 2016 - 2018: We can. I can
- 2015: Not Beyond Us
- 2014: Debunk the Myths
- 2013: Cancer Myths - Get the Facts
- 2012: Together let's do something
- 2010-2011: Cancer can be prevented
కార్యక్రమాలు:
- క్యాన్సర్ తో బాధపడుతున్నవారికి మద్దతు ఇవ్వడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో అనేక కార్యక్రమాలు అమలులో ఉన్నాయి.
- ఈ ఉద్యమాలలో ఒకటి #NoHairSelfie అనే గ్లోబల్ కదలిక, భౌతికంగా లేదా వాస్తవంగా క్యాన్సర్ చికిత్సాకు గురయ్యే వారికి ధైర్య చిహ్నంగా ఉండటానికి వారి తలలకు గుండు గియించుకుంటారు మరియు వారి చిత్రాలను సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేస్తారు.
గణాంకాలు:
Globocan-2020 నివేదిక ప్రకారం,
- ప్రపంచంలో ప్రబలంగా ఉన్న క్యాన్సర్ కేసుల సంఖ్య (5 సంవత్సరాలు) - 5,05,50,287
- 2020లో ప్రపంచంలో కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులు - 1,92,92,789
- 2020లో ప్రపంచంలో క్యాన్సర్ మరణాలు - 99,58,133
- భారతదేశంలో ప్రబలంగా ఉన్న క్యాన్సర్ కేసుల సంఖ్య (5 సంవత్సరాలు) - 27,20,251
- 2020లో భారతదేశంలో కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులు - 13,24,413
- 2020లో భారతదేశంలో క్యాన్సర్ మరణాలు - 8,51,678
- Download Globocan-2020 (India) Report PDF
క్యాన్సర్ (Cancer):
- కణాలలో విభజన సాధారణంగా జరుగుతుంది. ఏ కణమైనా కొంతకాలం వరకు మాత్రమే జీవిస్తుంది. వాటి జీవిత కాలం పూర్తయిన వెంటనే ఆ కణాలు చనిపోతాయి. వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. కానీ క్యాన్సర్ కణాలు మాత్రం నిత్య యవ్వనంగానే ఉంటాయి. ఈ కణాలకు చావు ఉండదు. ఎక్కడో ఒక చోట ఇవి నిశ్శబ్దంగానే దాక్కొని ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఈ కణవిభజన అనేది అదుపుతప్పుతుంది. ఫలితంగా శరీరంలో ట్యూమర్లు లేదా గడ్డలు ఏర్పడతాయి. శరీరానికి అవసరం లేకుండా, శరీరానికి అవసరానికి మించి కణ ఉత్పత్తి ఎక్కువ అవుతూ, ఒక పర్టిక్యులర్ కణజాలం (టిష్యూ) అనవసరంగా శరీరంలో పెరుగుతుంది. పెరిగింది మామూలుగా ఉండకుండా పక్క కణాలను నాశనం చేస్తుంది. మనం తినవలసిన మన శరీరానికి, మిగిలిన అవయవాలకు, మెదడుకి, గుండెకి, కాలేయానికి, మూత్రపిండాలకు కావాల్సిన ఆహారాన్నంతటినీ అనవసరమైన టిష్యూలు తినేయడం వల్ల మనిషి బలహీనుడవుతాడు.
- అయితే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలుకావు. క్యాన్సర్ కాని గడ్డలు కూడా ఉంటాయి. వాటిని బినైన్ ట్యూమర్లు (Benign tumors) అంటారు. వీటితో ప్రమాదం లేదు. కానీ కణవిభజన కొన్ని సందర్భాలలో అదుపు లేకుండా జరగటం వలన కోటానుకోట్ల కణాలతో ఏర్పడే గడ్డలనే మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors) అంటారు. ఇవి ప్రమాదకరమైనవి. వీటినే క్యాన్సర్ గడ్డలు అంటారు. కేన్సర్ ని తొలిదశలో గుర్తిస్తే, చికిత్స సులువుగా ఉంటుంది.
క్యాన్సర్ చరిత్ర (History of Cancer):
- క్రీస్తుపూర్వం 1600 నాటికి చెందిన ప్రాచీన ఈజిప్టు వైద్య గ్రంథం ఎడ్విన్ స్మిత్ పాపిరస్ లో బ్రెస్ట్ కేన్సర్ లక్షణాలకు సంబంధించిన వివరణ కనిపిస్తుంది.
- క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి చెందిన గ్రీకు వైద్యుడు హిప్పోక్రాట్స్ రచనల్లో మరికొన్ని రకాల క్యాన్సర్ గురించిన వివరాలు కనిపిస్తాయి. ఎండ్రపీతలా పట్టుకుంటే ఒకపట్టాన వదలని లక్షణం కారణంగా హిప్పోక్రాట్స్ ఈ వ్యాధిని కార్కినోస్ గా నామకరణం చేశాడు. గ్రీకు భాషలో కార్కినోస్ అంటే ఎండ్రపీత. తర్వాతి కాలంలో ఇంగ్లిష్ లో ఇదే అర్థం ఉన్న క్యాన్సర్ పేరు ఈ వ్యాధికి స్థిరపడింది.
- పొగాకుతో తయారు చేసే ముక్కుపొడుం పీల్చే అలవాటు క్యాన్సర్ కు కారణమవుతున్నట్లు ఇంగ్లిష్ వైద్యుడు జాన్ హిల్ 1761 లో గుర్తించాడు.
- వంటిళ్లల్లో కట్టెల పొయ్యిల నుంచి వెలువడే పొగ బయటకు పోవడానికి పైకప్పులపై చిమ్నీలు ఏర్పాటు చేసుకునేవారు. కొందరు ఈ చిమ్నీలను శుభ్రం చేసే వృత్తిలో ఉండేవారు. చిమ్నీలను శుభ్రం చేసేవారికి చిమ్నీలో పేరుకున్న మసి, పొగల కారణంగా క్యాన్సర్ సోకుతున్నట్లు బ్రిటిష్ శస్త్రవైద్యుడు పెర్సివాలీ పోర్ట్ 1775 లో గుర్తించాడు.
- పద్దెనిమిదో శతాబ్దిలో మైక్రోస్కోపులను వైద్యపరీక్షల కోసం వాడటం మొదలైన తర్వాత క్యాన్సర్ కణితి నుంచి క్యాన్సర్ కణాలు లింఫ్ నోడ్స్ ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తాయని ఇంగ్లీష్ శస్త్ర వైద్యుడు కాంప్ బెల్ డి మోర్గాన్ గుర్తించాడు. ఆయన దీనిపై 1871 - 74 కాలంలో విస్తృతంగా పరిశోధనలు సాగించాడు.
- అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1971 లో క్యాన్సర్ పై యుద్ధం ప్రకటించాడు. క్యాన్సర్ పరిశోధనలకు విరివిగా నిధులు కేటాయించాడు.
వివిధ రకాల క్యాన్సర్ మరియు వాటి రిబ్బన్ రంగులు:
Different Types of Cancer and Their Ribbon Colors |
ఇతర ముఖ్యాంశాలు:
- క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం - ఆంకాలజీ (Oncology)
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి
- ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం (World Lymphoma Awareness Day) - సెప్టెంబర్ 15. చర్మ క్యాన్సర్ (లింఫోమా) పై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.
వీటిని కూడా చూడండి:
- వ్యాధులు (Diseases)
- క్యాన్సర్ గురించి (వికీపీడియా)
- క్యాన్సర్ రాకుండా తీసుకునే జాగ్రతలు, క్యాన్సర్ లక్షణాలు, నివారణ మార్గాలు, చికిత్సలు మొదలైనవి (www.myupchar.com)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)