Home

Thursday, April 27, 2023

What is Tennis in Telugu | టెన్నిస్ గురించి పూర్తిగా తెలుసుకోండి | Student Soula

What is Tennis in Telugu | టెన్నిస్ గురించి పూర్తిగా తెలుసుకోండి | Student Soula


టెన్నిస్ (Tennis):
  • టెన్నిస్ నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటిగా కొనసాగుతోెంది.
  • టెన్నిస్ అనేది కోర్టులో రాకెట్ మరియు బంతితో ఆడే క్రీడ.
  • కోర్టు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది మరియు నెట్ ద్వారా రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది.
  • ఆట యొక్క లక్ష్యం బంతిని నెట్ మీదుగా ప్రత్యర్థి కోర్టులోకి కొట్టడం, వారికి బంతిని తిరిగి ఇవ్వడం కష్టతరం చేయడం.
  • మ్యాచ్ గెలవడానికి ఆటగాడు నిర్దిష్ట సంఖ్యలో పాయింట్లను గెలవాలి.
  • టెన్నిస్ సాధారణంగా మట్టి, గడ్డి, కఠినమైన కోర్టులతో సహా వివిధ ఉపరితలాలపై ఆడబడుతుంది.
  • ఇది నేడు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ తో సహా అనేక విభిన్న రూపాల్లో ఆడబడుతుంది.
  • సింగిల్స్: ఇద్దరు ఆటగాళ్లు ఒకరితో ఒకరు పోటిపడతారు.
  • డబుల్స్: ఇద్దరు ఆటగాళ్ల జట్లు ఒకరితో ఒకరు పోటీపడతారు. (పరుషుల డబుల్స్/ మహిళల డబుల్స్)
  • మిక్స్‌డ్ డబుల్స్: ఒక పురుషుడు మరియు ఒక మహిళతో కూడిన జట్టు, ఇంకొక పురుషుడు మరియు మహిళతో కూడిన జట్టుతో పోటీపడతారు.
  • టెన్నిస్ కు 12వ శతాబ్దం నాటి గొప్ప చరిత్ర ఉంది. ఇది మొదట ఫ్రాన్స్ లో ఆడబడింది. తర్వాత త్వరగా ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.
  • ప్రస్తుత రూపంలో ఉన్న టెన్నిస్ 1870లలో ఇంగ్లాండులో ఉద్భవించింది.
  • ITF, ATP, WTA లు ఆయా దేశాల జాతీయ సంఘాలతో కలిసి అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలను నిర్వహిస్తాయి.

ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF):
  • ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) అనేది ప్రపంచ టెన్నిస్ యొక్క పాలక సంస్థ.
  • టెన్నిస్ క్రీడకు సంబంధించిన అంతర్జాతీయ పోటీలను పర్యవేక్షించడం, నియమాలు, నిబంధనలను ఏర్పాటు చేయడం, వాటిని అమలు చేయడం, యాంటీ డోపింగ్, అవినీతి నిరోధక కార్యక్రమాల ద్వారా క్రీడ యొక్క సమగ్రతను కాపాడడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడను ప్రోత్సాహించడం వంటి బాధ్యతలను కలిగి ఉంది.
  • ఇది క్రీడాకారులకు అధికారిక ర్యాంకింగ్ లను కూడా ఇస్తుంది.
  • ఇది 1 మార్చి 1913న పారిస్ లో స్థాపించబడింది. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది.
  • మొదట్లో దీని పేరు అంతర్జాతీయ లాన్ టెన్నిస్ ఫెడరేషన్ (ILTF) గా ఉండేది. 1977లో దాని పేరు నుండి 'లాన్' ని తొలగించారు. లాన్ (Lawn) అనేది టెన్నిస్ ఆడగలిగే గడ్డి ఉపరితలాన్ని (Grass Court) సూచించడానికి ఉపయోగించే పదం.
  • ఇది టెన్నిస్ ను నియంత్రించడానికి ATP మరియు WTA లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
  • Website: www.itftennis.com

అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ATP):
  • అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ATP) అనేది పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్ సంస్థ.
  • దీనిని 1972లో స్థాపించారు. దీని ద్వారా పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్ అన్నింటినీ ఒకే టూర్ లో ఏకం చేశారు.
  • ప్రపంచవ్యాప్తంగా పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్లు మరియు ఈవెంట్లను నిర్వహించడానికి మరియు ప్రోత్సాహించడానికి ATP బాధ్యత వహిస్తుంది.
  • ఇది ATP Tour మరియు ATP Challenger Tour అనే వివిధ దేశాలలో ఏడాది పొడవునా నిర్వహించే టోర్నమెంట్ల శ్రేణిని కలిగి ఉంటుంది.
  • ATP Tour లో ATP 250, ATP 500, ATP 1000 టోర్నమెంట్లు మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు కూడా ఉంటాయి.
  • ఇది పురుషుల సింగిల్స్ మరియు డబుల్స్ క్రీడాకారుల అధికారిక ర్యాంకింగ్లను కూడా నిర్వహిస్తుంది.
  • Website: www.atptour.com

మహిళల టెన్నిస్ అసోసియేషన్ (WTA):
  • మహిళల టెన్నిస్ అసోసియేషన్ (WTA) అనేది మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్ సంస్థ.
  • దీనిని 1973లో బిల్లీ జీన్ కింగ్ స్థాపించారు. దీని ద్వారా మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్ అన్నింటినీ ఒకే టూర్ లో ఏకం చేశారు.
  • ప్రపంచవ్యాప్తంగా మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్లు మరియు ఈవెంట్లను నిర్వహించడానికి మరియు ప్రోత్సాహించడానికి WTA బాధ్యత వహిస్తుంది.
  • ఇది WTA Tour అనే వివిధ దేశాలలో ఏడాది పొడవునా నిర్వహించే టోర్నమెంట్ల శ్రేణిని కలిగి ఉంటుంది.
  • WTA Tour లో WTA 125, WTA 250, WTA 500, WTA 1000 టోర్నమెంట్లు మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు కూడా ఉంటాయి.
  • ఇది మహిళల సింగిల్స్ మరియు డబుల్స్ క్రీడాకారుల అధికారిక ర్యాంకింగ్లను కూడా నిర్వహిస్తుంది.
  • Website: www.wtatennis.com

టోర్నమెంట్లు (Tournaments):
టెన్నిస్ లో అంతర్జాతీయంగా అత్యంత ప్రముఖమైన పోటీలలో కొన్ని;

టెన్నిస్ - బ్యాడ్మింటన్ మధ్య తేడా:
టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ రెండూ రాకెట్ క్రీడలు, కానీ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. ఆ తేడాల్లో ముఖ్యమైనవి;
  • రాకెట్: రెండు క్రీడలు పూర్తిగా భిన్నమైన రాకెట్‌ను కలిగి ఉంటాయి. బ్యాడ్మింటన్ రాకెట్లు సాధారణంగా 90 గ్రాముల కంటే తక్కువ బరువు కలిగి ఉంటాయి, అయితే టెన్నిస్ రాకెట్లు బరువుగా ఉంటాయి. 
  • కోర్టు పరిమాణం: బ్యాడ్మింటన్ కోర్ట్ కంటే టెన్నిస్ కోర్ట్ పెద్దది. టెన్నిస్ కోర్ట్ దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది మరియు 78 అడుగుల పొడవు 27 అడుగుల వెడల్పు ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్ చిన్నది, 44 అడుగుల పొడవు మరియు 20 అడుగుల వెడల్పు ఉంటుంది.
  • బంతి రకం: టెన్నిస్ ఒక పెద్ద, బరువైన బంతితో ఆడబడుతుంది, అది గాలితో నిండి ఉంటుంది. బ్యాడ్మింటన్ ఈకలు లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేయబడిన చిన్న, తేలికైన షటిల్ కాక్‌తో ఆడబడుతుంది.
  • స్కోరింగ్: రెండు క్రీడల స్కోరింగ్ సిస్టమ్‌లు భిన్నంగా ఉంటాయి.





 
Back Top

No comments:

Post a Comment