Monday, May 29, 2023

Indus Valley Civilization in Telugu | సింధు నాగరికత | Student Soula

దయచేసి మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.... Contact: studentsoula@gmail.com

Indus Valley Civilization in Telugu | సింధు నాగరికత | Student Soula


  1. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత: మెసపటోమియా/ సుమేరియా నాగరికత (ఇరాక్)
  2. ప్రపంచంలో రెండవ మరియు ఆఫ్రికా ఖండంలో మొదటి నాగరికత: ఈజిప్టు నాగరికత
  3. ప్రపంచంలో మూడవ మరియు దక్షిణాసియాలో మొదటి నాగరికత: సింధు నాగరికత
  4. భారత పురాతత్వ శాఖ (ASI) డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ (1902-1928) నాయకత్వంలో సింధు నాగరికత తవ్వకాలు 1921లో నిర్వహించారు.

పేరు (Name):
  1. ఈ నాగరికత సింధునది దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో విలసిల్లినందువల్ల దీన్ని సింధు నాగరికత/ సింధులోయ నాగరికతగా వ్యవహరిస్తారు.
  2. తొలిసారిగా హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో దీన్ని హరప్పా నాగరికత అని కూడా అంటారు.
  3. హరప్పా నాగరికత అని పేరు పెట్టింది: సర్ జాన్ మార్షల్

కాలం (Timeline):
  1. కార్బన్ డేటింగ్ ప్రకారం: 2300-1750
  2. కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం: 2750-1500
  3. రోమిలా థాపర్ ప్రకారం: 3500-1750
  4. ఉన్నత దశలో ఉన్నకాలం: 2500-1750
  5. పరిపక్వ చెందిన దశ: 2600-1900

సరిహద్దులు (Boundaries):
  1. ఉత్తరం: మాండ (జమ్ము జిల్లా, జమ్ము & కాశ్మీర్)
  2. దక్షిణం: దైమాబాద్ (మహారాష్ట్ర)
  3. తూర్పు: ఆలంఘిర్ పూర్ (సహరాన్ పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్)
  4. పశ్చిమం: సూత్కాజెండార్ (మార్కన్ తీరం, పాకిస్తాన్)

**తవ్వకాలలో బయటపడిన ముఖ్యమైన ప్రాంతాలు**
హరప్పా (Harappa):
  1. ఈ ప్రాంతాన్ని కనుగొన్నది: దయారాం సహానీ (1921)
  2. ఇది మౌంట్ గోమరి జిల్లాలో (పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్) రావి నది ఒడ్డున ఉంది.
  3. సింధు నాగరికత విశేషాలు మొదటగా బయటపడింది ఇక్కడే.
  4. ఋగ్వేదంలో హరప్పా నగరం గురించి హరిపియం అని వివరించబడింది.
  5. సింధు నాగరికతకు హరప్పా అని పేరు పెట్టింది: సర్ జాన్ మార్షల్
  6. హుయాన్ త్సాంగ్ వర్ణించిన హొ-స నగరం హరప్పా అని అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అభిప్రాయ పడ్డారు.
  7. రెండు వరుసలలో 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి. కావున దీనిని ధాన్యాగారాల నగరం (సిటీ ఆఫ్ గ్రానరీస్) అంటారు.
  8. చెక్కతో చేసిన శవపేటికలు, విదేశీయుడి శవాన్ని ఖననం చేసిన గుర్తులు, కాల్చిన ఇటుకలతో కట్టిన గోడలు, పాశ్చాత్యులు ఉపయోగించే మరుగుదొడ్లు, 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశం, అమ్మతల్లికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.

మొహెంజొదారో (Mohenjo-daro):
  1. ఈ ప్రాంతాన్ని కనుగొన్నది: ఆర్.డి.బెనర్జీ (1922-1922)
  2. ఇది లార్ఖానా జిల్లాలో (సింధ్ రాష్ట్రం, పాకిస్తాన్) సింధు నదికి కుడివైపున ఉంది.
  3. ఇది సింధు నగరాలలో అతిపెద్ద నగరం.
  4. మొహెంజొదారో అనగా: మృతుల దిబ్బ
  5. 7సార్లు వరదలకు గురైన నగరం.
  6. ఇక్కడ మహాస్నానవాటిక బయటపడింది. దీనిని సర్ జాన్ మార్షల్ కనుగొన్నాడు.
  7. అధిక ముద్రలు (1398) బయటపడిన ప్రదేశం.
  8. పశుపతి విగ్రహం, నృత్యం చేస్తున్న కంచుతో తయారుచేసిన బొమ్మ, గడ్డపు మనిషి యొక్క స్టియలైట్ విగ్రహం, మూపురం లేని ఎద్దు, మూపురం ఉన్న ఎద్దు, కుక్క, పక్షులు, ఎర్రటి గుడ్డ ముక్క, శివలింగాలు, అనేక స్థంభాలతో కూడిన అసెంబ్లీ  హాలు నిర్మాణం, తూనిక రాళ్ల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు, అతిపెద్ద ధాన్యాగారం లభ్యమయ్యాయి.

చన్హుదారో (Chanhudaru):
  1. ఈ ప్రాంతాన్ని కనుగొన్నది: ఎన్.జి.ముజుందార్ (1931)
  2. తవ్వకాలు జరిపింది: E.J.H.మాకే (1935-36)
  3. ఇది పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్రంలో సింధు నది తీరంలో ఉంది.
  4. ఈ నగరాన్ని భారతదేశ లాంక్ షైర్ గా పేర్కొంటారు.
  5. కోటగోడ లేని ఏకైక నగరం.
  6. భూగర్భ మురికి నీటి వ్యవస్థగల నగరం.
  7. దీనిని బొమ్మల కేంద్రంగా పిలుస్తారు.
  8. పూసల తయారికి ప్రసిద్ధి చెందిన నగరం.
  9. రాగితో తయారైన ఇనుప పరికరాలు, ఇంక్ బాటిల్ ను పోలిన మట్టి పాత్ర, పిల్లికి సంబంధించిన ఆధారాలు, టెర్రకోట ఎద్దు బండి, కంచు బొమ్మ బండి, నటరాజ విగ్రహం, లిఫ్టిక్లు, ముద్రికలను తయారు చేయు పరిశ్రమ లభ్యమయ్యాయి.

కాళీభంగన్ (Kalibangan):
  1. దీనిని కనుగొన్నది: అమలానంద ఘోష్ (1953)
  2. ఇది రాజస్థాన్ లోని ఘగ్గర్ నది తీరంలో ఉంది.
  3. కాళీభంగన్ అనగా: నల్ల గాజులు
  4. ఇది గాజుల తయారీకి ప్రసిద్ధి చేందిన నగరం.
  5. ఇక్కడ దుర్గంతో పాటు నగరం మొత్తానికి ప్రహారి గోడ కలదు.
  6. యజ్ఞయాగాదులు నిర్వహించిన గుర్తులు, భూమిని దున్నిన ఆధారాలు (నాగలి గుర్తులు), తందూరి పొయ్యిలు, భూకంపం వచ్చినట్టుగా ఆధారాలు, సర్పలేఖనం (హరప్పా లిపి గర్తు), ఒంటె అవశేషాలు, ఇటుకలతో నిర్మించిన సమాధుల ఆనవాళ్ళు లభ్యమయ్యాయి.

లోథాల్ (Lothal):
  1. ఈ ప్రాంతాన్ని కనుగొన్నది: ఎస్.ఆర్.రావు (1955)
  2. ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో భాగావో నది తీరంలో ఉంది.
  3. దీనిని మినీ హరప్పా నాగరికత నగరం లేదా కాస్మో పాలిటన్ నగరం అంటారు.
  4. గుజరాతీ భాషలో లోథాల్ అనగా: మృతుల దిబ్బ
  5. ఇది హరప్పా నాగరికతలో ఏకైక సహజ ఓడరేవుగల నగరం.
  6. ఇది పూసల తయారికి ప్రసిద్ధి చెందిన నగరం.
  7. చదరంగం ఆడిన గుర్తులు, స్త్రీ-పురుషుల శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసిన ఆనవాళ్ళు, అగ్ని గుండాలు, రంగులు వేసిన జాడీలు, వరిపొట్టు అవశేషాలు, కంచుతో తయారుచేసిన కొలబద్ధ, మృణ్మయ పాత్రలు, పాచికలు లభ్యమయ్యాయి.

బన్వాలి (Banawali):
  1. గ్రిడ్ వ్యవస్థ ప్రకారం నిర్మాణం జరగని ఏకైక పట్టణం.
  2. హర్యానాలోని సరస్వతి నది తీరంలో ఉంది.
  3. వృత్తాకారంలో నిర్మించిన నగరం.
  4. బార్లీ పంట పండించిన ఆధారాలు లభ్యమయ్యాయి.

రాఖిగర్హి (Rakhigarhi):
  1. ఇది ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధు నాగరికత నగరం.
  2. ఇది హర్యానాలో ఉంది.

రోపార్ (Ropar):
  1. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ లో బయటపడిన మొదటి నగరం (1953)
  2. ఇది పంజాబ్ లోని సట్లేజ్ నది తీరంలో ఉంది
  3. దీనిని కనుగొన్నది: వై.డి.శర్మ
  4. మనిషి శవంతో పాటు కుక్కను కూడా సమాధి చేసిన ఆనవాళ్ళు లభ్యమయ్యాయి.

దోలవీర (Dholavira):
  1. ఇది గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉంది.
  2. క్రీడా ప్రాంగణం, ఎడ్ల బండ్లు, జలాశయం బయటపడ్డాయి.
  3. విశాలమైన కోటగోడలు, కోట లోపలి భాగంలో గొప్పవారి ఇళ్ళు, మధ్య పట్టణంలో అధికారంలో ఉన్నవారి చుట్టాల ఇళ్ళు, కింది పట్టణంలో కార్మికుల ఇళ్ళు ఉన్నాయి.
  4. మూడు భాగాలు కలిగిన (ఎగువ, మధ్య, దిగువ) ఏకైక నగరం.

సుర్క్ టోడా (Surkotada):
  1. గుర్రం అవశేషాలకు సంబంధించిన ఆధారాలు కలవు.
  2. రాతి కోటతో పరివేష్టితమై ఉన్న ఏకైక నగరం.
  3. ఇది గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉంది.

ముఖ్యమైన అంశాలు:
  1. వీరు ప్రధానంగా అమ్మతల్లిని పూజించేవారు.
  2. సింధు ప్రజల పురుష దైవం: పశుపతి
  3. ఇది మొట్టమొదట లోహాల వాడకం, లిపి రాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత.
  4. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత.
  5. పూజించే వృక్షం: రావి
  6. పూజించే పక్షి: పావురం
  7. పూజించే జంతువు: మూపురం కలిగిన ఎద్దు
  8. ఉపయోగించే రాయ:  స్టియటైట్
  9. వీరి లిపి: బొమ్మల/ చిత్ర/ సర్ప/ నాగవల్లి లిపి. దీనిని కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాసేవారు.
  10. తెలియని లోహం: ఇనుము
  11. ఆరాధించే చిహ్నం: స్వస్తిక్ గుర్తు
  12. నది దేవత వాహనం: మొసలి
  13. వీరు ప్రపంచంలో మొదటగా పత్తిని పండించినవారు.
  14. సింధు ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం: ఎక్కా బండ్లు (ఎడ్ల బండి)
  15. వీరి సమాజం మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉండేదని పేర్కొన్నది: సర్ జాన్ మార్షల్
  16. ప్రపంచంలో స్నానఘటం కలిగి ఉన్న ఏకైక నాగరికత
  17. ప్రపంచంలో మొదటగా వెండిని వాడింది వీరే
  18. సింధు ప్రజలు చనిపోయినవారిని  పూడ్చి పెట్టేవారు.
  19. భారతదేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా గల రాష్ట్రం: గుజరాత్








No comments:

Post a Comment