Banner 160x300

సాలే పురుగుల గురించి పూర్తి వివరాలు | Full information about Spiders in telugu




Full information about Spiders in telugu
Full information about Spiders in telugu

  సాలే పురుగులు(Spiders)

  • ప్రపంచంలో మొత్తం నలభై వేల రకాల సాలీళ్లు ఉన్నాయి.
  • అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లోనూ సాలీళ్లు ఉంటాయి.
  • బ్లాక్ విడో జాతికి చెందిన సాలీడు అత్యంత విషపూరితమైనది. దీనిలో ఉండే విషం మనిషి ప్రాణాన్ని తేలికగా తీసేస్తుంది.
Full information about Spiders in telugu and black wido Spiders
బ్లాక్ విడో
  • ఇవి పట్టుకు మూడు వేల గుడ్లు పెడతాయి. సాలె పురుగులు గూడు కట్టుకుంటాయి కదా ఆడ సాలీళ్లు గుడ్లు కూడా ఆ గూడు తీగల మీదే పెడతాయి. ఆ పైన గుడ్లమీద దట్టంగా తీగలు అల్లేస్తాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు పిల్లలు ఆ తీగల్ని తెంచుకుని వస్తాయి.
Full information about Spiders in telugu and Spiders nest and eggs
సాలీళ్ల గుడ్లు
  • కొన్ని రకాల సాలీళ్లు మాత్రమే నీటిలో పడినా బతుకుతాయి. మిగతావి నీటిలో అయిదు నిమిషాల కంటే ఎక్కువసేపు జీవించి ఉండలేవు.
  • ఆడవాటి కంటే మగవి చిన్నగా, బలహీనంగా ఉంటాయి. అందుకే చాలాసార్లు ఆడవాటి చేతిలో ప్రాణాలు కోల్పోతుంటాయి.
  • ప్రపంచంలోని అన్ని రకాల సిల్క్ లోకీ సాలె పురుగు గూడు అల్లే సిల్క్ చాలా దృఢంగా ఉంటుంది. అలాంటి దాన్ని తయారు చేయడానికి ప్రయత్నించి పరిశోధకులు విఫలమయ్యారు. 
  • దీని రక్తం లేత నీలి రంగులో ఉంటుంది.
  • వీటికి దగ్గరగా ఉన్నవి సరిగ్గా కనబడవు. దూరంగా ఉన్న వాటిని మాత్రం చాలా స్పష్టంగా చూడగలుగుతాయి. 
  • ఇవి ఘనాహారాన్ని తినలేవు. తీసుకున్న ఆహారాన్ని వీటి నోటిలో ఉండే ఒక ఎంజైమ్ , ద్రవంగా మార్చేస్తుంది.
  • కొత్తగూడు ఆకట్టుకోవాలనుకున్నప్పుడు పాత గూటిని తీసి చుట్టలా చుట్టేస్తాయి సాలీళ్లు. తర్వాత దానిమీద ఒక విధమైన ద్రవాన్ని వదులుతాయి. అప్పుడు సిల్క్ మెత్తబడిపోతుంది. ఆ పైన దాన్ని అవి ఆరగించేస్తాయి.
  • ఉల్ఫ్  స్పైడర్ జాతి సాలీళ్లు తమ పిల్లలు పెద్దవై, వాటంతటవి తిరిగే వరకూ వాటిని వీపున మోస్తూనే ఉంటాయి.