World Happiness Report in Telugu | ప్రపంచ సంతోష నివేదిక | Student Soula
ప్రపంచ సంతోష నివేదిక (World Happiness Report) ను ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవం (International Day of Happiness) సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ (SDSN) విడుదల చేస్తుంది.
ఈ నివేదికలో ప్రపంచంలోని దేశాలకు 0 నుండి 10 మధ్య వచ్చిన స్కోర్/పాయింట్ల ఆధారంగా ర్యాంకులు ఇస్తారు.
అమెరికన్ అనలిటిక్స్ మరియు అడ్వైజరీ కంపెనీ Gallup నిర్వహించే Gallup World Poll డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తారు.
తలసరి ఆదాయం, సోషియన్ సపోర్ట్, ఆరోగ్యకర జీవనం, స్వేచ్ఛ, అత్యల్ప అవినీతి, దాతృత్వం సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలను కొలమానంగా చేసుకుని ర్యాంకులు ఇస్తారు.