Table of Contents :-
గ్రాండ్ స్లామ్ (Grand Slam):
- టెన్నిస్ లో 4 అతి ముఖ్యమైన టోర్నమెంట్లను గ్రాండ్ స్లామ్ అంటారు.
- వీటిని మేజర్స్ అని కూడా పిలుస్తారు.
- ఇవి ప్రతి సంవత్సరం దాదాపు రెండు వారాల పాటు జరుగుతాయి.
- ITF, ATP, WTA లు ఆయా దేశాల టెన్నిస్ పాలక మండలితో కలిసి వీటిని నిర్వహిస్తాయి.
- గ్రాండ్ స్లామ్ లో అతి పురాతనమైనది ⇒ వింబుల్డన్ (1877)
- Website: www.itftennis.com
- గణాంకాలు (Click Here )
# | Month | City | Country | Surface |
---|---|---|---|---|
Australian Open (1905) | January/ February | Melbourne | Australia | Hard |
French Open (1891) | May - June | Paris | France | Clay |
Wimbledon (1877) | June - July | London | United Kingdom | Grass |
US Open (1881) | August - September | New York City | United States | Hard |
గ్రాండ్ స్లామ్ లో అత్యధిక టైటిల్ విజేతలు | ||
---|---|---|
Category | Player | Count |
Men's singles | Novak Djokovic (Serbia) |
23 |
Rafael Nadal (Spain) |
22 | |
Roger Federer (Switzerland) |
20 | |
Women's singles | Margaret Court (Australia) |
24 |
Serena Williams (USA) |
23 |
ఓపెన్ ఎరా (Open Era):
- టెన్నిస్‌లో ఓపెన్ ఎరా అనేది టెన్నిస్ చరిత్రలో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లు మరియు ఇతర ప్రధాన టెన్నిస్ ఈవెంట్‌లలో పాల్గొనేందుకు ప్రొఫెషనల్ ప్లేయర్‌లను అనుమతించిన కాలాన్ని సూచిస్తుంది. 1968లో ప్రారంభమైన ఓపెన్ ఎరాకు ముందు, కేవలం ఔత్సాహిక క్రీడాకారులు మాత్రమే ఈ ఈవెంట్‌లలో పాల్గొనేందుకు అనుమతించబడ్డారు, అయితే ప్రొఫెషనల్ ప్లేయర్‌లు మినహాయించబడ్డారు. దీనర్థం టెన్నిస్ చరిత్రలో రాడ్ లావెర్ వంటి గొప్ప ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా మారినందున అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌లలో పోటీ పడలేకపోయారు.
- మొదటి ఓపెన్ టోర్నమెంట్ ⇒ బ్రిటీష్ హార్డ్ కోర్ట్ ఛాంపియన్‌షిప్ (ఏప్రిల్ 1968)
- మొదటి ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ⇒ ఫ్రెంచ్ ఓపెన్ (మే 1968)
ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open):
- ఆస్ట్రేలియన్ ఓపెన్ సంవత్సరంలో జరిగే మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్.
- ఇది ఏటా జనవరి/ ఫిబ్రవరి లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది.
- మొదటి ఎడిషన్ నవంబర్ 1905లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోని వేర్ హౌస్ మ్యాన్స్ క్రికెట్ గ్రౌండ్ లోని గ్రాస్ కోర్టులో జరిగింది.
- ప్రస్తుతం దీనిని హార్డ్ కోర్ట్ లో ఆడుతారు.
- మహిళా టెన్నిస్ టోర్నమెంట్లు 1922 నుండి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చేర్చబడ్డాయి.
- ఈ పోటీని 1927 నుండి ఆస్ట్రేలియన్ ఛాంపియన్‌షిప్ పేరుతో నిర్వహించేవారు మరియు 1969లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గా మారింది.
- ఇది ఆస్ట్రేలియా టెన్నిస్ పాలక మండలి అయినా టెన్నిస్ ఆస్ట్రేలియా ద్వారా నిర్వహించబడుతుంది.
- Website: www.ausopen.com
- గణాంకాలు (Click Here )
అత్యధిక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ విజేతలు | ||
---|---|---|
Category | Player | Count |
Men's singles | Novak Djokovic (Serbia) |
10 |
Women's singles | Margaret Court (Australia) |
11 |
ఫ్రెంచ్ ఓపెన్ (French Open):
- దీనిని రోలాండ్ గారోస్ అని కూడా పిలుస్తారు.
- ఇది ప్రతి ఏటా మే - జూన్ లో పారిస్ లో జరుగుతుంది.
- మొదటి ఎడిషన్ 1891లో ఇసుక కోర్టులో జరిగింది.
- ప్రస్తుతం దీనిని క్లే కోర్ట్ లో ఆడుతారు.
- మహిళా టెన్నిస్ టోర్నమెంట్లు 1897 నుండి ఫ్రెంచ్ ఓపెన్ లో చేర్చబడ్డాయి.
- 1925లో మొదటిసారిగా అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు.
- దీనిని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (FFT) నిర్వహిస్తుంది.
- Website: www.rolandgarros.com
- గణాంకాలు (Click Here )
అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ విజేతలు | ||
---|---|---|
Category | Player | Count |
Men's singles | Rafael Nadal (Spain) |
14 |
Women's singles | Chris Evert (USA) |
7 |
వింబుల్డన్ (Wimbledon):
- దీనిని వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ అని కూడా పిలుస్తారు.
- ఇది ప్రతి ఏటా జూన్ - జులైలో లండన్ లో జరుగుతుంది.
- మొదటి ఎడిషన్ 1877లో జరిగింది.
- ప్రస్తుతం దీనిని గ్రాస్ కోర్ట్ లలో ఆడుతారు.
- మహిళా టెన్నిస్ టోర్నమెంట్లు 1884 నుండి వింబుల్డన్ లో చేర్చబడ్డాయి.
- ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన టెన్నిస్ టోర్నమెంట్.
- Website: www.wimbledon.com
- గణాంకాలు (Click Here )
అత్యధిక వింబుల్డన్ టైటిల్స్ విజేతలు | ||
---|---|---|
Category | Player | Count |
Men's singles | Roger Federer (Switzerland) |
8 |
Women's singles | Martina Navratilova (USA) |
9 |
US ఓపెన్ (US Open):
- ఇది సంవత్సరంలో నాల్గవ మరియు చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్.
- ఇది ఏటా ఆగస్టు - సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరుగుతుంది.
- మొదటి ఎడిషన్ 1881లో గ్రాస్ కోర్ట్ పై జరిగింది.
- దీనిని ప్రస్తుతం హార్డ్ కోర్ట్ పై ఆడుతారు.
- మహిళా టెన్నిస్ టోర్నమెంట్లు 1887 నుండి US ఓపెన్ లో చేర్చబడ్డాయి.
- దీనిని యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (USTA) నిర్వహిస్తుంది.
- Website: www.usopen.org
- గణాంకాలు (Click Here )
అత్యధిక US ఓపెన్ టైటిల్స్ విజేతలు | ||
---|---|---|
Category | Player | Count |
Men's singles | Richard Sears (USA) |
7 |
William Larned (USA) |
||
Bill Tilden (USA) |
||
Women's singles | Molla Mallory (Norway & USA) |
8 |