Saturday, June 3, 2023

Global Peace Index in Telugu | ప్రపంచ శాంతి సూచిక | Student Soula

దయచేసి మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.... Contact: studentsoula@gmail.com

Global Peace Index in Telugu | ప్రపంచ శాంతి సూచిక | Student Soula
  1. ప్రపంచ శాంతి సూచిక (GPI - Global Peace Index) అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP Institute for Economics & Peace) ప్రతి సంవత్సరం విడుదల చేసే నివేదిక.
  2. మొట్టమొదటి ప్రపంచ శాంతి సూచికను 2007లో విడుదల చేశారు.
  3. శాంతి ధోరణులు, దాని ఆర్థిక విలువ, శాంతియుత సమాజాలను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఈ నివేదిక అత్యంత సమగ్రమైన డైటా ఆధారిత విశ్లేషణను అందిస్తుంది.
  4. ఇందులో 23 అంశాలను/సూచికలను (Indicators) కొలమానంగా తీసుకుని ప్రపంచ దేశాలకు అక్కడి శాంతియుత స్థాయిని బట్టి 1-5 మధ్య వచ్చిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు.
  5. ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా, మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయి. ప్రపంప వ్యాప్తంగా  ఏ ఏ దేశాలలో శాంతియుత వాతావరణం ఎలా ఉందో ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది.
  6. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) అనేది ఆస్ట్రేలియాకు చెందిన ఒక స్వతంత్ర, పక్షపాతం లేని, లాభాపేక్షలేని సంస్థ. ఇది Global Terrorism Index, Safety Perceptions Index, Ecological Threat Report, Positive Peace Report లను కూడా విడుదల చేస్తుంది.
  7. Website: www.economicsandpeace.org
  8. Reports: www.visionofhumanity.org

Summary:


Global Peace Index
Edition Year Rank Country Score
16 2022 1 Iceland 1.107
2 New Zealand 1.269
3 Ireland 1.288
4 Denmark 1.296
5 Austria 1.3
73 Nepal 1.947
90 Sri Lanka 2.02
96 Bangladesh 2.067
135 India 2.578
147 Pakistan 2.789
163 Afghanistan 3.554
15 2021 1 Iceland 1.146
2 New Zealand 1.284
3 Denmark 1.293
4 Slovenia 1.295
5 Portugal 1.303
80 Nepal 1.981
102 Bangladesh 2.077
103 Sri Lanka 2.095
138 India 2.615
148 Pakistan 2.827
163 Afghanistan 3.6
14 2020 1 Iceland 1.104
2 Portugal 1.244
3 Austria 1.251
4 New Zealand 1.279
5 Singapore 1.304
72 Nepal 1.948
82 Sri Lanka 1.982
103 Bangladesh 2.091
140 India 2.616
149 Pakistan 2.842
163 Afghanistan 3.592
1 2007 1 Norway -
109 India -
121 Iraq -

Global Peace Index - 2022:

  1. ప్రపంచ శాంతి సూచిక (GPI - Global Peace Index) యొక్క 16వ ఎడిషన్ ను జూన్ 2022న విడుదల చేశారు.
  2. ఇందులో 163 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు.
  3. ప్రపంచంలోని 99.7 శాతం జనాభా ఈ దేశాలలోనే నివసిస్తున్నారు.
  4. ఇందులోని 23 సూచికలలో పది మెరుగుదలలు నమోదుచేయగా, 13 క్షీణించాయి.
  5. ప్రపంచ శాంతియుతత యొక్క సగటు స్థాయి గత సంవత్సరం కంటే 0.3 శాతం క్షీణించింది.
  6. మొత్తం 163 దేశాలలో గత సంవత్సరం కంటే 90 దేశాలు మెరుగుపడగ, 71 దేశాలు క్షీణించాయి మరియు రెండు దేశాలు స్థిరంగా ఉన్నాయి.
  7. ఐస్‌లాండ్ ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా 2008 నుండి కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా ఐదవ సంవత్సరం ప్రపంచంలో అత్యంత తక్కువ శాంతియుత దేశంగా ఉంది.
  8. ఇందులో 23 అంశాలను/సూచికలను (Indicators) కొలమానంగా తీసుకుని ప్రపంచ దేశాలకు అక్కడి శాంతియుత స్థాయిని బట్టి 1-5 మధ్య వచ్చిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు.
Global Peace Index - 2022
Edition Year Rank Country Score
16 2022 1 Iceland 1.107
2 New Zealand 1.269
3 Ireland 1.288
4 Denmark 1.296
5 Austria 1.3
73 Nepal 1.947
90 Sri Lanka 2.02
96 Bangladesh 2.067
135 India 2.578
147 Pakistan 2.789
163 Afghanistan 3.554



వీటిని కూడా చూడండి:




No comments:

Post a Comment