History of Tennis in India in Telugu | భారతదేశంలో టెన్నిస్ | Student Soula

Tennis in India in Telugu | భారతదేశంలో టెన్నిస్ | Student Soula


భారతదేశంలో టెన్నిస్ (Tennis in India):
  • టెన్నిస్ కు 12వ శతాబ్దం నాటి గొప్ప చరిత్ర ఉంది. ఇది మొదట ఫ్రాన్స్ లో ఆడబడింది. తర్వాత త్వరగా ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.
  • ప్రస్తుత రూపంలో ఉన్న టెన్నిస్ 1870లలో ఇంగ్లాండులో ఉద్భవించింది.
  • 1880లలో బ్రిటీష్ సైన్యం మరియు సివిలియన్ అధికారులు ఈ ఆటను భారతదేశానికి తీసుకువచ్చారు.
  • లాహోర్ లో పంజాబ్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ (1885); కలకత్తాలో బెంగాల్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ (1887); అలహాబాదులో ఆల్ ఇండియా టెన్నిస్ ఛాంపియన్షిప్ (1910); టోర్నమెంట్లు జరిగాయి.
  • మార్చి 1920లో లాహోర్ (పాకిస్తాన్) లో AITA స్థాపించబడింది.

AITA:
  • ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) అనేది భారతదేశంలో టెన్నిస్ పాలకమండలి.
  • ఇది మార్చి 1920లో లాహోర్ (పాకిస్తాన్) లో స్థాపించబడింది. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
  • ఇది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) మరియు ఆసియన్ టెన్నిస్ ఫెడరేషన్ (ATF) లకు అనుబంధంగా పనిచేస్తుంది.
  • ఇది భారతదేశంలో టెన్నిస్ టోర్నమెంట్లను నిర్వహించడం, పర్యవేక్షించడం, స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ లను షెడ్యూల్ చేయడం మరియు దేశవ్యాప్తంగా ఈ క్రీడను ప్రోత్సాహించడం వంటి బాధ్యతలను కలిగి ఉంది.
  • Website: www.aitatennis.com
  • ప్రధాన టోర్నమెంట్లలో భారత టెన్నిస్ క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల జాబితా Click Here



Back Top